Share News

WhatsApp: వాట్సాప్ యూజర్లూ.. తస్మాత్ జాగ్రత్త.. ఈ తప్పు చేస్తే అంతే సంగతులు!

ABN , Publish Date - Feb 03 , 2024 | 07:07 PM

వాట్సాప్.. ఈ మెసేజింగ్ యాప్ ప్రతిఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండిపోయింది. సన్నిహితుల్ని పలకరించాలన్నా, ఏదైనా ఓ విషయం పంచుకోవాలన్నా, ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేయాలన్నా.. ఈ యాప్‌నే ప్రధానంగా వాడుతుంటారు. బిలియన్ల మంది దీనిని వినియోగిస్తున్నారంటే, దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

WhatsApp: వాట్సాప్ యూజర్లూ.. తస్మాత్ జాగ్రత్త.. ఈ తప్పు చేస్తే అంతే సంగతులు!

వాట్సాప్.. ఈ మెసేజింగ్ యాప్ ప్రతిఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండిపోయింది. సన్నిహితుల్ని పలకరించాలన్నా, ఏదైనా ఓ విషయం పంచుకోవాలన్నా, ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేయాలన్నా.. ఈ యాప్‌నే ప్రధానంగా వాడుతుంటారు. బిలియన్ల మంది దీనిని వినియోగిస్తున్నారంటే, దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత పాపులారిటీ ఉంది కాబట్టే.. ‘వాట్సాప్ స్కామ్‌’లు పెరిగిపోయాయి. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం దగ్గర నుంచి స్పామ్ మెసేజ్‌లతో మోసాలకు పాల్పడే దాకా.. ఎన్నో నేరాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే.. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి, ఈ వాట్సాప్‌ని చెడు పనులకు వినియోగించుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే.. వాట్సాప్ సంస్థ గతేడాది నవంబర్ నెలలో ఏకంగా 71 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది.


IANS (ఇండియన్-ఏషియన్ న్యూస్ సర్వీస్) నివేదిక ప్రకారం.. 2021లో భారత ప్రభుత్వం రూపొందించిన కొన్ని కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి.. భారతదేశంలో 2023 నవంబర్‌లో 71 లక్షల అనుమానాస్పద ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. అందులో 19,54,000 ఖాతాలను ఎలాంటి ఫిర్యాదులు అందకముందే నిషేధించినట్లు ఆ సంస్థ పేర్కొంది. తన సొంత టెక్నాలజీ, సిస్టమ్‌లను ఉపయోగించి.. ఈ ఖాతాలు ప్రమాదకరమైనవని గుర్తించినట్లు తెలిసింది. నవంబర్‌లో వాట్సాప్ సంస్థకు 8,841 ఫిర్యాదులు అందాయని.. వాటి ఆధారంగానే ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వాట్సాప్‌కు చెందిన యూజర్-సేఫ్టీ రిపోర్ట్ పంచుకుంది. తమ ప్లాట్‌ఫామ్స్‌లో ‘అసభ్యత’ను అరికట్టేందుకు కూడా సొంత నివారణ చర్యలను తీసుకోవడం జరుగుతోందని వాట్సాప్ వివరించింది. దుర్వినియోగాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి వాట్సాప్ తన నిబద్ధతను కూడా నొక్కి చెప్పింది.

కొత్తగా ఏర్పాటు చేసిన ప్యానెల్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే వినియోగదారుల నుండి అప్పీళ్లను నిర్వహిస్తుంది. వీటిని పర్యవేక్షించడానికి ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, విశ్లేషకులు, చట్ట అమల్లోకి పరిశోధకులు, ఆన్‌లైన్ భద్రత & సాంకేతిక అభివృద్ధిలో నిపుణులతో సహా ప్రత్యేక నిపుణుల బృందంపై కంపెనీ ఆధారపడుతుంది. కాబట్టి.. వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు వార్తలు షేర్ చేసినా, స్పామ్ మెసేజ్‌లు వ్యాప్తి చేసినా.. మీ అకౌంట్‌పై బ్యాన్ ముద్ర పడే అవకాశం ఉంది. అలా జరిగితే.. ఇకపై మీరు వాట్సాప్ వినియోగించే అర్హతని కోల్పోతారు.

Updated Date - Feb 03 , 2024 | 07:07 PM