Share News

India vs Pakistan: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌లో గెలిచేది ఎవరో చెప్పేసిన వసీం అక్రమ్!

ABN , Publish Date - Jun 09 , 2024 | 03:28 PM

టీ20 ప్రపంచ కప్‌ 2024లో (T20 World Cup 2024) భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్ (India vs Pakistan) జట్ల మధ్య హైవోల్టేజీ మ్యాచ్ మరికొద్ది సేపట్లోనే షురూ కానుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు దాయాదుల మధ్య జరగనున్న ఈ క్రికెట్ సమరం కోసం ‘క్రికెట్ ప్రపంచం’ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

India vs Pakistan: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌లో గెలిచేది ఎవరో చెప్పేసిన వసీం అక్రమ్!

టీ20 ప్రపంచ కప్‌ 2024లో (T20 World Cup 2024) భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్ (India vs Pakistan) జట్ల మధ్య హైవోల్టేజీ మ్యాచ్ మరికొద్ది సేపట్లోనే షురూ కానుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు దాయాదుల మధ్య జరగనున్న ఈ క్రికెట్ సమరం కోసం ‘క్రికెట్ ప్రపంచం’ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇక మ్యాచ్‌లో గెలుపుపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. న్యూయార్క్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమైన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలు వకార్ యూనిస్, వసీం అక్రమ్ తమ అంచనాలను వెలువరించారు.


సంచలన రీతిలో అమెరికా చేతిలో ఓడిపోయినప్పటికీ, ఆటగాళ్లు పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టే హాట్ ఫేవరెట్ అని వకార్ అంచనా వేశాడు. కాగా రోహిత్ సేనకే అధిక అవకాశాలు ఉన్నాయని వసీమ్ అక్రమ్ అభిప్రాయపడ్డాడు.


భారత్‌కే ఎక్కువ అవకాశాలు..

‘‘ నా మనసు పాకిస్థాన్ అని చెబుతోంది. ఈ టోర్నమెంట్‌లో నేను గమనించిన దానిని బట్టి న్యూయార్క్‌లోని నసావు పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంది. కాబట్టి ఇరు జట్లకు పరిస్థితులు సమానంగా ఉంటాయి’’ అని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వకార్ యూనిస్ అంచనా వేశారు. అయితే భారత్‌కు గెలుపు అవకాశం 60 శాతం అవకాశం ఉందని వసీం అక్రమ్ అంచనా వేశాడు. అయితే పాకిస్థాన్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ లేదా స్పెల్‌ వస్తే పరిస్థితులు మారిపోవచ్చునని విశ్లేషించాడు. టీమిండియా ఫామ్‌ని బట్టి చూస్తే మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ఫేవరెట్‌ టీమ్ అని, మెరుగైన జట్టు అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. అందుకే భారత్‌కు 60 శాతం, పాకిస్థాన్‌కు 40 శాతం గెలుపు అంచనాను ఇస్తానని, అయితే ఇది టీ20 మ్యాచ్ అని, ఒక ఇన్నింగ్స్ లేదా స్పెల్ వస్తే మ్యాచ్ మలుపు తిరుగుతుందని విశ్లేషించాడు.


కాగా టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్‌, పాకిస్థాన్‌ ఇప్పటివరకు చెరో మ్యాచ్ మాత్రమే ఆడాయి. ఐర్లాండ్‌ను భారత్ చిత్తు చేయగా.. సహ-అతిథ్య దేశం అమెరికా చేతిలో పాకిస్థాన్‌ చిత్తుగా ఓడిపోయిన విషయాలు తెలిసిందే.

Updated Date - Jun 09 , 2024 | 03:28 PM