Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Nov 05 , 2024 | 03:47 PM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
Nov 05, 2024 19:11 IST
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం జనాభా లెక్కలు
అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని సామాజిక న్యాయం
ఇచ్చిన మాటలను చేతలతో చేతలతో చేసి చూపించాలని రాహుల్ గాంధీ చెప్పారు
లీగల్ లిటిగేషన్ లేకుండా కుల గణన చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

-
Nov 05, 2024 17:23 IST
మందకృష్ణ మాదిగ కామెంట్స్
అమరావతి: ముప్పై ఏళ్ల ఎమ్మార్పీఎస్ ఉద్యమం అందరి సహకారంతో విజయం సాధించింది: మందకృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరా
సీఎం చంద్రబాబుతో ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం గంటపాటు వివిధ అంశాలపై చర్చ
ఎన్నికలకు ముందు అరగంట చర్చ
ఉమ్మడి రాష్ట్రంలో తొలుత వర్గీకరణకు చంద్రబాబు చట్టం చేశారు
వర్గీకరణకు అందరి కన్నా ముందు చేసింది చంద్రబాబే
సుప్రీం కోర్టు తీర్పు ఈ చట్టాన్ని సమర్థించినట్టు అయింది
ఈ మధ్య హర్యానా ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీన కమిటీ వేసింది
మహారాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశారు
తెలంగాణలో కమిటీ వేసి రెండు నెలల్లోగా రిపోర్టు తీసుకుంటాం అన్నారు
చంద్రబాబు నాయుడుపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది
వర్గీకరణను ఇక ముందుకు తీసుకు వెళ్లి వెంటనే అమలు చేయాలి అని కోరుతున్నా: మందకృష్ణ
దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు వర్గీకరణను సమర్థించాయి
వర్గీకరణ విషయంలో ఏపీ ఆదర్శంగా ఉండాలని సీఎంను కోరా
వర్గీకరణకు కమిషన్ వేస్తా అని సీఎం చంద్రబాబు అన్నారు.
కర్ణాటకలో కమిషన్ రిపోర్టు వచ్చేవరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పారు
-
Nov 05, 2024 17:15 IST
ఉప రాష్ట్రపతితో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ
ఢిల్లీ: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌తో టీడీపీపీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ
రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన అంశాలపై ఉపరాష్ట్రపతితో చర్చ
రాష్ట్ర ప్రగతికి ఉపరాష్ట్రపతిగా తన వంతు సహకారం అందించాలని కోరిన ఎంపీ
టీడీపీ ఎంపీ విజ్ణప్తికి సానుకూలంగా స్పందించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్
-
Nov 05, 2024 17:13 IST
ఏపీ సీఎం చంద్రబాబుతో మందకృష్ణ భేటీ
అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబుతో మందకష్ణ మాదిగ సమావేశం
ఎస్సీ రిజర్వేషన్ అంశంపై చంద్రబాబుతో చర్చ
రిజర్వేషన్ గురించి చంద్రబాబుకు సుధీర్ఘంగా వివరించిన మందకృష్ణ మాదిగ
-
Nov 05, 2024 17:11 IST
సిటీలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు
కఠిన నిబంధనలు అమలు చేయనున్న పోలీసులు.
స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు..
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.200 ఫైన్...
రాంగ్ సైడ్, రాంగ్ రూట్ లో వాహనాలు నడిపినా సీరియస్ యాక్షన్.
-
Nov 05, 2024 16:08 IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అప్‌డేట్స్
కాసేపట్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ముందుగా ఓటు వేసిన 78 మిలియన్ల అమెరికన్లు
న్యూ హ్యంప్‌షైర్‌లో తొలి ఓటు నమోదు
ట్రంప్-హరిస్ గెలుపుపై భారీగా బెట్టింగ్

-
Nov 05, 2024 16:02 IST
శరద్ పవార్ కీలక నిర్ణయం
ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని శరద్ పవార్ ప్రకటన
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవార్ ప్రకటన
-
Nov 05, 2024 15:53 IST
మరికాసేపట్లో ప్రారంభం కానున్న అమెరికా పోలింగ్
కమలా హరీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ
-
Nov 05, 2024 15:47 IST
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.