Share News

Google Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక.. వెంటనే అలా చేయకపోతే..

ABN , Publish Date - Feb 09 , 2024 | 09:30 PM

మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం తీవ్ర హెచ్చరికను జారీ చేసింది.

Google Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక.. వెంటనే అలా చేయకపోతే..

మీరు గూగుల్ క్రోమ్ (Google Chrome) వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. గూగుల్ క్రోమ్‌లో ఉన్న లోపాల గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది. వెంటనే స్పందించి గూగుల్ క్రోమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. లేకపోతే మీ సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపింది. తాజాగా సెర్ట్ ఈ హెచ్చరికను జారీ చేసింది (Google Chrome Update).

గూగుల్‌ క్రోమ్ ని ఉపయోగిస్తున్న వాళ్ళందరూ లేటెస్ట్ వెర్షన్‌ని తక్షణమే అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ సూచించింది. 114.0.5735.350 లేదా ఆ తర్వాతి వెర్షన్లకు అప్‌డేట్ కావాలని తెలిపింది. అంతకు ముందు ఉండే వెర్షన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందట. ఆ వెర్షన్స్‌లో ఎక్స్‌టెన్షన్లకు డేట్ ఇన్‌పుట్ లేదని, బ్రౌజ్ చేసేటప్పుడు సమాచారం లీక్ అవుతోందని తెలిపింది. ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా తెలియని, అనుమానాస్పద వెబ్‌సైట్‌లను ఓపెన్ చేసినపుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. తెలియని ఐడీల నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Updated Date - Feb 09 , 2024 | 09:51 PM