Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Oct 04 , 2024 | 07:29 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

   Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-10-04T12:19:07+05:30

    • హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ

    • జీవో నెంబర్ 99పై స్టే విధించాలని కోరిన కేఏ పాల్

    • హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపివేయాలని వాదనలు వినిపించిన కేఏ పాల్

    • హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే కూల్చివేతలు చేపట్టాలని పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు

    • అక్రమ కట్టడాలు కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కోరిన పిటిషనర్

    • ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమన్న న్యాయస్థానం

    • ప్రతి వాదులుగా హైడ్రా, ప్రభుత్వానికి నోటీసులు

    • కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

    • తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా

  • 2024-10-04T11:28:42+05:30

    సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

    • సిట్‌లో ఉన్న అధికారులపై పూర్తి విశ్వాసం ఉంది.

    • స్వతంత్ర విచారణ కోరుకుంటున్నందున కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న సీనియర్‌ పోలీసు అధికారి పర్యవేక్షణ చేయాలని అనుకుంటున్నాం: సొలిసిటర్‌ జనరల్‌

    • ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు.

    • కమిటీలో ఇద్దరు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర పోలీసు నుంచి, ఒకరి ఆహార భద్రత అథారిటీ నుంచి నియమిస్తూ ఆదేశాలు.

    • సీబీఐ డైరక్టర్‌ పర్యవేక్షణలో కమిటీ పని చేస్తుంది: సుప్రీంకోర్టు.

    • సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు విముఖత చూపిన ధర్మాసనం

    • వైవి సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం

    • రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచు కోలేదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించిన ధర్మాసనం.

    • భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని ధర్మాసనం సూచన

  • 2024-10-04T11:24:55+05:30

    తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం

    • ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో సీనియర్‌ పోలీసు అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి: సొలిసిటర్‌ జనరల్‌

    • భక్తుల మనోభావాలకు చెందిన విషయం అయినందున దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నాం: సొలిసిటర్‌ జనరల్‌

    • రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు ఎలాంటి అనుమానాలు లేవు: కేంద్రం ప్రభుత్వం

  • 2024-10-04T10:47:25+05:30

    కేటీఆర్ కామెంట్స్

    • హైదరాబాద్: 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదనే వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం రేవంత్ బండారం మరోసారి బట్టబయలైంది.

    • వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని సీఎం రేవంత్ రెడ్డి విర్రవీగారు

    • సీఎం రేవంత్ మాటలు డొల్లమాటలేనని మరోసారి తేలిపోయింది.

    • డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం.

    • 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందనే మాటలు నయవంచన కాక మరేంటి

    • అధికారిక లెక్కల ప్రకారం.. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగింది.. అనధికారికంగా రుణమాఫీ కానీ రైతులెందరు

    • రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు.. రైతుబంధు సీజన్ ముగిసినా ఇవ్వలేదు

    • రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం.. రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపం

  • 2024-10-04T09:23:50+05:30

    పోస్టర్ల కలకలం

    • హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్ల కలకలం.

    • కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు వెలిసిన పోస్టర్లు.

    • గ్రూప్-1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు..సిగ్గు అని పోస్టర్లు.

    • హైదర్ గూడ‌లో తెలుగు అకాడమీ ముందు వెలసిన పోస్టర్లు

    • తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ పోస్టర్లు.

    • తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం

    • అకాడమీ పుస్తకాలు ఎవరు కొనొద్దని విజ్ఞప్తి చేస్తూ పోస్టర్లు.

  • 2024-10-04T08:45:29+05:30

    • నవరాత్రి శోభ

    • వరంగల్: భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

    • అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు

    • అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు

  • 2024-10-04T08:05:05+05:30

    సుప్రీంకోర్టు విచారణ

    • ఢిల్లీ: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ

    • విచారణ చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం

    • బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ

    • సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అనే అంశంపై వైఖరి తెలియజేయనున్న కేంద్రం

    • నిన్నటి విచారణ సందర్భంగా ఈ రోజు సమయం కోరిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా

  • 2024-10-04T07:54:03+05:30

    కేటీఆర్, హరీశ్‌పై సైబర్ క్రైమ్‌లో కేసు

    • హైదరాబాద్: కేటీఆర్ హరీష్ రావుపై సైబర్ క్రైమ్‌లో కేసు

    • మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు

    • సోషల్ మీడియాలో కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై ట్రోలింగ్

    • ట్రోల్ చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

    • కేటీఆర్, హరీష్ రావుతోపాటు పలు యూట్యూబ్ చానళ్లపై కేసు

    • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • 2024-10-04T07:50:49+05:30

    మరోసారి నోటీసులు

    • హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మరోసారి ఈడీ నోటీసులు

    • ఈ నెల 8వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ

    • నిన్న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్న అజారుద్దీన్

    • వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేనని అజార్ విన్నపం

    • 8వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం

  • 2024-10-04T07:29:42+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.