Share News

Air Conditioners: ఏసీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ రూ.30 వేలలోపు ఏసీలు ఇవే..

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:36 PM

బడ్జెట్ ఫ్రెండ్లీ ఏసీలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రూ.30 వేలకు అటూఇటూగా ఉన్న ఈ ఏసీలను మధ్యతరగతి కుటుంబాలు ఈజీగా కొనుగోలు చేయవచ్చు. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్‌లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

Air Conditioners: ఏసీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ రూ.30 వేలలోపు ఏసీలు ఇవే..

ఢిల్లీ: అసలే వేసవికాలం.. ఆపై నగరాలు, పట్టణాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు. ఇంకేమైనా ఉంటుందా.. చమటలు, ఉక్కపోతలతో 3 నెలలు ఇబ్బందులు తప్పవు. దీనికి పరిష్కారంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఎవరి ఆర్థిక వెసులుబాటును బట్టి వారు ఈ మూడింటిలో ఏదో ఒకటి కొనుగోలు చేస్తారు.

ఏసీ ధర ఎక్కువగా ఉంటుందనే భావనతో దాని జోలికి వెళ్లరు. అలాంటి వారి కోసమే బడ్జెట్ ఫ్రెండ్లీ ఏసీలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రూ.30 వేలకు అటూఇటూగా ఉన్న ఈ ఏసీలను మధ్యతరగతి కుటుంబాలు ఈజీగా కొనుగోలు చేయవచ్చు. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్‌లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

Voltas Split AC 1.4 Ton

ఈ ఏసీ రూ.30,990 ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. నెలకు రూ. 1,502 ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇది రిమోట్ కంట్రోల్, ఇన్వర్టర్ కంప్రెసర్, డస్ట్ ఫిల్టర్‌తో వస్తుంది.

Godrej 1.5 Ton 3 Star, 5-in-1 Convertible Cooling, Inverter Split AC

ఈ మోడల్ ఏసీ డిస్కౌంట్ ధరతో రూ.30,990కి లభిస్తుంది. దీని MRP రూ.45,400గా ఉంది. 1.5 లీటర్ 5 ఇన్ 1 కన్వర్టబుల్ స్ప్లిట్ AC 40 శాతం నుంచి 110 శాతం వరకు కూలింగ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ AC 3 స్టార్ రేటింగ్, ఒక ఏడాది ప్రొడక్షన్ వారంటీ, PCBపై 5 సంవత్సరాలు, కంప్రెసర్‌పై 10 సంవత్సరాల వారంటీని కలిగి ఉంది.

Lloyd 1.5 Ton 3 Star Inverter Split AC (5 in 1 Convertible)

Amazonలో దీని ధర రూ. 32,990గా ఉంది. MRP ధర రూ.58,990. త్రీ-స్టార్ స్ప్లిట్ AC ఏడాది ఉత్పత్తి వారంటీ, 5 సంవత్సరాల కాంపోనెంట్ (PCBతో సహా) వారంటీ, కంప్రెసర్‌పై 10 సంవత్సరాల వారంటీతో కలిపి వస్తుంది. ఈ 5 ఇన్ 1 కన్వర్టిబుల్ AC 52-డిగ్రీ సెల్సియస్, క్లీన్ ఎయిర్ ఫిల్టర్ + PM 2.5 ఎయిర్ ఫిల్టర్, 4 మీ లాంగ్ ఎయిర్ త్రో, టర్బో కూల్, తక్కువ గ్యాస్ డిటెక్షన్, క్లీన్ ఫిల్టర్ ఇండికేషన్ వంటి ఫీచర్లు కలిగి ఉంది.


Lloyd 0.8 Ton 3 Star Inverter Split AC (5 in 1 Convertible)

Lloyd 0.8 Ton ధర రూ. 26,990గా ఉంది. దీని MRP రూ.47,990 ఉండగా.. దాదాపు 20 వేల తగ్గింపుతో వస్తోంది. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌ని కలిగి ఉంది. 3 స్టార్ రేటింగ్‌తో 0.75 టన్నుల స్ప్లిట్‌తో ఉండటంతో 90 చదరపు అడుగుల వరకు ఉండే చిన్న లేదా మధ్య తరహా గదులకు అనుకూలంగా ఉంటుంది.

Carrier 1 Ton 3 Star AI Flexicool Inverter Split AC

ఈ ఏసీ ధర రూ. 29,990. దీని MRP రూ.56,990. 1-టన్ను స్ప్లిట్ AC 3-స్టార్ రేటింగ్‌తో వస్తుంది. AC ఆక్వా క్లియర్ ప్రొటెక్షన్‌తో 100% కాపర్ కండెన్సర్ కాయిల్‌ని కలిగి ఉంటుంది. HD, PM 2.5 ఫిల్టర్‌తో డ్యూయల్ ఫిల్ట్రేషన్‌తో కన్వర్టిబుల్ 4-ఇన్-1 కూలింగ్ AC, టర్బో కూల్ ఫీచర్, దీర్ఘకాలిక సౌకర్యం కోసం హైడ్రో బ్లూ కోటింగ్, రిఫ్రిజెరాంట్ లీకేజ్ డిటెక్టర్, ADC సెన్సార్ వంటి ఫీచర్లు కలిగి ఉంది.

Voltas 1 Ton 3 Star Split Inverter AC

దీని ధర రూ. 28,990 కాగా MRP ధర రూ.56,990గా ఉంది. ఒక టన్ను AC ఉత్పత్తిపై సంవత్సరం వారంటీ, కంప్రెసర్‌పై 10 సంవత్సరాల వారంటీ వస్తుంది. ఇది టర్బో మోడ్, స్లీప్ మోడ్, ఎనర్జీ సేవర్ మోడ్‌తో వస్తుంది. బాక్స్‌లో ఇండోర్ యూనిట్, అవుట్‌డోర్ యూనిట్, రిమోట్, కనెక్ట్ చేసే పైపులు, యూజర్ మాన్యువల్‌ని పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ACని కొనుగోలు చేస్తే, అదనపు స్టాండర్డ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీగా రూ.1,599 చెల్లించాలి. ఈ అమౌంట్‌ని సర్వీస్ ఇంజినీర్‌కు నేరుగా చెల్లించాలి.

Updated Date - Mar 20 , 2024 | 04:36 PM