Breaking News: మంత్రి కొండా సురేఖ కంటతడి
ABN , First Publish Date - Sep 30 , 2024 | 06:50 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-09-30T21:45:55+05:30
పాతబస్తీలో హైడ్రా రగడ
హైడ్రా అధికారులకు ఎంఐఎం ఎమ్మెల్యేల హెచ్చరిక
మా ఇలాఖాలోకి వచ్చే ధైర్యం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు
పాతబస్తీలో సర్వేకు వస్తే తీవ్ర పరిణామాలుంటాయి
బుల్డోజర్లు తీసుకొస్తే మాపై నుంచి వెళ్లాలి
ఎమ్మార్వో, హైదరాబాద్ ఆర్డీవోకు మజ్లీస్ ఎమ్మెల్యేల వార్నింగ్
బహదూర్‌పుర ఎమ్మార్వోను బెదిరించిన చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జులిఫికర్ అలీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్
-
2024-09-30T20:55:58+05:30
సాహితీ అధినేత లక్ష్మీనారాయణ అరెస్టుపై ఈడీ కీలక ప్రకటన
అరెస్ట్ వివరాలు వెల్లడి
నకిలీ మెడికల్ రిపోర్ట్స్‌తో కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతున్నాడు
సాహితీకి చెందిన రూ.161.50 కోట్ల ఆస్తులను అటాచ్ చేశాం
సాహితీ గ్రూపుతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో సోదాలు చేశాం
డిజిటల్ పరికరాలతో పాటు మరికొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాం
-
2024-09-30T20:44:08+05:30
మైనింగ్ మాజీ ఎండీ వెంకట రెడ్డిని కస్టడీ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ అధికారులు
7 రోజులు కస్టడీ ఇవ్వాలని కోరిన అధికారులు
ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి
కస్టడీ పిటిషన్‌పై రేపు తీర్పు వెలువడించనున్న ఏసీబీ కోర్టు
-
2024-09-30T20:42:44+05:30
కుక్కల విద్యా సాగర్ కస్టడీ కోరుతూ 4వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
ఐదు రోజుల కస్టడీ కోరిన పోలీసులు
ఇప్పటికే సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న విద్యాసాగర్
ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం
కస్టడీ పిటిషన్‌పై రేపు తీర్పు వెలువరించనున్న 4వ ఏసీఎంఎం కోర్టు
-
2024-09-30T20:08:25+05:30
దీక్షకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే
టీడీపీ అధిష్ఠానానికి ఎమ్మెల్యే కొలికపూడి కీలక విజ్ఞప్తి
తనపై కొందరు చేసిన ఆరోపణలపై టీడీపీ అధిష్ఠానం సమగ్ర విచారణ జరిపించాలని కోరిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు
తిరువూరులో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కొలికపూడి
సమావేశం అనంతరం కార్యాలయం ముందు దీక్ష కు దిగిన ఎమ్మెల్యే
తిరువూరులోని తన క్యాంపు కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
విచారణ జరిపి ఎవరు తప్పు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే
తన మద్దతుదారులతో దీక్షకు దిగిన ఎమ్మెల్యే కొలికపూడి
-
2024-09-30T19:36:40+05:30
బీఆర్ఎస్ ట్రోలర్స్‌పై సీతక్క ఫైర్
సహచర మంత్రి కొండా సురేఖకు బాసటగా నిలిచిన మంత్రి సీతక్క
బీఆర్ఎస్‌కు మహిళలు అంటే చులకన, అందుకే ట్రోల్ చేస్తారు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలను రికార్డ్ డాన్సులు చేసుకోనివ్వండన్న దుర్మార్గుల పార్టీ బీఆర్ఎస్
మహిళా మంత్రిగా నేను, సోదర మంత్రి పొన్నం పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి దుర్మారంగా వ్యవహరించారు
సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు
మహిళా మంత్రులను, మహిళా నేతలు వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోంది
మహిళలు రాజకీయాల్లో ఉండాలా వద్దా బీఆర్ఎస్ స్పష్టం చేయాలి
సీఎం కుటుంబాన్ని, వారి పిల్లల్ని వేధిస్తున్న మీరు మనుషులేనా
బీఆర్ఎస్ బేకారు నాయకులారా పద్ధతి మార్చుకోండి
మీ ఇంట్లో మహిళలు ఏ వ్యాపారాలు చేశారో దేశానికి తెలుసు
అయినా ఆడకూతురు అన్న కారణంతో మేము ఏనాడు చెడుగా స్పందించ లేదు
దొర ఆహకారంతోనే బీఆర్ఎస్ మహిళా నేతలను టార్గెట్ చేస్తోంది
రాజకీయాల్లో, ప్రజాజీవితంలో క్రియా శీలకంగా పనిచేసే వాళ్లపై బురద చల్లుతున్నారు
ఎన్నో కష్ట, నష్టాలు అధిగమించి రాజకీయాల్లో ఎదిగొచ్చిన మహిళా నేతలపై తప్పుడు ప్రచారాలా?
ఇది మీ ఫ్యూడల్ మెంటాలిటికి, పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం
ఆడ కూతుళ్లను అత్యంత అవమానకరంగా ట్రోల్ చేసి వేయ్యేండ్లు వెనక్కు నెడుతున్నారు
మళ్లీ దొరల రాజ్యం తెవాలన్న తలంపుతోనే సోషల్ మీడియా ద్వారా మహిళా నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు
మహిళా నేతలపై ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మహిళలు రాజకీయాల్లోకి రాగలుగుతారా?
బీఆర్ఎస్ నేతలు దుర్మార్గపు ఆలోచనలు మానుకొని బుద్ది తెచ్చుకోండి
మొన్న మేయర్ విజయ లక్ష్మి, నిన్న నాపై, నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని వెనక్కు నెడుతోంది బీఆర్ఎస్
అతివలు రాజకీయాల్లోకి రావద్దా?
బీఆర్ఎస్ తక్షణం క్షమాపణలు చెప్పి తమ సోషల్ మీడియాను కట్టడి చేయాలి
నామీద, కొండా సురేఖ మీద ఇంత దుర్మార్గమా అసలు ఎటు పోతుంది సమాజం
సమాజాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎటు తీసుకెళ్తోంది..
మహిళలు ప్రజాప్రతినిధులు కాకూడదా
బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి
-
2024-09-30T18:35:37+05:30
బీజేపీపై మంత్రి తుమ్మల విమర్శలు
రుణ మాఫీపై బీజేపీ విమర్శలు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లు ఉంది
2022 కళ్ల రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు ఏమైంది?
స్వామినాథన్ కమిటీ సిపార్సుల అమలు కోసం నిరసన తెలిపిన రైతుల గోడు పట్టించుకున్నారా
ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేసి చూపించగలరా
రైతులకు భరోసా కల్పించే బాధ్యత మాది
ఇప్పటికే సన్నవడ్డకు 500 బోనస్ ప్రకటించాం
రూ.392 కోట్లు వెచ్చించి మద్దతు ధరకు పప్పు ధాన్యాలు కొనుగోలు చేశాం
గత ప్రభుత్వం రుణమాఫీ చేయని రైతులకు కూడా మేము రుణమాఫీ చేశాం
రైతుల పేరుతో రాజకీయాలు చేయొద్దు
తెలంగాణకు కేంద్ర నిధులు తెచ్చేలా పనిచేయండి
-
2024-09-30T18:08:28+05:30
తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ
గ్రూప్ 1 అభ్యర్థుల రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు
జీవో నెంబర్ 29 సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు
తదుపరి విచారణను రేపటికి (మంగళవారం) వాయిదా వేసిన హైకోర్టు
-
2024-09-30T17:37:33+05:30
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని క్లారిటీ
అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదని వెల్లడి
అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదు
మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదు
మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు
దీనిని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతోంది
క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
-
2024-09-30T16:57:07+05:30
మంత్రి కొండా సురేఖ కంటతడి
మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మంత్రి కొండా సురేఖ
పలుమార్లు కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ
తనపై ట్రోలింగ్ పట్ల మంత్రి భావోద్వేగం
కేటీఆర్ ఖబడ్దార్ .. ఖబడ్దార్ కేసీఆర్ అని హెచ్చరించిన మంత్రి
ఈ ట్రోలింగ్ వీడియోలను మీ చెల్లికి, తల్లికి చూపించు కేటీఆర్
ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదు
అన్ని పార్టీల వాళ్లు నన్ను అక్కా అని, నా భర్తను బావ అని పిలుస్తారు
ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడతారు
చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమనపరుస్తారా?
మానసిక వేదన కలిగించి కుటుంబాల్లో ఇబ్బంది పెడుతారా?
నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు
రెండవరసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్‌లో భారీ మార్పులు వచ్చాయి
బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదం ఎక్కి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు
రఘునందన్ కాల్ చేసి క్షమించమని అడిగాడు
అక్కా క్షమించు కాళ్లు మొక్కుతా అని రఘునందన్ అన్నాడు
సిగ్గు లజ్జ ఉంటే బట్టలు లేకుండా తిరుగు
ఇంకోసారి ఇలా చేస్తే కేటీఆర్ బట్టలు ఊడదీసి పరిగెత్తిస్తాం
-
2024-09-30T16:15:06+05:30
ఏపీ సీఎం చంద్రబాబుతో పోల్చి రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
పెన్షన్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
ఎన్నికల హామీ మేరకు వారంలో చంద్రబాబు పెన్షన్లు పెంచారు
పెన్షన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వృద్దులను మోసం చేశాడు
హైడ్రాపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతాం
కొండగల్‌లో సర్వే నంబర్ 1138లో రేవంత్ ఇల్లు చెరువులో ఉంది
మెదట రేవంత్, ఆయన సోదరుడి ఇళ్లు కూల్చాలి
మీడియాకు ముఖ్యమంత్రి ముఖం చాటేశాడు
హైడ్రాతో ప్రజల్లో వ్యతిరేకత రావటంతోనే సీఎం రేవంత్ మాట్లాడటం లేదు
సీఎం, మంత్రులు అధికారుల వెనుక దాక్కుంటున్నారు
ముఖ్యమంత్రి, మంత్రులు హైడ్రాపై ఎందుకు మాట్లాడటం లేదు?
చదువుకున్న వాడు, సంస్కారవంతుడన్న గౌరవం శ్రీధర్ బాబుపై ఉండేది
తమ మాటలతో మంత్రి శ్రీధర్ బాబు గౌరవం పోగొట్టుకుంటున్నాడు
ఓటుకు నోటు కేసు వాళ్లతో కూర్చని శ్రీధర్ బాబు కూడా చెడిపోయాడు
అసలైన అరాచక శక్తి పక్కన కుర్చీలోనే శ్రీధర్ బాబు కూర్చుకుంటున్నాడు
మూసీ సుందరీకరణకు అస్సలు డీపీఆర్ కూడా లేదు
-
2024-09-30T16:00:03+05:30

టీజీఆర్టీసీ గుడ్‌న్యూస్
గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్
దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటన
హైదరాబాద్ శివారు నుంచి దసరాకు స్పెషల్ బస్ సర్వీసులు
ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులు
కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
ప్రయాణీకుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులు
ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్
దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం తమ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033
-
2024-09-30T15:06:41+05:30

తిరుమల లడ్డూ వ్యవహారం నేపథ్యంలో నాగబాబు హాట్ కామెంట్స్
హిందువులే హిందువులను అవమానించడం కరెక్ట్ కాదు
పవన్ కల్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారు
పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్
పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్
డిక్లరేషన్ గురించి ఒక్కటే మాట.. అన్నీ మతాలను అందరూ గౌరవించాలి
జాతీయ స్దాయిలో ఖచ్చితంగా హిందూధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి
ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నాగబాబు
-
2024-09-30T14:58:51+05:30

రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్
రేషన్ కార్డులేని రైతుల రుణమాఫీకి లైన్ క్లియర్
క్షేత్ర స్థాయిలో లెక్కలు తీసిన ప్రభుత్వం
గ్రామాల వారీగా రేషన్ కార్డులేని రైతు కుటుంబాల నిర్ధారణ పూర్తి చేసిన వ్యవసాయశాఖ అధికారులు
రేషన్ కార్డు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించిన ప్రభుత్వం
ఆధార్, బ్యాంకు అకౌంట్‌లో పేర్ల తప్పులను సరి చేసిన అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఇరవై వేలకు పైగా ఆధార్, బ్యాంక్ అకౌంట్ తప్పులను సరిచేసిన అధికారులు
రేషన్ కార్డు లేని, ఆధార్ తప్పుల కారణంగా ఆగిన రైతులకు త్వరలోనే రుణమాఫీ చేయనున్న ప్రభుత్వం
అర్హుల జాబితాను సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ
ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల ఖాతాలో జమ
ఆధార్ తప్పులు, రేషన్ కార్డులేని దాదాపు 5 లక్షల కుటుంబాలకు లబ్ది
మొత్తం రూ.5 వేల కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం
-
2024-09-30T14:44:59+05:30
తెలంగాణ భవన్ ముట్టడికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు.. తీవ్ర ఉద్రికత్త
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు
తెలంగాణ భవన్ ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం
కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపణ
తెలంగాణ భవన్ వద్ద అడ్డుకున్న బీఆర్ఎస్ కేడర్
ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను కొట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు
సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ క్యాడర్ నివాదాలు
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు
తెలంగాణ భవన్ ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం
కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపణ
తెలంగాణ భవన్ వద్ద అడ్డుకున్న బీఆర్ఎస్ కేడర్
ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను కొట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు
సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ క్యాడర్ నినాదాలు
-
2024-09-30T14:38:42+05:30
కాన్పూర్ టెస్టులో 2వ వికెట్ కోల్పోయిన టీమిండియా
తొలి ఇన్నింగ్స్‌లో జట్టు స్కోరు 127 పరుగుల వద్ద జైస్వాల్ ఔట్
వ్యక్తిగత స్కోరు 72 పరుగుల వద్ద హసన్ మహ్మద్ బౌలింగ్‌లో నిష్క్రమణ
51 బంతుల్లో 72 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్
-
2024-09-30T14:04:00+05:30
నో బెయిల్
హైదరాబాద్: జానీ మాస్టర్‌కు దక్కని ఊరట
బెయిల్ పిటిషన్ వాయిదా వేసిన కోర్టు
వచ్చే నెల 7కు వాయిదా వేసిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టు
పోక్సో కేసు కావడంతో బెయిల్ నిరాకరణ
-
2024-09-30T13:56:33+05:30
తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి: సుప్రీంకోర్టు ధర్మాసనం
లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారనడానికి ఆధారాలేమి ఉన్నాయని ప్రశ్నించిన ధర్మాసనం
కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారు: సుప్రీం ధర్మాసనం
సిట్ నియమించిన తరువాత కల్తీ నెయ్యిపై మీడియా ముందు ఎందుకు ప్రకటన చేశారు
ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా అనే అనుమానాలు ఉన్నాయి
కల్తీ జరిపిన నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్టు ఎలా తెలిసింది
ల్యాబ్‌కి ఎప్పుడు టెస్ట్‌లకు పంపారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపితే బావుంటుందని అభిప్రాయపడిన సుప్రీం ధర్మాసనం
తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసిన ధర్మాసనం
-
2024-09-30T13:34:56+05:30
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో పిటిషన్
సుబ్రహ్మణ్య స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు
కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్‌ను అనుమతించలేదని టీటీడీ చెబుతోంది
ఆంధ్రప్రదేశ్ సీఎం చేసిన ప్రకటన టీటీడీ చెప్పినదానికి భిన్నంగా ఉంది
ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించమని టీటీడీ చెబుతోంది
శాంపిళ్లను ఎక్కడ నుంచి సేకరించారు తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిళ్లను సేకరించారా
ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా
-
2024-09-30T12:26:16+05:30
త్వరలో నియామకాలు
వచ్చే నెల 5వ తేదీ లోపు డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్
త్వరలో కొత్త నియామకాలు
ఇచ్చిన మాట ప్రకారం టీచర్ పోస్టులను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
-
2024-09-30T12:11:51+05:30
తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల
సచివాలయంలో డీఎస్సీ-2024 ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.
డీఎస్సీ పరీక్షలకు హాజరైన 2,46,584 (88.11%) మంది అభ్యర్థులు.
56 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసిన సర్కారు.
-
2024-09-30T11:28:44+05:30
కాసేపట్లో డీఎస్సీ ఫలితాలు
హైదరాబాద్: కాసేపట్లో డీఎస్సీ ఫలితాలు
సచివాలయంలో ఫలితాల విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
మార్చి 1వ తేదీన 11,062 టీచర్‌పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్
జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు
పరీక్ష రాసిన 2.45 లక్షల మంది అభ్యర్థులు
-
2024-09-30T10:50:02+05:30
ఈడీ కార్యాలయానికి బండ్ల గణేష్
ఓ కేసు నిమిత్తం ఈడీ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్
-
2024-09-30T10:35:05+05:30
జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చేనా
జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు
మైనర్‌గా ఉన్నప్పుడు లైంగిక దాడి జరిగిందనేది అవాస్తవం
అందుకు ఎలాంటి ఆధారాలు లేవు: పిటిషనర్ తరఫు న్యాయవాది
జానీ మాస్టర్ వ్యవహారంలో పోక్సో సెక్షన్లు వర్తించవని కోర్టుకు తెలిపిన న్యాయవాది
బెయిల్ పిటిషన్ పై రంగారెడ్డి కోర్టులో ముగిసిన వాదనలు
ఇప్పటికే నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు
చంచల్ గూడ జైలులో జ్యూడిషీయల్ రిమాండ్‌లో ఉన్న జానీ మాస్టర్
-
2024-09-30T10:26:25+05:30
మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
1950లో కోల్ కతాలో జన్మించిన మిథున్ చక్రవర్తి
1976లో సినిమాల్లోకి ఎంట్రీ
1989లో మిథున్ చక్రవర్తి 19 సినిమాలు రిలీజ్
విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి
అక్టోబర్ 8వ తేదీన నేషనల్ ఫిల్మ్ అవార్డు కార్యక్రమంలో మిథున్ చక్రవర్తికి ఫాల్కే అవార్డు అందజేత
సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
-
2024-09-30T09:22:06+05:30
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
విచారణ జరుపనున్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మసనం
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు
ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురి పిటిషన్లు
సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థన
ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని పిటిషన్‌లో వినతి
స్వయంగా వాదనలు వినిపించనున్న సుబ్రహ్మణ్యస్వామి
తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన పిటిషనర్లు
తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎక్కడిదని ప్రశ్నలు
ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా లేదా అనేది తేల్చాలని పిటిషన్‌లో వినతి
తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వాదనలు
ఎస్ఓపి ప్రకారం పరీక్షల్లో నెగ్గిన నెయ్యిని తిరుమల ప్రసాదానికి వాడడం దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానం
చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషన్
-
2024-09-30T09:13:55+05:30
ఈడీ అదుపులోకి సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ
హైదరాబాద్: లక్ష్మీనారాయణను విచారిస్తున్న ఈడీ అధికారులు
సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కొనసాగుతున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు.
1500 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తివేసిన సాహితీ ఇన్ ఫ్రా
సాహితీ ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, ఆస్తులను అటాచ్ చేసిన సీసీఎస్ పోలీసులు..
సాహితీ ఇన్‌ఫ్రాపై ఇప్పటివరకు 50కి పైగా కేసులు నమోదు.
రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్ ఫ్రా
ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లో 3 వేల మంది వద్ద నుంచి కోట్ల రూపాయలు వసూళ్లు..
బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదు.
200 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన సీసీఎస్ పోలీసులు.
3 వేల కోట్లకు పైగా వసూల్ చేసి పరారీలో ఉన్న సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ.
ఏపీలో సాహితీ ఇన్‌ఫ్రా యజమాని లక్ష్మీనారాయణపై కేసులు.. ఆస్తులను అటాచ్ చేసిన ఏపీ పోలీసులు.
కోట్లల్లో మోసం జరగడంతో సీసీఎస్ పోలీసులు కేసు ఆధారంగా రంగంలోకి ఈడీ
లక్ష్మీనారాయణ నుంచి వివరాలు సేకరిస్తున్న ఈడీ.
లక్ష్మీ నారాయణను ఈడీ కార్యాలయానికి తీసుకోచ్చిన ఈడీ అధికారులు
-
2024-09-30T09:05:11+05:30
నేడు హైకోర్టుకు హైడ్రా కమిషనర్
హైకోర్టుకు హాజరు కావాలని హైడ్రా కమిషనర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశం.
కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని కూల్చివేయడంపై హైకోర్టు అభ్యంతరం.
అమీన్‌పూర్‌లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చేసిన హైడ్రా.
వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైకోర్టు స్పష్టీకరణ
-
2024-09-30T08:58:57+05:30
కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్
కరీంనగర్: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు
బీఆర్ఎస్‌కు కాళేశ్వరం, కాంగ్రెస్‌కు హైడ్రా ఆదాయ వనరుగా మారింది
బీజేపీ ఒంటరిగానే పోరాటం చేస్తుంది: కేంద్రమంత్రి బండి సంజయ్
కిషన్ రెడ్డి నాయకత్వంలో పేదల పక్షాన పోరాడుతాం
తమిళనాడులో వారసత్వ రాజకీయాలను ఖండిస్తున్నాం
కరీంనగర్‌లో విలీన గ్రామాల అభిప్రాయం తీసుకోవాలి
-
2024-09-30T08:55:37+05:30
హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు
హైదరాబాద్: ఆనంద కన్వెన్షన్‌లో హరీష్ రావుకు వాటాలు
హిమాయత్ సాగర్ FTL భూముల్లో అక్రమంగా ఆనంద కన్వెన్షన్ నిర్మాణం
అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు ప్రజలను హరీష్ అడ్డుపెట్టుకుంటున్నారు
రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపణలు
-
2024-09-30T08:46:13+05:30
కాసేపట్లో డీఎస్సీ ఫలితాలు
హైదరాబాద్: ఉదయం 11 గంటలకు డీఎస్సీ ఫలితాలు
సచివాలయంలో ఫలితాల విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
మార్చి 1వ తేదీన 11,062 టీచర్‌పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్
జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు
పరీక్ష రాసిన 2.45 లక్షల మంది అభ్యర్థులు
56 రోజుల వ్యవధిలో ఫలితాల వెల్లడి
నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
-
2024-09-30T07:07:47+05:30
హైడ్రా పేరుతో రేవంత్ సర్కార్ హైడ్రామా
సంగారెడ్డి జిల్లా: హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ హైడ్రామా
సంగారెడ్డి జిల్లా హోంగార్డు గోపాల్‌ను కాపాడే ప్రయత్నం చేయలేదు
డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువులో కట్టడాలను కూల్చివేసిన అధికారులు
హైడ్రాకు, ఆ సంఘటనకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సరికాదు
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గోపాల్ కన్నుమూత
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
బాధ్యత వహించి గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలి: బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్
-
2024-09-30T06:59:31+05:30
శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం
తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో కోయిళ్ ఆల్వార్ తిరుమంజనం..
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో శుద్ధి కార్యక్రమం
ఉదయం 6 గంటల నుంచి 11 వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత
అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు చేసిన టీటీడీ

-
2024-09-30T06:50:26+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.