Share News

ప్రీతిస్మిత వరల్డ్‌ రికార్డు

ABN , Publish Date - May 24 , 2024 | 02:55 AM

భారత వెయిట్‌ లిఫ్టర్‌ ప్రీతిస్మిత భోయ్‌ వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షి్‌ప్సలో అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల 40 కిలోల విభాగంలో 15 ఏళ్ల ప్రీతిస్మిత క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో ప్రపంచ రికార్డు తిరగరాసింది...

ప్రీతిస్మిత వరల్డ్‌ రికార్డు

స్వర్ణంతో మెరిసిన భారత లిఫ్టర్‌

లిమా (పెరూ): భారత వెయిట్‌ లిఫ్టర్‌ ప్రీతిస్మిత భోయ్‌ వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షి్‌ప్సలో అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల 40 కిలోల విభాగంలో 15 ఏళ్ల ప్రీతిస్మిత క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో ప్రపంచ రికార్డు తిరగరాసింది. 75 కిలోల గత ప్రపంచ రికార్డును ఆమె 76 కిలోలు ఎత్తడం ద్వారా అధిగమించింది. స్నాచ్‌లో 57 కేజీలు ఎత్తిన ఆమె..టోటల్‌గా 133 కేజీల బరువెత్తి స్వర్ణ పతకం కొల్లగొట్టింది. భారత్‌కు చెందిన జోష్న సబర్‌ (56+69=125కి.) రజతం, టర్కీ లిఫ్టర్‌ ఫత్మా (55+65=120కి.) కాంస్యపతకం నెగ్గారు. మహిళల 45 కి.లలో పాయల్‌ రజతం, పురుషుల 49 కి.లలో బాబూలాల్‌ కాంస్య పతకం గెలిచారు.

Updated Date - May 24 , 2024 | 06:40 AM