Share News

TG News: గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 22 , 2024 | 08:45 PM

బీఆర్ఎస్ నేతలు వరుసగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్, బీజేపీలో చేరుతుండటంతో ఆ పార్టీ అధిష్ఠానం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy)ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC)లు శుక్రవారం నాడు కలిశారు. గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, యాదవరెడ్డి ఉన్నారు. పార్టీ మారిన పట్న మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్సీలు కోరారు.

 TG News: గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. కారణమిదే..?

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు వరుసగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో చేరుతుండటంతో గులాబీ పార్టీ అధిష్ఠానం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy)ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC)లు శుక్రవారం నాడు కలిశారు. శాసనమండలి చైర్మన్‌ని కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, యాదవరెడ్డి ఉన్నారు. పార్టీ మారిన పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని కోరారు. బీఆర్‌ఎస్ నుంచి ఎంపికై పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పిటిషన్ అందించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డిను కలిసినట్లు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ బీ ఫారం మీద ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన కె .దామోదర్ రెడ్డి , పి .మహేందర్‌రెడ్డిలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని చైర్మన్‌కు సాక్ష్యాధారాలతో సహా పిటిషన్ సమర్పించామని అన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంగించిన వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. చైర్మన్ తమ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించి ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తారని భావిస్తున్నామని శేరి సుభాష్ రెడ్డి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 08:45 PM