Share News

Election Results: 8..8..8. ఆ పార్టీకి కలిసొచ్చిన నెంబర్..

ABN , Publish Date - Jun 05 , 2024 | 02:54 PM

ఒక్కో మనిషికి, ఒక్కో పార్టీకి లక్కీ నెంబర్ అంటూ ఉంటుంది. నెంబర్ అవసరం వచ్చినప్పుడల్లా లక్కీ నెంబర్‌ను ఎంచుకుంటారు. కొన్నిసార్లు ఎంచుకోకపోయినా ఒక నెంబర్ లక్కీ నెంబర్‌గా మారిపోతుంది. యాదృశ్చికంగా జరిగినా అది నిజంగా ఆ పార్టీ లక్కీ నెంబర్‌ ఏమో అనిపిస్తుంది.

Election Results: 8..8..8. ఆ పార్టీకి కలిసొచ్చిన నెంబర్..
BJP

ఒక్కో మనిషికి, ఒక్కో పార్టీకి లక్కీ నెంబర్ అంటూ ఉంటుంది. నెంబర్ అవసరం వచ్చినప్పుడల్లా లక్కీ నెంబర్‌ను ఎంచుకుంటారు. కొన్నిసార్లు ఎంచుకోకపోయినా ఒక నెంబర్ లక్కీ నెంబర్‌గా మారిపోతుంది. యాదృశ్చికంగా జరిగినా అది నిజంగా ఆ పార్టీ లక్కీ నెంబర్‌ ఏమో అనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఏపీ, తెలంగాణలో బీజేపీ లక్కీ నెంబర్ 8 ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలైనా.. ప్రస్తుతం ఏపీ శాసనసభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్ల సంఖ్య 8. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రస్తుతం తెలంగాణలో లోక్‌సభలో 17 స్థానాల్లో పోటీచేయగా బీజేపీ 8చోట్ల గెలిచింది. మరోవైపు ఏపీ అసెంబ్లీలో 10 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయగా 8 చోట్ల విజయం సాధించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లక్కీ నెంబర్ 8 అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

AP Election Result 2024: కలిసొచ్చిన ‘ఫ్యామిలీ’!


8 కలిసొచ్చిందా..

తెలంగాణ, ఎపీలో బీజేపీకి 8 నెంబర్ కలిసొచ్చినట్లు కనిసిస్తోంది. తెలంగాణ లోక్‌సభలో 2019 ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. తాజా ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది. మరోవైపు తాము తెలంగాణలో 8 సీట్లు గెలుస్తామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా కొద్దిరోజుల ముందు ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఏపీలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీచేయగా.. సగం స్థానాల్లో గెలిస్తే మంచి రిజల్ట్ వచ్చినట్లేనని బీజేపీ నేతలు భావించారు. తప్పకుండా 3 నుంచి 4 గెలుస్తామని.. అదృష్టం కలిసొస్తే 5 సీట్లు గెలుస్తామని భావించారు. కానీ ఊహించినదానికంటే ఎక్కువుగా మొత్తం 8 స్థానాల్లో గెలుపొందటంతో బీజేపీకి 8 లక్కీ నెంబర్‌గా మారిందనే చర్చ జరుగుతోంది.


Prathipati Pullarao: వైసీపీ ఓటమికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్ రెడ్డే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Andhra Pradesh and Latest Telugu News

Updated Date - Jun 05 , 2024 | 02:54 PM