KTR: తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఎటాక్
ABN , Publish Date - Mar 06 , 2024 | 10:02 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. రేవంత్‌కు తెలంగాణ ఆత్మ లేదని, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని, అందుకే తెలంగాణ ‘ఆత్మగౌరవం’పై ప్రధాని మోదీ (PM Modi) సాక్షిగా సీఎం దాడి చేశారని మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. రేవంత్‌కు తెలంగాణ ఆత్మ లేదని, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని, అందుకే తెలంగాణ ‘ఆత్మగౌరవం’పై ప్రధాని మోదీ (PM Modi) సాక్షిగా సీఎం దాడి చేశారని మండిపడ్డారు. అసలు తెలంగాణ సోయి లేనోడు రాష్ట్రానికి సీఎం కావడం మన ఖర్మ అని, తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. అసలు గోల్‌మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణ మోడల్‌తో పోలికెక్కడిది అని ప్రశ్నించారు. ఘనమైన గంగా, జమునా తెహజీబ్ మోడల్ కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే ‘గోద్రా అల్లర్ల మోడల్’ నీకు నచ్చిందా? అని నిలదీశారు.
నిన్నటిదాకా గుజరాత్ మోడల్‌పై (Gujarat Model) నిప్పులు చెరిగిన సీఎం రేవంత్.. ఇప్పుడు ప్రధాని మోదీ తన పక్కన సీటు ఇవ్వగానే గొప్పలా? అని కేటీఆర్ విమర్శించారు. ఇదేం నీతి, ఇదే రీతి అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ మోడల్ (Telangana Model) అంటే.. సమున్నత సంక్షేమ నమూనా, సమగ్ర అభివృద్ధికి చిరునామా అని వివరణ ఇచ్చారు. యావత్ దేశానికే తెలంగాణ మోడల్ నచ్చిందని పేర్కొన్నారు. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్ అని.. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించపరుస్తావా? అని నిప్పులు చెరిగారు. నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? అని ఉద్ఘాటించారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా? అని తూర్పారపట్టారు.
నాడు తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావని.. నేడు తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. నిన్ను చరిత్ర ఏమాత్రం క్షమించదని హెచ్చరించారు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదని పేర్కొన్నారు. తమ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తిందని.. కానీ కాంగ్రెస్ నేడు దాన్ని పాతాళంలో పాతిపెట్టేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి