Share News

Ravichandran Ashwin: ‘ఆల్ టైమ్ గ్రేట్’ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ రచిచంద్రన్ అశ్విన్

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:49 PM

భారతీయ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా ‘ఆల్ టైమ్ గ్రేట్’ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో బెన్ డకెట్, ఒల్లీ పోప్ వికెట్లను తీసిన అశ్విన్ టెస్ట్ ఫార్మాట్‌లో స్వదేశంలో 351 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో తనకంటే ముందున్న అనిల్ కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు.

కాగా అశ్విన్, కుంబ్లే మినహా టెస్టుల్లో మరే ఇతర భారతీయ బౌలర్ స్వదేశంలో 300 వికెట్లు పడగొట్టలేదు. 265 వికెట్లతో హర్భజన్ సింగ్ మూడవ స్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ 219 వికెట్లు, రవీంద్ర జడేజా- 210 వికెట్లు (4వ టెస్టులో 1వ ఇన్నింగ్స్ వరకు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే శ్రీలంక మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన స్వదేశంలో ఏకంగా 493 వికెట్లు తీశాడు. టెస్టుల్లో మొత్తం 800 వికెట్లు తీసిన మురళీధరన్ సగానికిపైగా స్వదేశంలోనే కావడం గమనార్హం. ఇక టెస్టుల్లో 700వ వికెట్‌కు చేరువలో ఉన్న ఇంగ్లండ్ దిగ్గజ జేమ్స్ అండర్సన్ స్వదేశంలో 434 వికెట్లు తీశాడు. ఇక మరో ఇంగ్లండ్ స్టార్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో మొత్తం 604 వికెట్లు తీయగా స్వదేశంలో 398 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌‌లో పర్యాటక జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను అశ్విన్ దెబ్బకొట్టాడు. కీలకమైన వికెట్లు తీశాడు. కాగా అశ్విన్ ఇటీవలే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉండడం గమనార్హం.

Updated Date - Feb 25 , 2024 | 03:49 PM