Share News

Rajamouli-David Warner: రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ వార్నర్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

ABN , Publish Date - Apr 12 , 2024 | 07:52 PM

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు క్రికెట్‌తో పాటు యాక్టింగ్‌పై కూడా మంచి మక్కువ ఉంది. అతడు హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఆడే సమయంలో తరచుగా తెలుగు సినిమాలకు సంబంధించిన సన్నివేశాల్లో నటించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు.

Rajamouli-David Warner: రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ వార్నర్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!
రాజమౌళి- డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు (David Warner) క్రికెట్‌తో పాటు యాక్టింగ్‌పై కూడా మంచి మక్కువ ఉంది. అతడు హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఆడే సమయంలో తరచుగా తెలుగు సినిమాలకు సంబంధించిన సన్నివేశాల్లో నటించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. దక్షిణాది స్టార్ హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలను ఇమిటేట్ చేస్తూ వీడియోలను రూపొందించేవాడు. తాజాగా వార్నర్, భారత స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) కలిసి ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.


ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) కోసం వీరిద్దరూ కలిసి ఓ ఫన్నీ యాడ్‌లో నటించారు. ఆ యాడ్ ఓపెనింగ్‌లో ``మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి`` అని వార్నర్‌ను రాజమౌళి అడుగుతాడు. ``రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది`` అని వార్నర్ బదులిస్తాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ.. ``నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?`` అని అడుగుతాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం తనతో ఓ సినిమా చేయాలని వార్నర్ కండీషన్ పెడతాడు. అప్పుడు షూటింగ్ మొదలవుతుంది (Funny Video).


వార్నర్ అల్లరి, అతడి ప్రశ్నలు, డైలాగులకు రాజమౌళికి చిరాకు వేస్తుంది. ``ఆస్కార్ వేదికగా కలుద్దాం``, ``నాకు గుర్రం వద్దు.. కంగారూ కావాలి`` అంటూ వార్నర్ చెప్పిన డైలాగులు నవ్వులు పూయిస్తాయి. చివరకు ఆ సినిమా ఆలోచన మానుకుని క్రెడ్ యాప్‌ను రాజమౌళి డౌన్‌లోడ్ చేసుకోవడంతో యాడ్ ముగుస్తుంది. ఈ వీడియోను క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ టెక్నాలజీ అంబానీకి కూడా తెలియదేమో.. వధూవరులు దండలు మార్చుకోవడానికి ఎలా వచ్చారో చూడండి..


Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని ఆంగ్ల అక్షరాన్ని కనిపెట్టండి..!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 07:53 PM