Share News

OnePlus వాచ్ 2 వచ్చేస్తుంది.. ఫీచర్లు చుశారా?

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:29 PM

OnePlus Watch 2 త్వరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ స్మార్ట్‌వాచ్‌కి సంబంధించిన రూమర్లు వస్తున్న క్రమంలో ఈ గడియారానికి సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.

OnePlus వాచ్ 2 వచ్చేస్తుంది.. ఫీచర్లు చుశారా?

వన్‌ప్లస్(OnePlus) కంపెనీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ టెక్ తయారీదారు స్మార్ట్ వాచ్ విభాగంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. గతంలో 2021 చివరలో స్మార్ట్ వాచ్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సంస్థ నుంచి మరొక కొత్త వాచ్(Watch 2) రానున్నట్లు తెలుస్తోంది. దీని గురించి కంపెనీ సోషల్ మీడియాలో వాచ్ ఫోటోతో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో వాచ్ మాదిరిగా ఉన్న డిజైన్ కనిపిస్తుంది. టీజర్‌ను కంపెనీ వన్‌ప్లస్ కమ్యూనిటీ పోస్ట్‌లో భాగస్వామ్యం చేశారు. అక్కడ ఉత్పత్తి ఏంటో చెప్పాలని ప్రజలను కోరారు.


OnePlus వాచ్ 2 అధికారికంగా రాబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో ప్రదర్శించబడుతుందని తెలుస్తోంది. OnePlus తన అధికారిక OnePlus కమ్యూనిటీ ఫోరమ్‌లో టీజర్ చిత్రాన్ని షేర్ చేసింది. ఈ వాచ్ స్పెసిఫికేషన్ వివరాలు ఓ నివేదిక ప్రకారం ఇది 1.43 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ W5 Gen 1 ప్రాసెసర్‌తో రానుంది. ఈ స్మార్ట్‌వాచ్ Google WearOSలో రన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ పరికరం అన్ని ఆరోగ్య సెన్సార్లతోపాటు స్పోర్ట్స్ మోడ్‌లో కూడా పనిచేస్తుందని టెక్ వర్గాలు అంటున్నాయి. దీంతోపాటు SpO2 ట్రాకింగ్, నిద్ర ట్రాకింగ్, IP68 రేట్, ఫాస్ట్ ఛార్జింగ్, మంచి బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు బాగున్నాయని చెబుతున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:29 PM