Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Sep 03 , 2024 | 06:48 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-09-03T21:12:35+05:30
అలర్ట్.. ఏలూరు కాలువలోకి బుడమేరు నీరు..
విజయవాడ: ఏలూరు కాలువలోకి పారుతున్న బుడమేరు నీరు.
అప్రమత్తం అయిన ప్రభుత్వం యంత్రాంగం.
మధురానగర్, రామవరప్పాడు, ప్రసాదంపాడు ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.
ఏలూరు కాలువలో వరద ప్రవాహం పెరగడంతో కట్టలు తెగే ప్రమాదం.
కాలువ గట్టున ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మైక్ ద్వారా ప్రచారం.
ఆందోళన లో ఏలూరు కాలువ గట్ల ప్రాంత ప్రజలు.
-
2024-09-03T20:20:15+05:30
వరద బాధితులకు అండగా పవన్.. భారీ విరాళం ప్రకటన..
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటీ ప్రకటించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలన చేసిన పవన్ కళ్యాణ్.
రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్.
-
2024-09-03T19:27:13+05:30
జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగబాబు..
ట్విట్టర్ ద్వారా జగన్‌కు కౌంటర్ ఇచ్చిన జనసేన నేత నాగబాబు
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కృష్ణానది వరదల విజిట్‌కి వచ్చి, వరదల్ని మ్యాన్ మేడ్ డిజార్టర్ అని సెలవిచ్చారు.
ఆయనకు నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను.
మూడేళ్ల క్రితం (2021) అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు.
15 మంది జాడ తెలియలేదు. ఐదు ఊర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
ఎటుచూసినా కూలిన ఇళ్లు. ఇంకా గూడారాల మధ్యనే అనేకమంది నివాసం.
చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. అందుకోసం నదిలో లారీలు దిగుతాయి.
డ్యాం గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి కాబట్టి, వాటిని పైకి తరలించే వరకూ డ్యాం గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది ప్రధాన ఆరోపణ.
రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వలనే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని, ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ పార్లమెంటులో అన్నారు.
దీన్ని అంటారు సార్... Man Made Disaster అని.
మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి నేచురల్ డిజాస్టర్‌కి, మ్యాన్ మేడ్ డిజాస్టర్‌కి తేడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
మీరు డ్యామ్ గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వలన, మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయడం వలన జరిగిన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడాన్ని అంటారు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని.
వీలైతే ముంపు ప్రాంతాల్ని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్ధికంగా ఆదుకుంటే బాగుంటుంది.
విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బావుంటుంది అని విన్నవిస్తున్నాను.
-
2024-09-03T17:10:27+05:30
ఖమ్మం నగరంలో మళ్లీ ప్రారంభమైన వర్షం
వర్షంలోనే కొనసాగుతున్న సహాయక చర్యలు.
ఇంకా మోకాళ్ళలోతు బురదలోనే వరద బాధితులు.
ఫైర్ ఇంజన్లతో బురదను తొలగించే పనిలో అధికారులు.
ఇల్లు, కాలనీలను ముంచెత్తిన బురద.
ఎక్కడ చూసినా తీవ్రదుర్గంధం చెత్తాచెదారం.
ఇళ్లలోకి వస్తున్న పాములు, తేళ్లు, విష సర్పాలు.
భయాందోళనలో ముంపు ప్రాంతాల ప్రజలు.
-
2024-09-03T16:59:57+05:30
బాలయ్య పెద్ద మనసు.. వరద బాధితులకు కోటి విరాళం..
తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి బాలకృష్ణ కోటి రూపాయల విరాళం.
50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.
50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం కొనసాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది.
తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ ఋణం తీరనిది.
ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను.
రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని బాలయ్య అన్నారు.
-
2024-09-03T16:49:20+05:30
భారీ వర్షాలు.. కుప్పకూలిన బ్రిడ్జి..

కరీంనగర్: భారీ వర్షాలకు కూలిన రామడుగు పాత బ్రిడ్జి.
నాలుగు మండలాలకు నిలిచిన రాకపోకలు.
ఐదేళ్లుగా పాత బ్రిడ్జిపై ఏబీఎన్ వరస కథనాలు.
కొత్త బ్రిడ్జి నిర్మాణం మధ్యలోనే వదిలేసిన గత సర్కారు.
స్వల్ప భూసేకరణ సమస్యతో పెండింగ్లో పెట్టిన అధికారులు.
ఏబీఎన్ కథనాలతో కదిలిన యంత్రాంగం.
24 గంటలుగా కొత్త బ్రిడ్జి ప్రారంభించేందుకు ప్రయత్నాలు.
బ్రిడ్జి దగ్గరే ఉండి పనులు పర్యవేక్షించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
ABN పోరాటం ఫలించిందని ఎమ్మెల్యే సత్యం ప్రశంసలు.
-
2024-09-03T15:58:01+05:30
మరో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన..

విశాఖపట్నం: కోస్తా మీదుగా కొనసాగుతున్నా ఉపరితల ఆవర్తనం.
ఋతుపవన ద్రోని ప్రభావంతో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతాను ఆనుకొని మరో అల్పపీడనం.
ఈనెల ఐదో తారీఖున ఏర్పడే అవకాశం.
రాష్ట్రంలో చెదురు మదురుగా వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు.
కృష్ణా గుంటూరులో ఓ మోస్తారు వర్షాలు.
ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం.
ఈ రెండు జిల్లాలకు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ.
-
2024-09-03T15:49:39+05:30
నామా నాగేశ్వరరావుకు బిగ్ షాక్..

మనీ లాండరింగ్ కేసులో నామ నాగేశ్వరరావు కంపెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై ఈడి చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.
రాంచి ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్, మధుకాన్ ప్రాజెక్ట్స్ పై గతంలో సిబిఐ చార్జిషీట్ దాఖలు.
రాంచి-జంషెడ్‌పూర్ మధ్య 4 లైన్ హైవే నిర్మాణానికి రూ.1,030 కోట్లు రుణాలుగా పొందిన కంపెనీ.
వచ్చిన నిధులను ఇతర సెల్ కంపెనీలకు మళ్లింపు.
పూర్తి లోన్ వచ్చినప్పటికీ నిర్మాణం పూర్తి చేయని మధుకాన్ కంపెనీ.
రూ. 365.78 కోట్లు మనీలాండరింగ్ ద్వారా మళ్లించినట్లు గుర్తించామన్న ఈడి.
గతంలో మధుకాన్ కంపెనీలపై సోదాలు నిర్వహించిన ఈడీ.
రూ. 34 లక్షల నగదుతో పాటు 105 ప్రాపర్టీస్ అటాచ్ చేసిన ఈడీ.
మధుకాన్ కంపెనీకి చెందిన రూ. 96.21 కోట్లు సీజ్ చేసిన ఈడీ.
-
2024-09-03T15:42:25+05:30
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండిచిన కేటీఆర్.
మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం.
ప్రజలకు సాయం చేయటం చేతగాక.. సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారు.
మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా?
ప్రజలకు సేవ చేయటం చేతకాదు..సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటమా? సిగ్గు చేటు.
ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి.
ఇలాంటి ఎన్ని దాడులు చేసిన సరే.. ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరు.
కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు.
మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయం.
-
2024-09-03T15:38:03+05:30
ఖమ్మంలో బీఆర్ఎస్ మాజీ మంత్రుల వాహనాలపై దాడి..
ఖమ్మం జిల్లా: ముంపు ప్రాంతాలలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పర్యటనలో పువ్వాడ అజయ్ కుమార్ వాహనాలపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
కొందరికి తలలు పగలగా.. ఒకరికి కాలు విరిగింది.
బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన మంచికంటి నగర్‌లో చోటు చేసుకోగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
2024-09-03T13:48:04+05:30
పనిచేయకుంటే వేటు తప్పదు: సీఎం చంద్రబాబు వార్నింగ్
అమరావతి: విపత్తు నిర్వహణలో సరిగ్గా పని చేయకుటే, మంత్రులకైనా వేటు తప్పదు: సీఎం చంద్రబాబు
జక్కంపూడిలో విధులు సరిగా నిర్వర్తించని ఓ అధికారిని సస్పెoడ్ చేశా
వీఆర్‌లో పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణ బాధ్యతల్లో సక్రమంగా విధులు నిర్వర్తించలేదనే ఫిర్యాదులు ఉన్నాయి
ఈ అంశంపై విచారణ జరిపిస్తున్నా
క్లిష్ట పరిస్థితుల్లో వివాదాస్పద అధికారులకు బాధ్యతలు అప్పగింత మంచి ఉద్దేశంతో జరిగిందా లేక ఓవర్ లుక్‌లో అయిందా అనేది పరిశీలిస్తున్నాం
ఏ రకంగా బాధ్యతలు అప్పగించినా పని చేయాలనే మానవత్వం సదరు అధికారులకు ఉండదా?
టోల్ ఫ్రీ నంబర్లు పనిచేయట్లేదనే ఫిర్యాదు అంగీకరిస్తున్నా
ప్రభుత్వ వ్యవస్థ ఐదేళ్లుగా పక్షవాతం వచ్చినట్లుగా పడి ఉంది
కొత్త కంట్రోల్ రూమ్ వ్యవస్థ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తా
బ్యారేజీ వద్దకు బోట్లు ఎలా కొట్టుకొచ్చాయని విచారణ జరిపిస్తున్నాం
తప్పుడు వార్తలు ఇచ్చి ఓ వర్గం మీడియా మరింత పరువు తీసుకోవద్దు

-
2024-09-03T13:42:49+05:30
సీతారాం తండాలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
మహబూబాబాద్: ప్రకృతి ప్రకోపం చూపించింది: సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది
సీతారాంనాయక్ తండా సహా మూడు తండాలను ఒకే దగ్గర పంచాయతీ ఏర్పాటు చేస్తాం
3 తండాల వాసులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం
ముంపునకు గురైన వారికి 10 రోజుల పాటు నిత్యావసర సరుకులు అందజేస్తాం
వర్షంతో సర్టిఫికెట్లు, ఇతరత్రా గుర్తింపు కార్డులు కోల్పోయినా సర్టిఫికెట్లు అందజేస్తాం.
ఆకేర్ వాగు వద్ద మరోసారి డామేజ్ జరగకుండా చర్యలు తీసుకుంటాం
వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది
-
2024-09-03T13:34:52+05:30
వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటన
మహబూబాబాద్: సీతారాంనాయక్ తండాలో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
మహబూబాబాద్‌కు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
కాసేపట్లో సీఎం రివ్యూ మీటింగ్
-
2024-09-03T13:21:16+05:30
భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోల హతం
ఛత్తీస్ గడ్: బీజాపూర్- దంతెవాడ జిల్లాల సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్
పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు
పది మంది మావోయిస్టుల హతం
లావా పురంగెల్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
కొనసాగుతోన్న కూంబింగ్ ఆపరేషన్
-
2024-09-03T13:18:21+05:30
కులగణన చేస్తే ఏమవుతోంది: వీహెచ్
హైదరాబాద్: కులగణనతో ముప్పు అని ఆర్ఎస్ఎస్ అంటుంది
ఉద్యోగ నియామకాల్లో కులగణన కావాలి, రాజకీయాల్లో వద్దని ఆర్ఎస్ఎస్ అంటుంది
కులగణన చేస్తే దేశం మునిగి పోతుందా?
ఆర్ఎస్ఎస్, బీజేపీ దేవుళ్ళ పేరుతో మీద రాజకీయాలు చేస్తున్నాయి
బీజేపీ నిజ స్వరూపం ఇప్పుడు బయట పడింది
ఇదే అంశంపై కేంద్రమంత్రి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలి
ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలపై బీసీ, ఎస్సీ, ఎస్టీలు యుద్ధం చేయాలి
కులగణన చేస్తే 90 శాతం మందికి న్యాయం జరుగుతుంది
అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు
1930లో కులగణన జరిగింది. ఆ తర్వాత జరగలేదు

-
2024-09-03T12:59:18+05:30
ఎఫ్టీఎల్ దాటిన హుస్సేన్ సాగర్ నీటిమట్టం
హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరదనీరు.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తోన్న వరద నీరు.
బంజారాహిల్స్, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద.
హుస్సెన్ సాగర్‌లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన నీటిమట్టం.
సాగర్‌లో 513.58 మీటర్లుగా ఉన్న ప్రస్తుత నీటి మట్టం.
హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు .
హుస్సేన్ సాగర్ ఇన్ ఫ్లో 2184 క్యూసెక్కులు.
తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి 1751 క్యూసెక్కుల నీటిని మూసిలోకి వదులుతున్న అధికారులు.
-
2024-09-03T12:50:38+05:30
సీతారాం నాయక్ తండాకు సీఎం రేవంత్
మహబూబాబాద్: సీతారాంనాయక్ తండాకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
2024-09-03T12:16:16+05:30
గన్నవరం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు
అమరావతి: పుణే నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు.
నాలుగు హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో విమానాశ్రయం చేరుకున్న 120 మంది సిబ్బంది.
-
2024-09-03T12:05:33+05:30
వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
అమరావతి: మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో విజయవాడలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు.
సహాయక చర్యల్లో ఆరు హెలికాప్టర్లు ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా.
బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్‌లో 2,500 ఆహార పొట్లాలు.
విజయవాడ పరిధిలో వరద ముంపునకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక చర్యలు.
మంత్రి లోకేశ్ పిలుపు మేరకు సహాయ చర్యల్లో రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ చేరుకున్న పార్టీ శ్రేణులు.
విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న 14,452 మంది నిరాశ్రయులు.
ప్రకాశం బ్యారేజి వద్ద వేగంగా తగ్గుతున్న వరద, ప్రస్తుత వరద ప్రవాహం 8,71,776 క్యూసెక్కులు.

-
2024-09-03T12:00:53+05:30
వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి: ఉదయం నుంచి జరిగిన ఆహారం పంపిణీ వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు
టెలికాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారులతో సమీక్ష
5 హెలీకాఫ్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతుందని తెలిపిన అధికారులు
హెలికాఫ్టర్, పడవలు, ట్రాక్టర్ల ద్వారా ఉదయం నుంచి ఆహారం, నీళ్లు అందిస్తున్నామని తెలిపిన అధికారులు
5 లక్షల ఆహారం, నీళ్ళ ప్యాకెట్లు సిద్ధం చేసి పంపిణీ చేశామని తెలిపిన అధికారులు
100 శాతం ఆహారం పంపిణీ జరగాలి.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని చోటకు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలి.
మూడు పూటలా ఆహారం అందించాలి
36 డివిజన్లలో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపణీకి బాధ్యత వహించాలి
క్షేత్ర స్థాయిలో ఆహారం అందింది లేనిది నిర్ధారించుకోవాలి.
రెండు రోజులు వరదలో చిక్కుకుని ఆహారం, నీరు లేక పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థ చేసుకుని అధికారులు పనిచేయాలి
మన కుటుంబమే అలాంటి కష్టంలో ఉందనే ఆలోచనతో పనిచేయాలి
నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి

-
2024-09-03T11:52:59+05:30
బెజవాడకు 300 మంది టెక్నీషియన్లు
అమరావతి: విద్యుత్ శాఖను అప్రమత్తం చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ నుంచి టెక్నీషియన్లను రప్పించిన మంత్రి రవి కుమార్
విజయవాడకు చేరుకున్న 300లకు పైగా టెక్నీషియన్లు
వరద ప్రవాహం తగ్గిన వెంటనే క్షేత్ర స్థాయిలో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రంగం సిద్దం.
బృందాల వారీగా దెబ్బతిన్న సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మరమత్తులు
కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తోన్న ఎనర్జీ స్పెషల్ సీఎస్, సీఎండీ
అధికారుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్
-
2024-09-03T11:29:17+05:30
బుడమేరుకు గండ్లు.. పూడ్చుతోన్న అధికారులు
ఎన్టీఆర్ జిల్లా: బుడమేరులో గండి పడిన ప్రాంతాన్ని పూడ్చుతోన్న ఇరిగేషన్ అధికారులు
మొత్తం మూడు చోట్ల గండ్లు పడినట్లు గుర్తించిన అధికారులు
యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టిన ఇరిగేషన్ అధికారులు
మూడు రోజుల పాటు పనులు కొనసాగే అవకాశం
బుడమేరుకు వరద ప్రవాహం తగ్గిపోవడంతో పనులు ప్రారంభించిన అధికారులు
-
2024-09-03T11:05:36+05:30
నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరదనీరు
నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ప్రవాహం
మొత్తం 26 గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో: 4,07,169 క్యూసెక్కులు.
పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.
ప్రస్తుత నీటి మట్టం : 586 అడుగులు.
ప్రస్తుతం నీటి నిల్వ : 300.32 టీఎంసీలు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.045
-
2024-09-03T11:03:07+05:30
ఆమ్రపాలి ఆకస్మిక పర్యటన
హైదరాబాద్: కూకట్ పల్లిలో పలు ప్రాంతాల్లో గ్రేటర్ కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక పర్యటన.
మైసమ్మ చెరువు, ఐడీఎల్ చెరువు, సర్దార్ నగర్‌లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్.
సర్దార్ నగర్ వరద ముంపునకు గురైన స్థానికులతో మాట్లాడిన కమిషనర్ ఆమ్రపాలి
వరద ముంపు వల్ల నాలా పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌కు ఆదేశాలు.

-
2024-09-03T10:58:25+05:30
పోటెత్తిన వరదనీరు
నెల్లూరు: సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం.
జలాశయం ఇన్ ఫ్లో 22283 క్యూసెక్కులు.
జలాశయం అవుట్ ఫ్లో 7000 క్యూసెక్కులు.
39 టీఎంసీలకు చేరిన జలాశయ నీటిమట్టం
-
2024-09-03T10:56:14+05:30
ముమ్మరంగా సహాయక చర్యలు
అమరావతి: ఉదయం నుంచి 37 ప్రాంతాలకు ఆహారం అందజేత
ఇందిరాగాంధీ స్టేడియం నుంచి హెలికాప్టర్లలో ఆహారం తరలింపు
పడవల ద్వారా ఆహారం అందజేత
-
2024-09-03T10:53:00+05:30
స్తంభించిన రవాణా వ్యవస్థ
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు రూరల్ మండలం టేకులపల్లి సమీపంలో ఎదుళ్ల వాగు వంతెనకు ఇరువైపుల గండ్లు.
తిరువూరు రూరల్ మండలం టేకులపల్లి - చౌటపల్లి గ్రామాల వద్ద ఆరు అడుగుల మేర కోతకు గురైన ప్రధాన రహదారి
గత ఐదు రోజులుగా నిలిచిన రాకపోకలు
చింతలపాడు, గానుగపాడు మీదుగా తిరిగి రాకపోకలు
తిరువూరు రూరల్ మండలం మల్లేల వద్ద అలుగు వాగు వరద ఉధృతికి కోతకు గురైన జాతీయ రహదారి.
తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలకు అనుమతి
తిరువూరు - అక్కపాలెం రహదారిలో చెరువుల వరద ఉధృతికి కరకట్ట, ప్రధాన రహదారికి గండ్లు
పలు చోట్ల కోతకు గురైన రహదారి.. ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని గ్రామాల్లో నిలిచిన రాకపోకలు
-
2024-09-03T09:58:39+05:30
జలదిగ్బంధంలో ఏడుపాయల
మెదక్: ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం జలదిగ్బంధం
ఆలయంలోకి చేరిన వరద నీరు
మూడో రోజు రాజగోపురం వద్ద నిత్య పూజలు
-
2024-09-03T09:57:04+05:30
తగ్గిన వరద ఉధృతి
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం, జూపూడి, మూలపాడు, కోటికలపూడి, దాములూరు గ్రామాల్లో తగ్గిన వరద ఉధృతి
సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
వరద ఉధృతి తగ్గిన ప్రాంతాల్లో శానిటేషన్ చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు
-
2024-09-03T09:05:36+05:30
సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: హైదరాబాద్‌లో 3, 6, 9వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు గచ్చిబౌలి స్టేడియం, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.
ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
గచ్చిబౌలిలో గల జీఎంసీబీ స్టేడియంలో టోర్నమెంట్
ఇండియా, సిరియా,మారిషస్ మధ్య టోర్నీ
-
2024-09-03T09:02:05+05:30
మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి
-
2024-09-03T09:00:24+05:30
లిబరేషన్ డే
హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
గత రెండేళ్ళుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోన్న కేంద్ర ప్రభుత్వం
ముఖ్య అతిథిగా పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమి త్ షా
నేడు బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం
విమోచన దినోత్సవ కార్యక్రమంపై దిశానిర్దేశం చేయనున్న కిషన్ రెడ్డి
-
2024-09-03T08:58:00+05:30
ముంపులోనే సింగ్ నగర్ ప్రజలు
విజయవాడ: సింగ్ నగర్‌లో ముంపులోనే ప్రజలు
సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం
ఆహారం, మంచినీరు పడవుల ద్వారా బాధితులకు అందేలా ఏర్పాట్లు
మరికాసేపట్లో సింగ్ నగర్ రానున్న సీఎం చంద్రబాబు
సింగ్ నగర్ ఫ్లైఓవర్ పై అన్ని వాహనాల నిలిపివేత
నడుస్తూ వెళ్లాలని ఆదేశాలు, పోలీసుల తీరుపై వరద బాధితుల ఆగ్రహం
-
2024-09-03T08:11:26+05:30
ఏ క్షణాన ఏం జరుగుతుందో..
వికారాబాద్ జిల్లా: బిక్కుబిక్కుమంటూ డ్యూటీ చేస్తోన్న పరిగి వ్యవసాయ శాఖ అధికారులు
కార్యాలయం స్లాబ్ గోడల నుంచి ధారగా కారుతున్న వర్షపు నీరు
గోడల నుంచి కారుతోన్న నీరు.. ఎర్త్ లేకపోవడంతో వస్తోన్న కరెంట్ షాక్
శిథిలావస్థకు చేరిన వ్యవసాయ శాఖ కార్యాలయం
పై కప్పు నుంచి కారుతోన్న నీటి నుంచి ఫైళ్లను కాపాడుకునేందుకు నానా తంటాలు
కంప్యూటర్, ప్రింటర్, ఫైళ్ళపై ఫ్లాస్టిక్ కవర్స్ కప్పిన వైనం
వర్షపు నీరు తలపై పడకుండా క్యాప్ పెట్టుకుని డ్యూటీ చేస్తున్న అధికారులు
బిల్డింగ్ మార్చి కష్టాల నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్న సిబ్బంది
-
2024-09-03T07:31:46+05:30
రేపల్లె సేఫ్: మంత్రి అనగాని
అమరావతి: ఒలేరు కట్ట రక్షణకు పూర్తి చర్యలు, రేపల్లె పట్టణ ప్రజలు సరక్షితం: మంత్రి అనగాని సత్యప్రసాద్
వరద ప్రభావిత ప్రాంతాలు పెనుమూడి, రావిఅనంతవరం, ఒలేరు గ్రామాల్లో అర్ధరాత్రి పర్యటించిన మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్
అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఓలేరు కట్ట పరిస్థితిని పర్యవేక్షిస్తోన్న మంత్రులు
అధికారులు, కూటమి కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఓలేరు కట్టను రక్షిస్తోన్నారు: మంత్రి అనగాని
మరో రోజు గడిస్తే రేపల్లెకు ప్రమాదం తప్పినట్లే: మంత్రి అనగాని
ఈలోగా అన్ని ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశాం: మంత్రి అనగాని
అవసరమైతే ఒలేరు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశాం: మంత్రి అనగాని
రేపల్లె ప్రజలు ధైర్యంగా ఉండండి
అధికారులు, టీడీపీ కార్యకర్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నార
ప్రజలకు ఎలాంటి సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నారు: మంత్రి అనగాని
-
2024-09-03T07:09:00+05:30
శాంతించిన బుడమేరు
అమరావతి: నిన్నటి వరకు మహోగ్రరూపం దాల్చిన బుడమేరు
బుడమేరు కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వచ్చిన వరద
కుంభవృష్టి నమోదు కావడంతో మహాగ్రరూపం దాల్చిన బుడమేరు
విజయవాడలోని 16 డివిజన్లను ముంచెత్తిన వరద
48 గంటలుగా వరద నీటిలో 2.59 లక్షల మంది
చివరి వరకు అందని ప్రభుత్వ సహాయక చర్యలు
బుడమేరులో ప్రస్తుతం 6 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం
మరింత తగ్గుతుందని చెబుతున్న అధికారులు
-
2024-09-03T07:05:20+05:30
ప్రకాశం బ్యారేజి వద్ద క్రమంగా తగ్గుతోన్న నీటిమట్టం
విజయవాడ: ప్రకాశం బ్యారేజికి క్రమంగా తగ్గుతున్న నీటి ఉధృతి
రామలింగేశ్వర నగర్ లో వెనక్కి వెళ్లుతున్న వరద నీరు
వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న నివాసాలు
ఊపిరి పీల్చుకున్న ప్రజలు
కరెంటు సరఫరా నిన్నటి నుంచి నిలిపేసిన అధికారులు
పై నుంచి వచ్చే వరద తగ్గడంతో బ్యారేజి వద్ద 9 లక్షల 79 వేల క్యూసెక్కులకు చేరుకున్న నీటిమట్టం
నిన్న ఇదే సమయానికి 11 లక్షల 30 వేల క్యూసెక్కులుగా ఉన్న వరద ప్రవాహం
నిన్న మధ్యాహ్నం 11 లక్షల 47 వేల క్యూసెక్కులకు చేరుకున్న వరద నీరు
బ్యారేజి చరిత్రలో ఇదే రికార్డ్ స్థాయి నీటిమట్టం, తట్టుకుని నిలబడిన ప్రకాశం బ్యారేజి
ఈ రోజు మధ్యాహ్నానికి మరింత తగ్గుతుందని చెబుతున్న ఇరిగేషన్ అధికారులు
-
2024-09-03T07:01:30+05:30
మహబూబాబాద్‌లో సీఎం రేవంత్ పర్యటన
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఈ రోజు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
ఖమ్మం నుంచి నేరుగా సీతారాంనాయక్ తండాకు సీఎం రేవంత్
వరద బాధితులకు పరామర్శ
సీతారాంతండాను వరద ముంచెత్తిన విషయాన్ని వెలుగులోకి తెచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
వంద మందిని కాపాడిన పోలీసులు

-
2024-09-03T06:52:37+05:30
కాస్త తగ్గిన వరద నీరు
కృష్ణా: ప్రకాశం బ్యారేజి నుంచి నీటి విడుదల స్వల్పంగా తగ్గటంతో ఊపిరి పీల్చుకున్న అవనిగడ్డ ప్రజలు.
నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ వద్ద అడుగు మేర తగ్గిన వరదనీరు.
కరకట్టకు సమాంతరంగా వరద నీరు ప్రవహిస్తోండటంతో రాత్రి నుంచి ఆందోళనలో గడిపిన నదితీర గ్రామప్రజలు.
నీటి విడుదల 11.20 లక్షల నుంచి 10.16 లక్షలకు తగ్గటంతో కొద్దిగా తగ్గిన వరదనీటి మట్టం.
జల దిగ్బంధంలో అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాల్లోని లంక గ్రామాలు.

-
2024-09-03T06:48:41+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.