Share News

Hyderabad: చంచల్‌గూడ జైలుకు సీసీఎస్‌ ఏసీపీ

ABN , Publish Date - May 23 , 2024 | 02:58 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎ్‌స(ఈవోడబ్ల్యూ) ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Hyderabad: చంచల్‌గూడ జైలుకు సీసీఎస్‌ ఏసీపీ

  • ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ, మే 22 (ఆంఽధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎ్‌స(ఈవోడబ్ల్యూ) ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రిమాండ్‌ విధించించారు. అధికారులు అతణ్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతణ్ని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని, మరింత సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఏసీబీ దాడుల్లో ఉమామహేశ్వరరావు ఆస్తుల విలువను రూ.3.95 కోట్లుగా(బహిరంగ మార్కెట్‌లో రూ.25 కోట్లకు పైనే) లెక్కగట్టిన అధికారులు బ్యాంకు లాకర్లను తెరిచేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - May 23 , 2024 | 02:58 AM