Share News

DSC Notification: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

ABN , Publish Date - Feb 28 , 2024 | 09:59 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు (Dsc) చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గత నోటిఫికేషన్ రద్దు చేస్తూ ‘కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్’ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు పాఠశాల విద్య శాఖ వెల్లడింది.

DSC Notification: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు (Dsc) చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గత నోటిఫికేషన్ రద్దు చేస్తూ ‘కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్’ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు పాఠశాల విద్య శాఖ వెల్లడింది. గతంలో అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులను కొత్త నోటిఫికేషన్‌‌కు వర్తింపజేస్తామని వెల్లడించారు. గతంలో అప్లై చేసుకున్న వారు మరో మారు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వివరించారు. కాగా రేపు (గురువారం) కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Feb 28 , 2024 | 10:00 PM