Share News

Dinesh Karthik: ఆ సమయంలో కార్తీక్ చేసిన సహాయం మరువలేనన్న కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకున్న దీపిక..!

ABN , Publish Date - May 24 , 2024 | 12:26 PM

సీనియ‌ర్ ఆటగాడు, వికెట్ కీప‌ర్‌ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా జరిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఓడిపోయి ఐపీఎల్ నుంచి నిష్క్ర‌మించింది. ఈ ఓట‌మి అనంత‌రం ఐపీఎల్‌కు కార్తీక్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

Dinesh Karthik: ఆ సమయంలో కార్తీక్ చేసిన సహాయం మరువలేనన్న కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకున్న దీపిక..!
Dinesh Karthik

సీనియ‌ర్ ఆటగాడు, వికెట్ కీప‌ర్‌ బ్యాటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా జరిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఓడిపోయి ఐపీఎల్ (IPL 2024)నుంచి నిష్క్ర‌మించింది. ఈ ఓట‌మి అనంత‌రం ఐపీఎల్‌కు కార్తీక్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు (Dinesh Karthik Retirement). కార్తీక్‌కు బెంగ‌ళూరు ఆట‌గాళ్లు ఘ‌నంగా వీడ్కోలు చెప్పారు. ఈ వెట‌ర‌న్ ప్లేయ‌ర్‌ను గార్డ్ ఆఫ్ హాన‌ర్‌తో గౌర‌వించారు. కార్తీక్ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతుండగా అత‌డికి రెండు వైపులా బెంగ‌ళూరు ఆట‌గాళ్లు నిల్చొని చ‌ప్ప‌ట్ల‌తో సాగ‌నంపారు. తాజాగా ఆర్సీబీ ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది.


దినేష్ కార్తీక్‌తో అనుబంధం గురించి విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆ వీడియోలో మాట్లాడాడు. ``దినేష్ కార్తీక్‌ను తొలిసారి 2009లో కలిశాను. ఛాంపియన్స్ ట్రోపీ కోసం దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతడితో పరిచయం ఏర్పడింది. అతడు అద్భుతమైన క్రికెటర్ మాత్రమే కాదు.. గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి. చాలా చక్కగా ఆలోచిస్తాడు. 2022లో నేను ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నప్పుడు కార్తీక్ నాతో మాట్లాడేవాడు. నా ఆట గురించి అతడికి ఏం అనిపిస్తోందో నాతో చెప్పేవాడు. దాంతో నాకు చాలా విషయాల్లో స్పష్టత వచ్చింద``ని కోహ్లీ పేర్కొన్నాడు.


ఇక, దినేష్ కార్తీక్ భార్య దీపిక (Deepika Pallikal) కూడా ఆ వీడియోలో మాట్లాడింది. కార్తీక్ కెరీర్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. కార్తీక్ కెరీర్ పట్ల తాను చాలా గర్వంగా ఉన్నానని, రిటైర్మెంట్ తర్వాత అతడు తమతో ఎక్కువ సమయం గడుపుతాడనే ఆలోచన సంతోషం కలిగిస్తోందని దీపిక పేర్కొంది. దీపిక అంతర్జాతీయ స్క్వాష్ ప్లేయర్ అనే సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

IPL 2024: రేపటి SRH vs RR మ్యాచ్‌లో గెలుపెవరిది.. వర్షం వస్తే ఎవరికి లాభం?


IPL : ఇద్దరికీ ఇదే లాస్ట్‌ చాన్స్‌


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 24 , 2024 | 12:28 PM