Share News

REVA University: ‘రేవా’లో 4,537మందికి పట్టాల ప్రదానం

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:31 AM

బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక రేవా యూనివర్సిటీ తొమ్మిదో స్నాతకోత్సవంలో 4,537 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.

REVA University: ‘రేవా’లో 4,537మందికి పట్టాల ప్రదానం

బెంగళూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక రేవా యూనివర్సిటీ తొమ్మిదో స్నాతకోత్సవంలో 4,537 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో యూజీసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ మామిడాళ జగదీశ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఉద్యోగాలకంటే పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలని ప్రజాప్రభుత్వ సాధనలు, హక్కుల విషయంలో గర్వపడాలన్నారు. చాన్స్‌లర్‌ పి.శ్యామరాజు మాట్లాడుతూ అకడమిక్‌ ద్వారా పట్టాలు సాధ్యమని అంతకుమించి నైపుణ్యత పొందేలా యూనివర్సిటీలో సౌలభ్యాలు కల్పించామన్నారు. ప్రొ-చాన్స్‌లర్‌ ఉమేశ్‌ ఎస్‌ రాజుతోపాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 03:31 AM