Share News

Viral Video: ఈ టెక్నాలజీ అంబానీకి కూడా తెలియదేమో.. వధూవరులు దండలు మార్చుకోవడానికి ఎలా వచ్చారో చూడండి..

ABN , Publish Date - Apr 12 , 2024 | 07:17 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఆసక్తికర ఘటనలు, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. పెళ్లి వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది.

Viral Video: ఈ టెక్నాలజీ అంబానీకి కూడా తెలియదేమో.. వధూవరులు దండలు మార్చుకోవడానికి ఎలా వచ్చారో చూడండి..
వధూవరులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Wedding) సీజన్ నడుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఆసక్తికర ఘటనలు, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. పెళ్లి వీడియోలను (Wedding Videos) సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతం అలాంటిదే ఓ వైరల్ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓ వివాహ వేడుకలో వధూవరుల ఎంట్రీ కోసం చేసిన ఏర్పాటు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది (Viral Video).


razz_chandan అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వివాహ వేదికపై రెండు ప్రత్యేకమైన చక్రాల డిజైన్లను ఉంచారు. వధూవరులు చెరో దానిపై దండలు పట్టుకుని నిల్చున్నారు. అనంతరం ఆ రెండూ ఒకదానికొకటి చేరువగా వచ్చాయి. అప్పుడు వధూవరులు ఒకరి మెడలో మరొకరు దండలు వేసుకున్నారు. వెనుక వైపు డిజైన్ లవ్ సింబల్ ఆకారంలోకి మారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. పది లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఈ టెక్నాలజీని అంబానీ కూడా భరించలేడు``, ``ఇది అన్నయ్య బీటెక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అయి ఉంటుంది``, ``రెండు హృదయాలు కలిశాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: కాలుష్యం తగ్గించడానికి ఏం చేయాలి? స్టూడెంట్ రాసిన ఆన్సర్ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!


Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని ఆంగ్ల అక్షరాన్ని కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 07:17 PM