Share News

5G Network: 4 Gని మించిన 5 G నెట్‌వర్క్ వినియోగం.. ఎన్ని ఫోన్లలో ఉందంటే

ABN , Publish Date - Mar 20 , 2024 | 03:42 PM

దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 4 జీ టెక్నాలజీలో నివసించిన భారతీయులు నెమ్మదిగా 5 జీ నెట్‌వర్క్ వైపు మళ్లుతున్నారు. దీంతో 4 జీ నెట్ వర్క్ కంటే 5 జీ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

5G Network: 4 Gని మించిన 5 G నెట్‌వర్క్ వినియోగం.. ఎన్ని ఫోన్లలో ఉందంటే

ఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 4 జీ టెక్నాలజీలో నివసించిన భారతీయులు నెమ్మదిగా 5 జీ నెట్‌వర్క్ వైపు మళ్లుతున్నారు. దీంతో 4 జీ నెట్ వర్క్ కంటే 5 జీ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. 2022 అక్టోబర్‌లో ప్రధాని మోదీ 5జీ నెటవర్క్‌ని విజయవంతంగా ఆవిష్కరించారు. అప్పటి నుంచి 2024 వరకు భారత్‌లో 3.6 రెట్ల కంటే ఎక్కువ మొబైల్ డేటాను ఉపయోగించారు. 2023లో ప్రతి వినియోగదారుడి నెలవారీ ట్రాఫిక్ కూడా 24 శాతం పెరిగిందని, ప్రతి యూజర్ నెలకు 24.1 గిగాబైట్‌ల ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్లు బుధవారం ప్రదర్శించిన నోకియా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ నివేదికలో వెల్లడైంది.

భారత్‌లో 5G టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని 796 మిలియన్ మొబైల్ డివైజ్‌లలో 134 మిలియన్ డివైజ్‌లు 5 జీ నెట్‌వర్క్ కలిగి ఉన్నాయి. నివేదిక ప్రకారం.. 5G డేటా వినియోగం భారత్‌లో 4G కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. 2023లో, వినియోగదారులు గత ఐదేళ్లలో 26 శాతం CAGRతో నెలకు 17.4 ఎక్సాబైట్‌లను వినియోగించారు. భారత్ అంతటా 5G టెక్నాలజీ అద్భుతమైన విస్తరణ, సూపర్-ఫాస్ట్ 5G డేటా స్పీడ్‌ కోసం డిమాండ్ పెరుగుతోందని నోకియా మొబైల్ నెట్‌వర్క్స్ బిజినెస్ హెడ్ తరుణ్ ఛబ్రా అన్నారు.


5G అన్ని టెలికాం సర్కిల్‌లలో గణనీయమైన వృద్ధిని కనబరిచింది. మొబైల్ డేటా ట్రాఫిక్‌లో 5జీ 20 శాతం వాటాను చేరుకుంది. మెరుగైన 5G లభ్యత, పనితీరు, విస్తృత శ్రేణి పరికరాల లభ్యతతో పాటు కొత్త డేటా-ఇంటెన్సివ్ యాప్‌లు, సేవల పరిచయం భవిష్యత్తులో 5G వృద్ధిని వేగవంతం చేస్తుందని నివేదిక వెల్లడించింది.

5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) పెరుగుదల, గృహ, వ్యాపారం రెండింటిలోనూ నూతన సేవలకు కీలకమైన ఎనేబుల్‌గా ఉపయోగపడుతుంది. FWA వినియోగదారులు సగటు 5G వినియోగదారుల కంటే 2.5 రెట్లు ఎక్కువ డేటాను వినియోగిస్తారని నివేదిక అంచనా వేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2024 | 03:43 PM