Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Sep 13 , 2024 | 07:27 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-09-13T20:56:55+05:30
ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు..
ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన ఎంపీలు.
ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా సీతారాం ఏచూరి నివాసానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు నాయుడు.
మరికాసేపట్లో సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించనున్న సీఎం.
-
2024-09-13T19:25:34+05:30
బాలినేని చేసేదొకటి.. చెప్పేదొకటి..
ప్రకాశం : వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్.
వైసీపీ మాజీ మంత్రి బాలినేని చేసేదొకటి చెప్పేదొకటి.
ఎన్నికల ముందు బాలినేని టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారని ప్రచారం చేశారు.
బాలినేని వ్యవహారం ప్రజలందరికీ తెలుసు.
బాలినేని కి వయస్సు అయిపోయింది.
ఆయన ఇంట్లో కూర్చుంటే మంచిది.
గత ప్రభుత్వంలో బాలినేని చేసిన అక్రమాలపై విచారణ జరపాలని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.
-
2024-09-13T18:29:02+05:30
జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల..
తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
ఐదున్నర నెలల తరువాత బెయిల్ పై బయటకి కేజ్రీవాల్.
లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.
తీహార్ జైలు వద్ద ఆప్ శ్రేణుల సంబరాలు.
తీహార్ జైలు వద్ద కేజ్రీవాల్‌కి ఘన స్వాగతం.
పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడొచ్చు..
-
2024-09-13T18:16:21+05:30
పోలీస్ కస్టడీకి నందిగం సురేష్..
గుంటూరు: నందిగం సురేష్ పోలీస్ కస్టడికి అనుమతించిన కోర్టు
రెండు రోజుల పాటు సురేష్ ను విచారించేందుకు అనుమతి
అనుమతి మంజూరు చేసిన మంగళగిరి న్యాయస్థానం
ఈనెల 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మద్యాహ్నం 1గంట వరకూ విచారణ
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్
గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం
మంగళగిరి గ్రామీణ పీఎస్ లో సురేష్ విచారించేందుకు అనుమతి
-
2024-09-13T17:51:41+05:30
మందు బాబులకు షాకింగ్ న్యూస్..
వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం దుకణాలు బంద్.
17వ తేదీ ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు క్లోజ్.
ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు.
మద్యం, కల్లు దుకాణాలు, బార్లు అన్నింటికీ రూల్స్ వర్తిస్తాయని స్పష్టం.
ఈ నెల 17న ఖైరతాబాద్ వినాయకుడితోపాటు నగరంలోని గణేష్ విగ్రహాలు నిమజ్జనం.
ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలుగకుండా పోలీసుల ముందస్తు చర్యలు.
-
2024-09-13T16:16:28+05:30
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య..
చిత్తూరు-బెంగళూరు హైవే మొగిలి ఘాట్‌రోడ్డులో ప్రమాదం..
ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఏడుగురు దుర్మరణం.
ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలు.
ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమం.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం.
-
2024-09-13T15:32:55+05:30
సీఎంను కలిసి బాలకృష్ణ కూతురు.. ఎందుకంటే..
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని కలిశారు. వరద బాధితులకు అండగా బాలయ్య రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు తేజస్విని. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రేవంత్ రెడ్డిని కలిసి.. చెక్కును అందజేశారు. ఈ సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
-
2024-09-13T15:01:11+05:30
YSRCP: వైసీపీకి ఝలక్.. వారంతా కలిసి..
ఏలూరు: నగర కార్పొరేషన్ ఐదుగురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ పార్టీకి రాజీనామా.
టీడీపీ గూటికి చేరిన కార్పొరేటర్లు.
టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏలూరు ఎంఎల్ఏ బడేటి చంటి.
-
2024-09-13T14:36:01+05:30
Venu Swamy: వేణుస్వామికి బిగ్ షాక్..
నాంపల్లి కోర్టు: వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం.
జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం.
ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని పిటిషన్.
వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారని మూర్తి పిటిషన్.
తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని పేర్కొన్న పిటిషనర్.
పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.
వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం.
-
2024-09-13T13:23:42+05:30
భద్రత కల్పించండి
అమరావతి: సీఎం హోదాలో ఉన్నప్పటి భద్రత కల్పించాలని హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ పిటిషన్
జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం
ప్రభుత్వం వేసిన కౌంటర్ పై రిప్లై ఇచ్చేందుకు సమయం కావాలని కోరిన జగన్ తరఫు న్యాయవాది
తుది వాదనల కోసం కేసు విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
-
2024-09-13T13:19:48+05:30
కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర బృందం భేటీ
వరద నష్టం అంచనా గురించి చర్చ
సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి
సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు.
-
2024-09-13T13:14:19+05:30
సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: ఏపీలో ఇసుక అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు అసహనం
ఇసుక అక్రమ మైనింగ్‌పై హరిత ట్రైబ్యునల్ తీర్పును సవాలు చేసిన జేపీ పవర్ వెంచర్స్ పిటిషన్
విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మైష్‌తో కూడిన ధర్మాసనం
ఈ ఏడాది జూలై, ఆగస్ట్‌లోనే షోకాజ్ నోటీసులు, ఎఫ్‌ఐఆర్ ఎందుకు ఉన్నాయి: ధర్మాసనం.
షోకాజ్ నోటీసులు ఒకే తరహాలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.
ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా జూలై, ఆగస్ట్ వరకు వేచి చూడటంపై మండిపాటు
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించామని కోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది.
9 మందిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, అక్రమ మైనింగ్‌ని అరికట్టినట్లు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది.
-
2024-09-13T11:30:20+05:30
బోట్ల తొలగింపు
అమరావతి: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
కాకినాడ నుంచి వచ్చిన అబ్బులు బృందంతో బోట్ల తొలగింపు పనులు ప్రారంభం
కృష్ణా నదిలోకి ఐదు బోట్ల సహాయంతో బయటికి తీసే ప్రయత్నం చేస్తున్న అబ్బులు బృందం
సాయంత్రానికి ఒక బోటు బయటకు తీసే అవకాశం
-
2024-09-13T11:06:26+05:30
కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ: న్యాయప్రక్రియలో సుదీర్ఘంగా జైలు శిక్ష అంటే స్వేచ్ఛను హరించడమే- సుప్రీంకోర్టు ధర్మాసనం
కేజ్రీవాల్ అరెస్టుపై ప్రత్యేక తీర్పు ఇస్తోన్న ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ భుయాన్
కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సమయం అనేక ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తుతోంది- జస్టిస్ భుయాన్
ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చింది.. అదే కేసులో సీబీఐ అరెస్ట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది - జస్టిస్ భుయాన్

-
2024-09-13T10:57:30+05:30
అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు ఊరట.
కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు
తీహార్ జైలు నుంచి విడుదల కానున్న కేజ్రీవాల్.
10 లక్షల పూచీకత్తు, ఇద్దరు సెక్యూరిటీ సంతకం.
ట్రయల్ కోర్టు విచారణ హాజరుకావాలి.
సాక్ష్యాలను టాంపర్ చేయకూడదు.
జూలైలో ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
ఐదున్నర నెలల పాటు తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్
-
2024-09-13T10:25:00+05:30
మాజీమంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి అరెస్ట్
హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
మాజీ మంత్రి మల్లారెడ్డి హౌస్ అరెస్ట్.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటికి బయలుదేరిన మల్లారెడ్డిని ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు.
-
2024-09-13T10:06:29+05:30
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు రిక్వెస్ట్
విజయనగరం: కేదారినాథ్‌లో చిక్కుకున్న యాత్రికులు
ఏపీ నుంచి 20 యాత్రికులు, విజయనగరం నుంచి నలుగురు ఉన్నారు.
రాష్ట్రానికి తీసుకొని రావాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడాను: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
కేదారినాథ్ లో చిక్కుకున్న కొందరికి ఆక్షిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి
యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యేక హెలికాఫ్టర్ ఏర్పాటు కోసం ఏవియేషన్ అధికారులతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు
-
2024-09-13T10:02:14+05:30
పోలీస్ కమిషనర్లతో డీజీపీ రివ్యూ
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ జితేందర్ రివ్యూ.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సమీక్ష
మూడు కమిషనరేట్ల సీపీలతో ముగిసిన డీజీపీ రివ్యూ
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పరిణామాలతో రివ్యూ
శాంతి భద్రతలపై రాజీ పడొద్దని డీజీపీ ఆదేశం
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వెల్లడిల
-
2024-09-13T09:57:55+05:30
శంభీపూర్ రాజు కామెంట్స్
హైదరాబాద్: ఎమ్మెల్యే గాంధీపై శంభీపూర్ రాజు తీవ్ర విమర్శలు
రాజకీయ విలువలు, నిజాయితీ ఉంటే కేసీఆర్‌ను కలువండి
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కులమతాలు, ప్రాంతీయ విభేదాలు లేవు
మా కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు.
కాంగ్రెస్ నాయకులను మాత్రం వదిలేశారు.
-
2024-09-13T09:54:02+05:30
కస్టడీకి ఇచ్చేనా..
గుంటూరు జిల్లా: మంగళగిరి కోర్టులో నందిగం సురేష్ కస్టడీ పిటిషన్‍పై విచారణ
ఇరుపక్షాల వాదనలు పూర్తి
మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పిటిషన్
8 రోజుల కస్టడీకి కోరిన పోలీసులు
-
2024-09-13T09:07:35+05:30
సీఎం రేవంత్ సీరియస్
హైదరాబాద్: గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ మధ్య తీవ్రస్థాయికి చేరిన మాటల యుద్ధం
గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపు
రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
అధికారం కోల్పోయామనే బాధతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కుట్రలకు తెరలేపుతున్నారు
శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలని డీజీపీకి ఆదేశాలు
పోలీసు శాఖపై మధ్యాహ్నం రివ్యూ చేస్తా: సీఎం రేవంత్
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం
తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై చర్యలు
-
2024-09-13T09:00:51+05:30
చార్‌ధామ్ యాత్రకు అంతరాయం
ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు
వర్షాలతో చార్‌ధామ్ యాత్రకు అంతరాయం
కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గాల్లో విరిగిపడ్డ కొండచరియలు
నిలిచిపోయిన రాకపోకలు, ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన యాత్రికులు
చిక్కుకున్నవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు
-
2024-09-13T08:53:37+05:30
వైసీపీ నేతల రాళ్లదాడి
గుంటూరు జిల్లా: టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతల రాళ్లదాడి
వైసీపీ నేతల రాళ్లదాడిలో ఐదుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
చేబ్రోలు మండలం అనుమర్లపూడిలో వినాయకుడి నిమజ్జనంలో ఘటన
-
2024-09-13T08:49:31+05:30
కొల్లేరులో కొనసాగుతున్న వరద ఉధృతి
ఏలూరు: ఏలూరు -కైకలూరు రహదారిపై చిన ఎడ్లగాడి వద్ద ఇంకా వరద నీరు
పదిహేను రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు
ముంపులో నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామం
కొల్లేరు వరద వల్ల 4 మండలాల్లో 65 వేల మంది ప్రజల ఇబ్బందులు
200 నివాసాల్లోకి చేరిన వరద నీరు
-
2024-09-13T08:46:06+05:30
బెయిల్ వచ్చేనా..
ఢిల్లీ: లిక్కర్ సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పై తీర్పు వెల్లడించనున్న సుప్రింకోర్టు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్, బెయిల్ పిటిషన్ల పై తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం
తీర్పు ఇవ్వనున్న జస్టిస్ సూర్య కాంత్,జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం.
సెప్టెంబర్ 5వ తేదీన కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
జూన్ 26వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రింకోర్టు.
సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్
-
2024-09-13T08:43:12+05:30
కేదార్‌నాథ్‌లో యాత్రికుల ఇబ్బందులు
విజయనగరం: కేదార్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న విజయనగరం జిల్లాకు చెందిన యాత్రికులు
చలి తీవ్రత ఎక్కువగా ఉండటం, భోజనం లేక ఇబ్బందులు
రాష్ట్రానికి చెందిన 20 మంది యాత్రికులు ఉన్నారని చెబుతున్న జిల్లావాసులు
ఉదయం ఆరు గంటలకు హెలీకాఫ్టర్ వస్తోందని చెప్పిన అధికారులు.
వాతావరణం అనుకూలించకపోవటంతో మరో రెండు రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తోందని ప్రకటన
కేంద్ర ఏవియేషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న ఎంపీ కలిశెట్ట అప్పలనాయుడు.
-
2024-09-13T08:39:18+05:30
ఎయిమ్స్‌లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం
ఢిల్లీ: ఎయిమ్స్‌లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయం
సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్‌లో గల నివాసానికి తరలింపు
రేపు ఉదయం 8.00కు నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతికకాయం తరలింపు
రేపు ఉదయం 11.00 నుంచి సాయంత్రం గంటల 5.00 వరకు ప్రజా సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో భౌతిక కాయం
రేపు సాయంత్రం 5 గంటలకు భౌతిక కాయం ఎయిమ్స్‌కు తరలింపు
అంత్యక్రియలు లేకుండా భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్న కుటుంబ సభ్యులు
తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీ పరిశోధనలకు అప్పగించాలని గతంలో పార్టీ నేతలకు కోరిన సీతారాం ఏచూరి
-
2024-09-13T08:18:09+05:30
తప్పిన ప్రమాదం
సిద్దిపేట: డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో తప్పిన ప్రమాదం
కుకునూర్ పల్లి మండలం మేదీన్ పూర్ రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.
కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తోన్న రాజదాని బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు.
రాజదాని బస్సు వెనకబాగంలో ఇంజిన్.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం.
వెంటనే ప్రయాణికులకు దింపేసిన డ్రైవర్, ప్రయాణికులు క్షేమం
ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు అర్పివేత.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
2024-09-13T08:13:03+05:30
ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపు
హైదరాబాద్: ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపు
పార్టీ నేతలకు పిలుపునిచ్చిన మేడ్చల్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు
ఉదయం 11 గంటలకు మల్లంపేటలో గల శంభిపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీ
పీఏసీ చైర్మన్ వచ్చిన సందర్భంగా గాంధీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి, అక్కడే మేడ్చల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని రాజు ప్రకటన
సమావేశానికి హాజరుకావాలని మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకు ఆహ్వానం.
హాజరుకానున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
గాంధీ బీఆర్ఎస్‌లో ఉన్నానని చెబుతున్నారు. కండువా కప్పి శుభాకాంక్షలు చెబుతా అంటోన్న కౌశిక్ రెడ్డి
-
2024-09-13T08:02:31+05:30
వరద నీటి పంపింగ్ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ
విజయవాడ: కండ్రిక, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్‌లో మంత్రి నారాయణ పర్యటన
64వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్‌తో కలిసి బుడమేరులో వరద నీటి ప్రవాహం పరిశీలన.
వరద నీరు బయటకు పంపింగ్ చేసేందుకు భారీ మోటార్లు ఏర్పాటు చేశాం.
కొన్ని చోట్ల రోడ్లకు గండ్లు కొట్టి నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు చేశాం.
రేపు సాయంత్రానికి నగరంలో వరద నీరు లేకుండా పంపింగ్ చేసేలా చర్యలు చేపట్టాం.
బుడ మేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా తాత్కాలిక చర్యలు ప్రారంభించాం.
రూరల్ ప్రాంతాల్లో మరికొన్ని చోట్ల వరద నీరు ఉంది
రెండురోజుల్లో అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి తీసుకొస్తాం.
-
2024-09-13T07:58:59+05:30
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు
పాడి కౌశిక్ పై ఫిర్యాదు చేసిన అడిషనల్ ఎస్పీ రవి చందన్.
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు.
కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.
132, 351 (3) BNS యాక్ట్ ప్రకారం కేసు
మరోవైపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసుల బందోబస్తు.
-
2024-09-13T07:55:57+05:30
శ్రీవారి సేవలో అశ్వనిదత్
తిరుమల: తిరుమల శ్రీవారి సేవలో నిర్మాత అశ్వనిదత్
అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకున్న అశ్వినిదత్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి.
-
2024-09-13T07:53:36+05:30
ఆలూరు టీడీపీలో దుమారం
కర్నూలు: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలనం
నేను టీడీపీలో ఉన్నా.. గెలిచిన ఎమ్మెల్యేను నేను.
ఆలూరులో ఓడిన వ్యక్తి పెత్తనం ఏంటీ
ఆలూరు టీడీపీ సీనియర్ నేత వీరభద్ర గౌడ్ పై జయరాం విమర్శలు
ఆలూరు టీడీపీలోకి త్వరలో భారీగా చేరికలు ఉంటాయి
ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ .
-
2024-09-13T07:50:28+05:30
ఏలేరు వరద ప్రాంతాలకు జగన్
కాకినాడ: ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో ఈ రోజు వైసీపీ అధినేత జగన్ పర్యటన
ఉదయం 10.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గం ఇసుకపల్లి, మాదవపురంలో బాధిత రైతులకు పరామర్శ
ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి, రమణక్కపేటలో మునిగిన పంటల పరిశీలన
మధ్యాహ్నం 12.30కు పిఠాపురం కాలేజీ గ్రౌండ్ నుంచి హెలి కాప్టర్‌లో తాడేపల్లికి తిరుగు పయనం
ఏలేరు ఆధునికీకరణకు ఐదేళ్ళు నిధులు ఇవ్వకుండా కాలయాపన చేసిన జగన్
వరద ముంపునకు జగన్ కారణం అని బాధితుల ఆగ్రహం
ప్రాజెక్టును గాలికి వదిలేసి ఇప్పుడు ఏ మొహంతో పరమర్శకు వస్తున్నారని కూటమి నేతల మండిపాటు
-
2024-09-13T07:40:42+05:30
జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలపై మంత్రి లోకేష్ దిద్దుబాటు చర్యలు
అమరావతి: అవగాహన లేకుండా వెయ్యి స్కూళ్లలో సీబీఎస్ఈ పరీక్షా విధానం ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం
సీబీఎస్ఈ పరీక్షా విధానంలో బోధించే టీచర్లు లేకుండానే పబ్లిసిటీ కోసం ఆనాడు వైసీపీ ప్రభుత్వం హడావిడి నిర్ణయం
ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో విస్తుపోయే నిజాలు
సీబీఎస్ఈ పరీక్షా విధానంలో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో 90 శాతం విద్యార్థులు ఫెయిల్.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం
వెయ్యి స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్టేట్ బోర్డు విధానంలో పరీక్షలు రాసేందుకు వెసులుబాటు
2025-26 విద్యా సంవత్సరం 6వ తరగతి నుంచి పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల సామర్థ్యం పెంచేలా చర్యలు.

-
2024-09-13T07:34:40+05:30
సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్
ఉదయం 11 గంటలకు సచివాలయానికి రాక
విజయవాడపై తీవ్ర ప్రభావం చూపిన భారీ వర్షాలు, వరదలు
వరద బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖుల ఆర్థికసాయం
సీఎం చంద్రబాబు పిలుపు మేరకు సీఎంఆర్ఎఫ్‌కు హీరోల సాయం
సీఎం చంద్రబాబును కలిసి రూ.50 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్న రామ్ చరణ్, ఎన్టీఆర్
-
2024-09-13T07:26:46+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.