Share News

POCO: రూ.8 వేలకే పోకో 5జీ స్మార్ట్‌ఫోన్.. సూపర్ ఆఫర్!

ABN , Publish Date - Mar 18 , 2024 | 01:22 PM

ఇటివల దేశీయ మార్కెట్లోకి వచ్చిన POCO X6 Neo 5 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్ కొనసాగుతుంది. ఈ ఫోన్లు ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో రూ.8 వేలకే లభించనున్నాయి. అయితే ఈ ఆఫర్ ఎలా వర్తిస్తుందో ఇప్పుడు చుద్దాం.

POCO: రూ.8 వేలకే పోకో 5జీ స్మార్ట్‌ఫోన్.. సూపర్ ఆఫర్!

ఇటివల దేశీయ మార్కెట్లోకి వచ్చిన POCO X6 Neo 5 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్ కొనసాగుతుంది. ఈ ఫోన్లు ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో రూ.8 వేలకే లభించనున్నాయి. అయితే ఈ ఆఫర్ ఎలా వర్తిస్తుందో ఇప్పుడు చుద్దాం. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ చేయబడింది. 8GB RAM + 128GB, 12GB RAM + 256GB. దీని ఫస్ట్ వేరియంట్ ప్రారంభ ధర రూ.15,999గా ప్రకటించారు. అదే సమయంలో దీని టాప్ వేరియంట్ రూ. 17,999గా పేర్కొన్నారు.


POCO X6 నియో 5G ఫీచర్లు

  • ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 nitsతో వస్తుంది

  • ఈ Poco స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 6080 ప్రాసెసర్ ఉంది, ఇది 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో సపోర్ట్ చేస్తుంది

  • POCO X6 నియో స్మార్ట్‌ఫోన్ IP54 వాటర్, డస్ట్‌ప్రూఫ్ సౌకర్యంతో లభిస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 3.5mm ఆడియో జాక్, USB టైప్ C పోర్ట్, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

  • ఈ స్మార్ట్‌ఫోన్ 33W USB టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో 5,000mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది

  • POCO X6 Neoలో 108MP ప్రధాన, 2MP సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP కెమెరా కూడా కలదు

ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మీరు ఈ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ. 1,000 తక్షణ బ్యాంక్ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా మీరు 563 రూపాయల ప్రారంభ EMIతో కూడా ఈ ఫోన్‌ను తీసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైనా ఫోన్ ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8 వేలకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే స్మార్ట్‌ఫోన్ ఎక్సేంజ్ మోడల్‌ను బట్టి ధరల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Uber: టాక్సీ డ్రైవర్లకు రూ.1475 కోట్లు చెల్లించేందుకు ఉబర్ అంగీకారం.. ఏమైందంటే

Updated Date - Apr 23 , 2024 | 09:42 AM