Share News

Nitish Reddy: ఇదీ.. తెలుగోడి సత్తా.. నితీశ్‌పై పాట్ కమిన్స్ ప్రశంసలు

ABN , Publish Date - Apr 10 , 2024 | 08:21 AM

మంగళవారం పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సాధించిన విజయంలో తెలుగు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అత్యంత ప్రధాన పాత్ర పోషించాడని చెప్పుకోవడంలో సందేహం లేదు. కీలకమైన వికెట్లు కోల్పోయి జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు.. అతను అద్భుత ప్రదర్శన కనబరిచి తన జట్టుకి భారీ స్కోరు అందించడంలో సహాయం చేశాడు.

Nitish Reddy: ఇదీ.. తెలుగోడి సత్తా.. నితీశ్‌పై పాట్ కమిన్స్ ప్రశంసలు

మంగళవారం (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్‌పై (Punjab Kings) సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు సాధించిన విజయంలో తెలుగు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అత్యంత ప్రధాన పాత్ర పోషించాడని చెప్పుకోవడంలో సందేహం లేదు. కీలకమైన వికెట్లు కోల్పోయి జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు.. అతను అద్భుత ప్రదర్శన కనబరిచి తన జట్టుకి భారీ స్కోరు అందించడంలో సహాయం చేశాడు. కేవలం 37 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సుల సహకారంతో 64 పరుగులు చేసి అదరహో అనిపించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి బరిలోకి వచ్చిన అతను.. వరుస వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురవ్వకుండా ఒంటరి పోరాటం చేశాడు.

తెలుగోడి సత్తా

తొలుత క్రీజులో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్న నితీశ్.. ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాల్ని అర్థం చేసుకొని, వారిపై ఎదురుదాడికి దిగాడు. సమర్థవంతంగా బౌలర్లను ఎదుర్కొంటూ.. అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే 32 బంతుల్లో అర్థశతకం చేసి, తన తొలి ఐపీఎల్ అర్థశతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత మరింత విజృంభించిన అను.. 172.97 స్ట్రైక్ రేట్‌తో 37 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. కేవలం బ్యాట్‌తోనే కాదు.. బౌలింగ్‌లోనూ తన సత్తా చాటాడు. 3 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చిన ఇతను.. జితేశ్ శర్మ (Jitesh Sharma) లాంటి డేంజరస్ బ్యాటర్ వికెట్ తీసి, సన్‌రైజర్స్ గేమ్‌పై బలమైన పట్టు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.


ఇలా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నితీశ్ సత్తా చాటుకోవడంతో.. కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. గత వారం తన డెబ్యూ మ్యాచ్‌లోనే అతడు తన ట్యాలెంట్ నిరూపించుకున్నాడని, ఇప్పుడు జట్టు విజయంలో తనే హీరోగా నిలిచాడని పొగడ్తలతో ముంచెత్తాడు. పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘గతవారం నితీశ్ అద్భుత అరంగేట్రం చేశాడు. తన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టుకి మంచి స్కోరుని అందించడంతో పాటు.. ఫీల్డింగ్, బౌలింగ్‌లోనూ మెరుగ్గా రాణించాడు. అతను అమేజింగ్‌గా బ్యాటింగ్ చేయడం వల్లే సన్‌రైజర్స్ 180 పరుగుల మార్క్‌ని దాటింది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

World Cup: టీ20 వరల్డ్ కప్ జట్టులో రిషబ్ పంత్?

కేవలం ఒక్క పాట్ కమిన్స్ మాత్రమే కాదండోయ్.. మాజీతో పాటు ఇతర సినియర్ ఆటగాళ్లు సైతం నితీశ్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ‘ఫ్యూచర్ సూపర్ స్టార్’ అంటూ కితాబిస్తున్నారు. ఎక్స్ మాధ్యమంగా హనుమ విహారి (Hanuma Vihari) ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ‘‘నితీశ్ నుంచి ఇది చిన్న గ్లింప్స్ మాత్రమే.. అతనికి మరిన్ని అవకాశాలు కల్పిస్తే.. భవిష్యత్తులో అతనొక గొప్ప క్రికెటర్‌గా మారుతాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో పాటు మీడియం పేస్ బౌలింగ్ వేయగలడు. ఇలాంటి ప్రతిభ గల వాళ్లు అరుదుగా దొరుకుతారు’’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 08:50 AM