Share News

MS Dhoni: విమానంలో సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం.. ధోనీ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!

ABN , Publish Date - May 25 , 2024 | 04:31 PM

టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా అతడి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ధోనీ ఆడుతున్నాడు. ఇకపై ఐపీఎల్‌కు కూడా ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి.

MS Dhoni: విమానంలో సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం.. ధోనీ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
Dhoni in Economy Class

టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా అతడి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌లో (IPL 2024) మాత్రమే ధోనీ ఆడుతున్నాడు. ఇకపై ఐపీఎల్‌కు కూడా ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ధోనీ ఎప్పటికీ రిటైర్ కాకూడదని అతడి అభిమానులు కోరుకుంటుంటారు. ఇటీవల బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన చెన్నై ఐపీఎల్ 2024 నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.


ఈ మ్యాచ్ అనంతరం ధోనీ బెంగళూరు నుంచి తన స్వస్థలం అయిన రాంచీ (Ranchi)కి పయనమయ్యాడు. అయితే ఆ ప్రయాణంలో ధోనీ ఓ సాధారణ ప్రయాణికుడిలా విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాడు. తన లగేజీని తనే పైన పెట్టుకుని సీటులో కూర్చున్నాడు. ధోనీని ఎకానమీ క్లాస్‌లో చూసిన ప్రయాణికులు షాకయ్యారు. అతడి నిరాడంబరతను చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @ChakriDhoni17 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Dhoni in Economy Class).


ఈ వీడియోకు లక్షల్లో లైక్‌లు వచ్చాయి. ధోనీ సింప్లిసిటీ చూసి చాలా మంది ఫిదా అయ్యారు. ``చాలా గొప్ప వ్యక్తిత్వం. ఎప్పుడూ సింపుల్‌గానే ఉంటాడు``, ``చాలా విభిన్నమైన మనిషి``, ``ఆ విమానంలో ఉన్నవారంతా ఎంతో లక్కీ``, ``ధోనీ పక్క సీటులో కూర్చున్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు``, ``అందుకే అందరికీ ధోనీ అంటే ఇష్టం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

IPL 2024: చాహల్ పేరిట అత్యంత చెత్త రికార్డు.. క్లాసెన్ కొట్టిన ఆ సిక్స్ చూస్తే..


IPL 2024: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం కురుస్తుందా.. వెదర్ రిపోర్ట్ ఏం చెబుతుంది


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 25 , 2024 | 04:31 PM