Share News

Breaking News: ఆ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ABN , First Publish Date - Nov 29 , 2024 | 10:06 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

  Breaking News: ఆ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
Breaking News

Live News & Update

  • 2024-11-29T22:04:47+05:30

    సినీ ఫక్కిలో చోరీ

    • సత్తెనపల్లిలోని సంగం బజార్ లో సినీ ఫక్కిలో చోరీ

    • ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధుడి దృష్టి మరల్చి మెడలోని బంగారు గొలుసు అపహరించిన దుండగుడు

    • ఇంట్లోకి వచ్చి అగ్గిపెట్టె అడిగిన దుండగుడు

    • అగ్గిపెట్టె ఇస్తుండగా చైన్ లాక్కెళ్లిన దుండగుడు ..

    • పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు గోపాలరావు

  • 2024-11-29T21:10:06+05:30

    టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్‌‌గా బాధ్యతల స్వీకరణ

    • టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నవ మోహన్ కృష్ణ

    • గుంటూరులో ప్రమాణస్వీకార సభ

    • కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు , చదలవాడ అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మ రెడ్డి, నరేంద్ర వర్మ, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఛైర్మన్ పట్టాబి, పలువురు టిడిపి నేతలు

    • మన్నవ మోహన్ కృష్ణ ను అభినందించిన నేతలు

    • తనకు ఇచ్చిన పదవిని హోదాలా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తానన్న మన్నవ మోహన్ కృష్ణ

  • 2024-11-29T21:06:25+05:30

    మహిళపై యాసిడ్ దాడి

    • విశాఖపట్టణంలో ఆర్టీసీ బస్సులో మహిళలపై యాసిడ్ దాడి

    • యాసిడ్ దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి

    • యాసిడ్ దాడి అనంతరం అక్కడ నుంచి నిందితుడు పరార్

    • కళ్ళు మంటలతో విలపిస్తున్న ముగ్గురు మహిళలు

    • ఆటోలో ఆస్పత్రికి తరలింపు

    • కంచరపాలెం ఐటిఐ జంక్షన్ వద్ద ఘటన

    • ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో స్తంభించిన ట్రాఫిక్

    • ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న కంచరపాలెం పోలీసులు

  • 2024-11-29T20:17:22+05:30

    విజయనగరంలో ఎన్వీ రమణ పర్యటన

    • శనివారం విజయనగరంలో పర్యటించనున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్.వి. రమణ

    • ఆనందగజపతి కళాక్షేత్రంలో నటుడు, రచయిత మీగడ రామలింగస్వామికి గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ

  • 2024-11-29T20:12:36+05:30

    ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదం

    • ఆత్మకూరు మండలం కరివేన గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి

    • మృతి చెందిన వ్యక్తి నందికుంట గ్రామానికి చెందిన శంకర్‌గా గుర్తింపు

  • 2024-11-29T20:08:07+05:30

    ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు

    • జిల్లా కోర్టు లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన డాక్టర్ ప్రభావతి

    • రఘురామకృష్ణంరాజు కస్టోడీయల్ టార్చర్ కేసులో ఐదవ నిందితరాలుగా ప్రభావతి

    • అప్పట్లో జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ ప్రభావతి

    • రఘురామ మెడికల్ రిపోర్ట్ తప్పుగా ఇచ్చినట్లు అభియోగం

    • విజయ్ పాల్ అరెస్ట్ నేపథ్యం లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ప్రభావతి

  • 2024-11-29T20:05:40+05:30

    టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన బీజేపీ నాయకులు

    • టీటీడీ ఛైర్మన్‌ను బీఆర్‌ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

    • టీటీడీ ఛైర్మన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాజానగరం నియోజకవర్గం కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి

    • రాజమండ్రిలో బీఆర్‌ నాయుడును కలిసిన వీరన్న చౌదరి

    • టీటీడీలో చేపట్టిన సంస్కరణలపై అభినందనలు తెలిపిన వీరన్న చౌదరి

      BR Naidu.jpg

  • 2024-11-29T19:13:59+05:30

    డోన్‌లో భారీ మోసం

    • నంద్యాల జిల్లా డోన్‌లో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం

    • రూ.40 కోట్లు వసూలు చేసిన రామాంజనేయులు

    • కేవ ఇండస్ట్రీస్ పేరుతో మోసానికి పాల్పడ్డ నిందితుడు

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన 200 మంది బాధితులు

  • 2024-11-29T17:30:02+05:30

    కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో రామ్మోహన్ నాయుడు భేటీ

    • కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశం

    • విశాఖ ఎంపీ భరత్ , కర్నూలు ఎంపీ నాగరాజు, అమలాపురం ఎంపీ హరీష్ , చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు భేటీ

    • ఏపీ లో పర్యాటక ప్రాజెక్టులపై చర్చ

  • 2024-11-29T17:26:24+05:30

    ర్యాలీలో కవిత

    • బసవతారకం ఆసుపత్రి వద్దకు చేరుకున్న కవిత

    • పార్టీ నేలతో కలసి ర్యాలీగా తెలంగాణ భవన్‌కు ఎమ్మెల్సీ కవిత

  • 2024-11-29T17:24:39+05:30

    ఆ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

    • అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.

    • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్​ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.

    • మూల వేతనంపై 5శాతం ఐఆర్​ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

  • 2024-11-29T16:58:51+05:30

    సరగోసి మహిళ ఆత్మహత్యను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి

    • తెలంగాణలో సరోగసి మహిళ ఆత్మహత్యను సుమోటో కేసుగా విచారణకు స్వీకరించిన జాతీయ మానవహక్కుల సంఘం

    • మై హోమ్ బూజా 9వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న బీహార్‌కు చెందిన మహిళ

    • తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు జారీచేసిన జాతీయ మానవ హక్కుల సంఘం

    • ఘటనపై తక్షణమే నివేదిక పంపాలని ఆదేశాలు

    • సరోగసి కోసం వచ్చిన మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన రాయదుర్గానికి చెందిన ఓ వ్యక్తి

    • సరోగసి కోసం ఉండలేక నవంబర్ 27న ఆత్మహత్య చేసుకున్న ఒడిశాకు చెందిన మహిళ

    • పది లక్షల రూపాయలు చెల్లించి సరోగసి కోసం ఒడిశా నుంచి మహిళను తెచ్చుకున్న రాయదుర్గానికి చెందిన వ్యక్తి

  • 2024-11-29T16:54:38+05:30

    శ్రీశైలం ఆలయానికి నూతన ఈవో

    • శ్రీశైలం దేవస్థానం నూతన ఈవోగా ఎమ్.శ్రీనివాసరావు నియామకం

    • రాష్ట్ర మెడికల్ బోర్డ్ నుండి దేవాదాయశాఖకు బదిలీ

    • శ్రీశైలం ఈవోగా శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

  • 2024-11-29T16:35:07+05:30

    రిషితేశ్వరి కేసులో నిందితులకు ఊరట

    • నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు ఊరట

    • 9 ఏళ్ల సుదీర్థ విచారణ తర్వాత కేసు కొట్టేసిన కోర్టు

    • 2015లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసు

  • 2024-11-29T16:05:12+05:30

    గుంటూరు కోర్టుకు బోరుగడ్డ అనిల్

    • గుంటూరు జిల్లా కోర్టుకు బోరుగడ్డ అనిల్ ను తీసుకొచ్చిన పట్టాభిపురం పోలీసులు

    • సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషణలపై కేసు నమోదు

    • పిటీ వారెంట్ పై బోరుగడ్డను రాజమండ్రి జైలు నుంచి తీసుకొచ్చిన పోలీసులు

    • బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన జిల్లా కోర్టు

    • రాజమండ్రి జైలుకు బోరుగడ్డ తరలింపు

  • 2024-11-29T15:30:53+05:30

    గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

    • ఇవాళ సాయంత్రం 8 గంటలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్న సీఎం చంద్రబాబు

    • పలు కీలక అంశాలపై చర్చించనున్న చంద్రబాబు

    • రాష్ట్రం లో పర్యటిస్తున్న మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

    • కోవింద్‌కు మర్యాదపూర్వకంగా నేడు విందు ఇవ్వనున్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్

    • ఈ సందర్భంగా రాజ్ భవన్ కి వెళ్లి కోవింద్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వక భేటీ కానున్న సీఎం చంద్రబాబు

  • 2024-11-29T15:26:19+05:30

    బీఆర్ఎస్ దీక్షా దివస్‌లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

    • నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్ దీక్షా దివస్

    • దీక్షా దివస్‌లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

    • సీఎం రేవంత్ పై ప్రజలు తిరగబడుతున్నారు

    • ఏడాది పాలనలోనే ప్రజలు తిట్ల పురాణం అందుకున్నారు

    • రేవంత్ రెడ్డికి మూడింది

    • తెలంగాణ లో చిల్లర ప్రభుత్వం నడుస్తోంది

    • దీక్షా దివస్ రోజు మీడియా డైవర్షన్ కోసమే మంత్రులు పర్యటనలు పెట్టుకున్నారు

    • తెలంగాణ ప్రజల కోసం నాడు కేసీఆర్ దీక్ష

    • కేసీఆర్ దీక్షా దివస్ తోనే నాడు కేంద్రంలో కదలిక

    • నాడు తెలంగాణ కాంగ్రెస్ చేతిలో బందీ అయింది

    • నేడు రేవంత్ చేతిలో బందీ అయ్యింది

    • 11 నెలల్లో తెలంగాణను అస్తవ్యస్తం చేశారు

    • 2027 లో జమిలీ ఎన్నికలు

    • మళ్లీ అధికారం బీఆర్ఎస్ దే

    • గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు సవరించుకుంటాం

    • పోలీసు కేసులకు భయపడం

  • 2024-11-29T13:40:53+05:30

    • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • లగచర్ల భూసేకరణపై వెనక్కి తగ్గిన సర్కార్

    • భూ సేకరణ ప్రకటన నిలిపి వేస్తూ ఉత్తర్వులు

  • 2024-11-29T13:19:07+05:30

    చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

    • చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    • స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

    • ఏపీ హైకోర్టు తీర్పును గత జగన్ ప్రభుత్వ హయాంలో సుప్రీంలో సవాలు చేసిన సీబీసీఐడీ

    • ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వర్చువల్‌గా వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి

    • బెయిల్ రద్దును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న ముకుల్ రోహత్గి

    • ఢిల్లీలో లేనని, విచారణకు స్వయంగా హాజరు కావాలని అకుంటున్నందు వల్ల జనవరి వరకు సమయం ఇవ్వాలని కోరిన ముకుల్ రోహత్గి

    • జనవరి రెండో వారానికి కేసు విచారణను వాయిదా వేసిన జస్టిస్ బేలా ఎం త్రివేదీ ధర్మాసనం

  • 2024-11-29T12:40:48+05:30

    • నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

    • 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం

    • ట్రింకోమలీకి 270 కి.మీ, నాగపట్నానికి 300 కి.మీ, పుదుచ్చేరికి 340 కి.మీ, చెన్నైకి 380 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

    • రాగల 6 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం

    • రేపు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం సమీపంలో గల..

    • కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం

    • ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు,

    • మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

    • తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

    • రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

  • 2024-11-29T12:36:01+05:30

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

    • రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు పిటిషన్.

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని పిటిషన్.

    • తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని పేర్కొన్న ప్రభాకర్ రావు.

    • ప్రభుత్వం తనను వేధిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్న ప్రభాకర్ రావు.

    • తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్న ప్రభాకర్ రావు.

    • ఫ్లోరిడాలో తన కుమారుని వద్ద ఉంటున్నానని పేర్కొన్న ప్రభాకర్ రావు.

    • అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియా రప్పించేందుకు ప్రయత్నం.

    • ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసుల ప్రయత్నాలు.

    • చికాగోకు చేరుకున్న చానల్ ఎండీ శ్రవణ్ రావు

    • చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్ కనుగొన్న పోలీసులు

  • 2024-11-29T12:34:10+05:30

    సుప్రీంకోర్టుకు చేరిన భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు ఇష్యూ

    • సుప్రీంకోర్టుకు చేరిన వై ఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం

    • వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు

    • భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ

    • మరికొద్ది సేపట్లో సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ

  • 2024-11-29T12:30:56+05:30

    భారీ చోరీ

    • కూకట్ పల్లి జయనగర్‌లో భారీ చోరీ

    • నిన్న రాత్రి ఓ ఇంట్లో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు

    • బీరువా పగులగొట్టి 80 తులాల బంగారం

    • 2 లక్షల నగదు చోరీ చేసిన దుండగులు

  • 2024-11-29T11:33:15+05:30

    సుప్రీంకోర్టులో విచారణ

    1. ఢిల్లీ: చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

    2. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

    3. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన జగన్ ప్రభుత్వం

  • 2024-11-29T11:30:58+05:30

    వాయు కాలుష్యం..

    • ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం స్థాయి

    • కొన్ని ప్రాంతాల్లో 400 పాయింట్లు దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్

    • ఢిల్లీలో సగటున 332 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు

  • 2024-11-29T11:02:21+05:30

    పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

    • నరేందర్‌పై నమోదైన 3 ఎఫ్ఐఆర్‌లలో రెండు కొట్టేసిన హైకోర్టు

    • ఒకే ఘటనలో 3 ఎఫ్ఐఆర్‌ నమోదును సవాల్ చేసిన నరేందర్‌రెడ్డి

    • నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు: నరేందర్‌రెడ్డి

    • నరేందర్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు

  • 2024-11-29T10:36:56+05:30

    ఆప్ ఎంపీల నిరసన

    • ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల ఆందోళన

    • ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని నినాదాలు

    • కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్

  • 2024-11-29T10:34:15+05:30

    అవినాష్ అనుచరులకు రాచ మర్యాదలు

    • కడప: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీధర్ రెడ్డికి తిరుమలలో మర్యాదలు

    • రాచమర్యాదలు చేసిన టీడీపీ నేత లు

    • సీఎం చంద్రబాబు దృష్టికి తీసువెళ్ళిన రాచమర్యాదల వ్యవహారం

    • కడప టీడీపీ నేతలు ఎవరనే అంశంపై ఆరా తీస్తోన్న సీఎం చంద్రబాబు

  • 2024-11-29T10:30:21+05:30

    రిషితేశ్వరి కేసులో తీర్పు

    • గుంటూరు జిల్లా: రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఈ రోజు కోర్టు తీర్పు

    • 2015 జులై 14వ తేదీన రిషితేశ్వరి ఆత్మహత్య

    • నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన రిషితేశ్వరి

    • రిషితేశ్వరి స్వస్థలం వరంగల్‌

    • ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నానని రిషితేశ్వరి సూసైడ్ నోట్

    • అప్పట్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య

    • నేడు తీర్పు వెలువరించనున్న గుంటూరు జిల్లా ఐదవ కోర్టు

  • 2024-11-29T10:26:28+05:30

    ఆంజనేయస్వామి విగ్రహం తొలగింపు

    • సూర్యాపేట: చిలుకూరు మండలం రామాపురంలో ఉద్రిక్తత.

    • అర్ధరాత్రి కరెంటు ఆఫ్ చేసి ఆంజనేయస్వామి విగ్రహం తొలగింపు

    • వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వదిలి పెట్టిన వైనం

    • గ్రామంలో భయాందోళనలు, పోలీసు బలగాల మోహరింపు

  • 2024-11-29T10:09:38+05:30

    మహిళపై పులిదాడి

    • కొమురం భీం జిల్లాలో మహిళ పై పులి దాడి

    • కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్‌లో ఘటన

    • వ్యవసాయ పనులకు వెళ్తుండగా దాడి చేసిన పులి

    • మహిళకు తీవ్ర గాయాలు, ఆసుపత్రి కితరలింపు

    • పులి దాడిలో మహిళ మృతి

    • మృతురాలు గన్నారం వాసి మోర్లే లక్ష్మీ

  • 2024-11-29T10:04:29+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.