Share News

X App: ఇకపై X యాప్‌లో ఆడియో, వీడియో కాల్స్..కానీ ఈ సౌకర్యం..

ABN , Publish Date - Jan 20 , 2024 | 07:12 PM

మైక్రోబ్లాగింగ్ సైట్ X (గతంలో ట్విట్టర్) నుంచి క్రేజీ ఫీచర్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం మాదిరిగా ఎక్స్ యాప్ ద్వారా కూడా అడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

X App: ఇకపై X యాప్‌లో ఆడియో, వీడియో కాల్స్..కానీ ఈ సౌకర్యం..

మైక్రోబ్లాగింగ్ సైట్ X (గతంలో ట్విట్టర్) నుంచి క్రేజీ ఫీచర్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం మాదిరిగా ఎక్స్ యాప్ ద్వారా కూడా అడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. మీరు ఈ యాప్‌ని ఓపెన్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.

ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ ప్రియమైన వారితో లేదా మీ అనుచరులతో ముఖాముఖి వీడియో కాల్‌ల ద్వారా కనెక్ట్ కావచ్చు. అందులో ఆడియో, వీడియో కాల్ ఫీచర్ వచ్చిందని రాసి ఉంటుందని చెప్పారు. అయితే దీనిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చుద్దాం.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Instagram: ఇన్‌స్టా నుంచి సరికొత్త ఫీచర్..ఇకపై స్క్రీన్ టైం..

-ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లండి

-ఇప్పుడు ప్రైవసీ అండ్ సేఫ్టీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-ఇక్కడ డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ కనిపిస్తుంది

-ఆ తర్వాత ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్‌ని ఎనేబుల్ చేయండి

Xగా పిలవబడే ట్విట్టర్‌ను 'ఎవ్రీథింగ్ యాప్'గా మార్చాలని ఎలాన్ మస్క్ అనుకుంటున్నారు. అందులో భాగంగానే మస్క్ ఈ యాప్ ద్వారా ప్రజలకు వినోదం, వార్తలు, సందేశం సహా చెల్లింపు వంటి ఫీచర్లను అందించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే మస్క్ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ iOS వినియోగదారులకు అందుబాటులో లేదు.

అయితే ఈ కొత్త కొత్త ఫీచర్ ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. బ్లూ టిక్ వినియోగదారులు మాత్రమే ఆడియో, వీడియో కాల్‌లు చేసుకోగలరు. అయితే అందరికీ కాల్స్ రిసీవ్ చేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది.

Updated Date - Jan 20 , 2024 | 07:13 PM