Share News

Pro Kabaddi League : ఫైనల్లో పట్నా గీ హరియాణా

ABN , Publish Date - Dec 28 , 2024 | 02:52 AM

ప్రొకబడ్డీ లీగ్‌ టైటిల్‌ పోరుకు పట్నా పైరేట్స్‌, హరియాణా స్టీలర్స్‌ అర్హత సాధించాయి.

 Pro Kabaddi League : ఫైనల్లో పట్నా గీ హరియాణా

పుణె: ప్రొకబడ్డీ లీగ్‌ టైటిల్‌ పోరుకు పట్నా పైరేట్స్‌, హరియాణా స్టీలర్స్‌ అర్హత సాధించాయి. ఆదివారం ఇరు జట్ల మధ్య ఫైనల్‌ జరుగుతుంది. శుక్రవారం జరిగిన తొలి సెమీ్‌సలో హరియాణా 28-25 తేడాతో యూపీ యోధా్‌సను ఓడించింది. రైడర్‌ శివమ్‌ పతారె ఏడు పాయింట్లు సాధించగా, యూపీ నుంచి గగన్‌ గౌడ 10 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. అనంతరం మరో సెమీ్‌సలో పట్నా జట్టు 32-28 తేడాతో దబాంగ్‌ ఢిల్లీపై నెగ్గింది. రైడర్‌ దేవాంక్‌, ఆయన్‌ ఎనిమిదేసి పాయింట్లతో కీలకంగా నిలిచారు. ఢిల్లీ రైడర్‌ అషు మాలిక్‌ 9 పాయింట్లతో పోరాడాడు.

Updated Date - Dec 28 , 2024 | 02:55 AM