Share News

Realme: రియల్ మీ 12x 5జీ స్మార్ట్‌ఫోన్‌పై స్పెషల్ ఆఫర్

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:24 PM

మీరు మంచి ఫీచర్లు కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు రియల్ మీ(Realme) 12X 5జీ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపును ప్రకటించి స్పెషల్ సేల్ నిర్వహించారు. దీని అసలు ధర రూ.13,499 ఉండగా, ప్రస్తుతం రూ.11,999కే సేల్ చేశారు. అంతేకాదు ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12 గంటలకు కూడా మళ్లీ ఇదే రేటుకు స్పెషల్ సేల్ నిర్వహించనున్నారు.

Realme: రియల్ మీ 12x 5జీ స్మార్ట్‌ఫోన్‌పై స్పెషల్ ఆఫర్
realme 12x 5g smart phone

మీరు మంచి ఫీచర్లు కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు రియల్ మీ(Realme) 12X 5జీ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపును ప్రకటించి స్పెషల్ సేల్ నిర్వహించారు. దీని అసలు ధర రూ.13,499 ఉండగా, ప్రస్తుతం రూ.11,999కే సేల్ చేశారు. అంతేకాదు ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12 గంటలకు కూడా మళ్లీ ఇదే రేటుకు స్పెషల్ సేల్ నిర్వహించనున్నారు. దీనిని ఇప్పటికే స్పెషల్ సేల్‌లో ప్రతి నిమిషానికి 300 కంటే ఎక్కువ మంది కస్టమర్‌లు Realme 12xని కొనుగోలు చేశారు. ఈ సేల్‌లో ఈ ఫోన్ సంవత్సరంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న 5G స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.


ఇటివల చైనా(china)లో ప్రారంభమైన ఈ మోడల్స్ కొన్ని వారాల తర్వాత ఏప్రిల్ 2న ఇండియా(india)లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.72 అంగుళాల 120Hz FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 3D జూబ్లీ బ్రాస్‌లెట్, పాలిష్ చేసిన సన్‌బర్స్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఇందులో 50MP AI కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది 45W SUPERVOOC ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది కేవలం 30 నిమిషాల్లో ఫోన్‌ను 50% ఛార్జ్ చేస్తుంది.


ఈ ఫోన్‌ MediaTek Dimensity 6100+ చిప్‌సెట్, డైనమిక్ బటన్, మినీ క్యాప్సూల్ 2.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. Realme 12x ఫోన్ రెండు వేరియంట్‌లను రూ. 1000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. Realme 12x 4GB + 128GB వేరియంట్ ధర రూ.11,999గా ఉండగా దీనిపై మీరు బ్యాంక్ ఆఫర్ కింద రూ. 500 వరకు తగ్గింపును పొందవచ్చు. 6GB + 128GB వేరియంట్ ధర రూ. 13,499గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే మీరు రూ. 1000 వరకు తగ్గింపు పొందుతారు. ఈ ఫోన్‌ను కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ట్విలైట్ పర్పుల్, వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.


ఇది కూడా చదవండి:

Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. ఇది మీకు తెలుసా?

Credit Card: క్రెడిట్ కార్డ్‌ ఉపయోగం వల్ల 10 లాభాలు.. అవి ఏంటంటే


మరిన్ని సాంకేతిక వార్తల కోసం

Updated Date - Apr 05 , 2024 | 03:44 PM