Share News

Riyan Parag: ప్రపంచకప్ చూడాలని లేదు.. టాప్-4లో ఎవరుంటే నాకేంటి: రియాన్ పరాగ్ సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:41 PM

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తనకు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు లభించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఆ అసంతృప్తిని వెల్లడించే క్రమంలో సంచలన కామెంట్స్ చేశాడు

Riyan Parag: ప్రపంచకప్ చూడాలని లేదు.. టాప్-4లో ఎవరుంటే నాకేంటి: రియాన్ పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
Riyan Parag

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ (Riyan Parag) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తనకు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు లభించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఆ అసంతృప్తిని వెల్లడించే క్రమంలో సంచలన కామెంట్స్ చేశాడు. ఐపీఎల్‌ (IPL 2024)లో మెరుగైన ప్రదర్శన చేసిన రియాన్ పరాగ్‌ను టీ-20 ప్రపంచకప్ (T20 World Cup) కోసం తీసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే సెలక్టర్లు పరాగ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అతడు టీ-20 ప్రపంచకప్ చూడాలని లేదని వ్యాఖ్యానించాడు.


``నేను జట్టులో ఉండుంటే ప్రపంచకప్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తి, ఒత్తిడి ఉండేది. కానీ, నేను టీమ్‌లో లేను. కాబట్టి నాకు దానిపై పెద్దగా ఆసక్తి లేదు. టాప్-4లో ఎవరుంటారని కూడా ఆలోచించడం లేదు. నిజం చెప్పాలంటే నాకు ప్రపంచకప్ చూడాలనే ఆసక్తి కూడా లేదు. చూడను కూడా. టైటిల్ సాధించింది ఎవరో తెలుసుకుని సంతోషపడతా. జట్టులో లేకపోవడంతో నేను ప్రపంచకప్ గురించి ఎలాంటి ఆలోచనలూ చేయను`` అని పరాగ్ కామెంట్స్ చేశాడు.


గతంలో కూడా రియాన్ పరాగ్ ఇలాంటి కామెంట్లతోటే వార్తల్లోకెక్కాడు. ``ఏదో ఒక సమయంలో నన్ను జాతీయ జట్టులోకి తీసుకోక తప్పని పరిస్థితి వస్తుంది. అప్పుడు తప్పకుండా టీమిండియా తరఫున ఆడతా. ఆ సమయం ఎప్పుడనేది నేను చెప్పలేను. కానీ నేను అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే టైమ్ వస్తుంద``ని పరాగ్ వ్యాఖ్యానించాడు. 22 ఏళ్ల ఈ అసోం కుర్రాడు ఈ ఐపీఎల్‌లో 150 స్ట్రైక్ రేట్‌తో 573 పరుగులు చేసి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.

ఇవి కూడా చదవండి..

T20 Worlcup: రోహిత్, కోహ్లీ, సూర్య వల్ల ఆ ఉపయోగం లేదు.. తుది జట్టు విషయంలో ఆ జాగ్రత్త తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్


Hardik Pandya: జీవితంలో చాలా చెడును ఎదుర్కొన్నా.. నేనెప్పుడూ భయపడి పారిపోను: హార్దిక్ పాండ్యా


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 03 , 2024 | 12:42 PM