Share News

Cricket: వీడెవడ్రా బాబు ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. పవర్ ప్లేలో సెంచరీ దాటిన స్కోర్..

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:42 AM

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. పరుగుల వరద పారుతుంటే.. మరోవైపు దేశీవాలీ క్రికెట్‌లోనూ ఐపీఎల్‌ను మించిన పరుగు వర్షం కురుస్తోంది. మహారాష్ట్రకు చెందిన క్రికెటర్లు ఆడే పూణే ఒలింపియా టీ 20 లీగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా..

Cricket: వీడెవడ్రా బాబు ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. పవర్ ప్లేలో సెంచరీ దాటిన స్కోర్..

ప్రస్తుతం ఐపీఎల్ (IPL) సీజన్ నడుస్తోంది. పరుగుల వరద పారుతుంటే.. మరోవైపు దేశీవాలీ క్రికెట్‌లోనూ ఐపీఎల్‌ను మించిన పరుగు వర్షం కురుస్తోంది. మహారాష్ట్రకు చెందిన క్రికెటర్లు ఆడే పూణే ఒలింపియా టీ 20 లీగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం పూణేలో షిండే హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎన్ఓకే 99 జట్టు 6 ఓవర్ల పవర్ ప్లేలో ఏకంగా 123 పరుగులు చేసింది. రిక్రేషన్ క్రికెట్ క్లబ్, ఎన్ఓకే 99 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎన్ఓకే 99 ఆటగాడు సుభమ్ తైస్వాల్ ఒకే ఓవర్ల 6 సిక్స్‌లు కొట్టాడు. అంతేకాదు 14 బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తిచేశాడు. అంతేకాదు 32 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తైస్వాల్ ఆఫ్ సెంచరీలో 46 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. ఈ మ్యాచ్ చూస్తున్న క్రికెట్ అభిమానులకు గురువారం జరిగిన బెంగళూరు, ముంబయి ఐపీఎల్ మ్యాచ్‌ను ఈ మ్యాచ్ గుర్తు చేసిందని చెప్పుకోవచ్చు.

ముంబై మురిసె..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 10:42 AM