Share News

CM Revanth Reddy: ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లికి రేవంత్..

ABN , Publish Date - Jan 29 , 2024 | 08:40 AM

ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్నారు.

CM Revanth Reddy: ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లికి రేవంత్..

ఆదిలాబాద్: ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లో ఇన్‌చార్జి మంత్రి సీతక్క, జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి తొలి సభ జరగనుంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించిన ఆయన సీఎం అయిన తర్వాత కూడా తొలి సభను అక్కడే నిర్వహించబోతున్నారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనానికి శంఖుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచన చేశారు.

Updated Date - Jan 29 , 2024 | 08:40 AM