Share News

IPL 2024: రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమికి కారణాలివే..ఇలా చేయకుంటే

ABN , Publish Date - Apr 07 , 2024 | 06:58 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా royal challengers bangalore జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ సీజన్‌లో ఆర్‌సీబీ(RCB) నాలుగో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచులో ఆర్‌సీబీ ఓటమికి ప్రధానంగా గల కారణాలను ఇప్పుడు చుద్దాం.

IPL 2024: రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమికి కారణాలివే..ఇలా చేయకుంటే

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా royal challengers bangalore జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ సీజన్‌లో ఆర్‌సీబీ(RCB) నాలుగో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచులో ఆర్‌సీబీ ఓటమికి ప్రధానంగా గల కారణాలను ఇప్పుడు చుద్దాం. అలా చేయకుంటే తప్పకుంటే మ్యాచ్ గెలిచేదని క్రీడా వర్గాలు అంటున్నాయి. అవేంటో ఇక్కడ చుద్దాం. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అయితే రాజస్థాన్ రాయల్స్(RR) ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కోహ్లి సెంచరీ తర్వాత రాజస్థాన్ రాయల్స్ నుంచి బట్లర్ సెంచరీ సాధించాడు.


క్యాచ్ మిస్

జైస్వాల్ రూపంలో తొలి వికెట్‌ను సున్నాకి కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ జట్టును ఆర్‌సీబీ ఒత్తిడిలో పడేసింది. కానీ అదే సమయంలో ఆర్‌సీబీ(royal challengers bangalore)కి మరో వికెట్ దక్కే అవకాశం వచ్చింది. బట్లర్ 6 పరుగుల వద్ద క్యాచ్ ఇవ్వగా, కామెరాన్ గ్రీన్(cameron green) ఆ బంతిని మిస్ చేశాడు. తర్వాత బట్లర్ 58 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.

బ్యాడ్ బౌలింగ్

మయాంక్ డాగర్(mayank dagar) RCB బౌలర్లలో అత్యంత చెత్తగా వేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే అత్యధిక ఎకానమీ రేటు(17)తో పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో డాగర్ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఏకంగా 34 రన్స్ ఇచ్చాడు.


మాక్స్‌వెల్

ఇక గ్లెన్ మాక్స్‌వెల్(glenn maxwell) బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు RCBకి చివరి 5 ఓవర్లకు పైగా మిగిలి ఉంది. ఆ క్రమంలో మాక్స్‌వెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే జట్టు స్కోర్ 200 పరుగులు దాటే అవకాశం ఉంది. కానీ దానిని అతను వినియోగించుకోలేదు. కేవలం 3 బంతుల్లో 1 పరుగు చేసి ఔట్ అయ్యాడు.

కోహ్లీ

మరోవైపు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(virat kohli) 72 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓటమికి విరాట్ కోహ్లీ కూడా ఓ కారణమని పలువురు అంటున్నారు. ఎందుకంటే కోహ్లీ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా ఉందని చెబుతున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత, RCB మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా నిరాశకు గురయ్యాడు.


ఇది కూడా చదవండి:

రాజస్థాన్‌ జోష్‌

రాళ్లను మోస్తూ.. పర్వతాలు ఎక్కుతూ

మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 07 , 2024 | 07:00 AM