Breaking News: నేటి తాజా వార్తలు.
ABN , First Publish Date - Oct 05 , 2024 | 09:24 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-10-05T11:55:25+05:30
హర్ష సాయికి లుక్ అవుట్ నోటీసులు జారీ
హైదరాబాద్: యూట్యూబర్ హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం.
లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన నార్సింగి పోలీసులు.
ఇప్పటికే హర్షసాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
హర్ష సాయిపై లైంగిక ఆరోపణలు.
మెగా సినిమా కాపీ రైట్స్ కోసం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు.
పరారీలో ఉన్న హర్ష సాయి.
హర్ష సాయి కోసం గాలిస్తున్న పోలీసులు.
-
2024-10-05T10:43:36+05:30
ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్
కొనసాగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.
ఉదయం 9 గంటల వరక 9.53 శాతం పోలింగ్ నమోదు.
మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్.
-
2024-10-05T09:34:48+05:30
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
తిరుమల: తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి.
కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు.
ప్రశాతంతకు భంగం కలగకూడదు...ఏ విషయంలోనూ రాజీ పడొద్దు
భవిష్యత్ అవసరాలకు తగినట్టు నీటి లభ్యత ఉండేలా చూసుకోండి...ముందస్తు ప్రణాళిక చాలా అవసరం
అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు చంద్రబాబు సూచన
-
2024-10-05T09:32:39+05:30
ఆ జిల్లా పేరు మార్చండి
కడప: వైఎస్ఆర్ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చండి
సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
చారిత్రక నేపథ్యం ఉన్న కడపను గత ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది
లేఖలో ప్రస్తావించిన సత్యకుమార్
-
2024-10-05T09:24:46+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.