Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Dec 02 , 2024 | 06:11 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-12-02T08:24:15+05:30
పులి కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో పులి జాడ కోసం కొనసాగుతున్న అన్వేషణ
ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉందని అటవీ శాఖ అధికారులు నిర్ధారణ
ట్రాప్ కెమెరాలు, డ్రోన్‌ల సహాయంతో పులి కోసం సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు
గాలింపులో చర్యల్లో పాల్గొన్న 10 ప్రత్యేక బృందాలు
పులి ప్రభావిత గ్రామాల్లో కొనసాగుతున్న ఆంక్షలు, 144సెక్షన్ అమలు
రైతులను పంటచేలకు, అటవీ మార్గాల గుండా వెళ్లనీయని అధికారులు
పులి నుంచి ప్రజలను కాపాడేందుకు మాస్కులు పంపిణీ చేస్తున్న అధికారులు
-
2024-12-02T08:07:48+05:30
నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల కమిటీ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై నేడు భేటీ కానున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల కమిటీ
మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో భేటీ కానున్న అధికారుల కమిటీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై తొలిసారి ఏపీలో సమావేశం కానున్న అధికారులు
రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్న అధికారుల కమిటీ
ఏపీ పునఃవ్యవస్థీకరణ చట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తుల పంపకాలపై ప్రధాన చర్చ
2024 జులై 5న తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం
తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.7,200 వేల కోట్ల విద్యుత్ బకాయిల్లో ఇటీవల రూ.2,500 కోట్లు కేంద్రం విడుదల
మిగతా బకాయిలపైనా ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించే అవకాశం
ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశాలపై చర్చించనున్న అధికారులు
ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపైనా ప్రధానంగా చర్చ
అలాగే వృత్తి పన్ను పంపకం అంశం చర్చకు వచ్చే అవకాశం
ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపైనా చర్చ
ఏపీ పునఃవ్యవస్థీకరణ చట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో మిగివిపోయిన రూ.8 వేల కోట్ల నిధులు పంపకాలపైనా అధికారుల కమిటీ చర్చించే అవకాశం
-
2024-12-02T07:40:09+05:30
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
నేడు సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి
హెచ్‌సీసీబీ అవిన్యా గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్
-
2024-12-02T07:29:19+05:30
డ్రగ్స్ కలకలం.. నలుగురి అరెస్టు..
గచ్చిబౌలిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు డ్రగ్స్ పట్టివేత
ఓయో హోటల్లో డ్రగ్స్ సేవిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు
గచ్చిబౌలి డీఎల్ఎఫ్ సమీపంలోని ఓయో బోటిక్ హోటల్లో డ్రగ్స్ సీజ్
ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు, ఇద్దరు మత్తుపదార్థాలు సేవించిన వారి అరెస్టు
డ్రగ్ పెడ్లర్లు వైజాక్‌కి చెందిన గులిపల్లి గంగాధర్, హైదరాబాద్‌కి చెందిన మొహంతిగా గుర్తింపు
డ్రగ్స్ సేవిస్తున్న ప్రియాంకరెడ్డితోపాటు షకిను అరెస్ట్ చేసిన పోలీసులు
ఎండీఎమ్ఏ 18 గ్రాములు, ఇండియన్ చెర్రస్ 7 గ్రాములు, ఎల్ఎస్డీ డ్రగ్స్, ఓజీ కుష్ ఒక గ్రాము స్వాధీనం
నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు
-
2024-12-02T07:17:49+05:30
ములుగు ఏజెన్సీలో టెన్షన్ టెన్షన్..
ములుగు ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం
ఒకవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్, మరోవైపు మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు
అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు.. ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మర కూంబింగ్
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనుల నిలిపివేత
హిట్‌లిస్టులో ఉన్న వారికి హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు
హిట్ లిస్టులో ఉన్న నేతలు అనుమతి లేనిదే అడవుల్లోకి రావొద్దన్న పోలీసులు
-
2024-12-02T07:13:13+05:30
నేటి నుంచి పీఎల్‌జీఏ వార్షికోత్సవాలు
24వ పీఎల్‌జీఏ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
వార్ జోన్‌గా మారిన తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు, నివురు గప్పిన నిప్పులా భద్రాద్రి ఏజెన్సీ
వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు, మరోవైపు అడవిని జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
మావోయిస్టులు సంచలనాల కోసం దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారం
ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేయాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీ లేకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్ లైన్
గెరిల్లా వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తమైన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు
-
2024-12-02T06:53:07+05:30
నేడు ఘనంగా ఆరోగ్య ఉత్సవాలు..
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నేడు ఆరోగ్య ఉత్సవాలు
మధ్యాహ్నం 3గంటలకు అంబేడ్కర్ విగ్రహం దగ్గర గ్రౌండ్‌లో ఉత్సవాలు నిర్వహణ
16 నర్సింగ్ కాలేజీలు, 28 ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
అలాగే 32 ట్రాన్స్‍జెండర్స్ క్లినిక్‌లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
213 నూతన అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్..
ఇటీవల ఎంపికైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేత
-
2024-12-02T06:48:49+05:30
మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం..
ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించనున్న అధికారులు
ఇప్పటికే నాలుగు మృతదేహాల గుర్తింపు, మరో మూడు మృతదేహాలను గుర్తించని పోలీసులు
పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు మృతదేహాలు అప్పగించనున్న పోలీసులు
ఎన్‌కౌంటర్ బూటకమన్న ఆరోపణల నేపథ్యంలో కీలకం కానున్న పోస్ట్‌మార్టం నివేదిక
ములుగు జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో భద్రపరిచిన మావోయిస్టుల మృతదేహాలు
అక్కడే పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేసిన అధికారులు
-
2024-12-02T06:41:52+05:30
నేడు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ..
నేడు ధరల స్థిరీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది.
సబ్ కమిటీ మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అచ్చెన్న, పయ్యావుల సమావేశం కానున్నారు.
ఇవాళ ఉదయం 11గంటలకు వెగలపూడి సచివాలయంలో భేటీ కానున్న సబ్ కమిటీ..
-
2024-12-02T06:28:01+05:30
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..
ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న డిప్యూటీ సీఎం పవన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశం కానున్న పవన్ కల్యాణ్
కాకినాడ పోర్టు వ్యవహారంతోపాటు, ఇతర అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం
-
2024-12-02T06:24:40+05:30
ఘనంగా పోలి పాడ్యమి వేడుక..
పోలి పాడ్యమి సందర్భంగా దీపాల వెలుగుల కాంతులతో కళకళలాడిన కృష్ణమ్మ
కార్తిక మాసం ముగింపు సందర్భంగా పోలి స్వర్గం
కార్తిక మాసం నెలరోజులపాటు పుణ్యస్నానాలు చేసిన భక్తులు
కార్తిక మాసం ముగింపును మార్గశిర శుద్ధ పాడ్యమిగా పిలుస్తారు
నేడు తెల్లవారుజామునే పోలిని స్వర్గానికి పంపిన భక్తులు
నదీ స్నానం చేసి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి నదిలో వదిలిన భక్తులు
పోలి సందర్భంగా కిటకిటలాడిన భవానీ జల శంకర ఆలయం, పాత శివాలయం
యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
-
2024-12-02T06:11:46+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.