RR vs PBKS: రాజస్థాన్ రాయల్స్‌కు ఓటమి తప్పదా? పంజాబ్ ముందు సునాయాస లక్ష్యం!
ABN , Publish Date - May 15 , 2024 | 09:41 PM
ఐపీఎల్-2024 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చతికిలపడ్డారు. గువహటి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగారు.
గువాహటి: ఐపీఎల్-2024 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చతికిలపడ్డారు. గువహటి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ముందు 145 పరుగుల సునాయాస లక్ష్యం ఉంది. రాజస్థాన్ బ్యాటర్లలో యువ సంచలనం రియాన్ పరాగ్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు.
రియాన్ పరాగ్ 48 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్ (28), టామ్ (18), సంజూ శాంసన్ (18), ట్రెంట్ బౌల్ట్ (12), యశస్వి జైస్వాల్ (4), ఫెరీరా (7), రోవ్‌మాన్ పావెల్ (4), ధ్రువ్ జురెల్ (0), ఆవేశ్ ఖాన్ (3 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్ల సమష్టిగా రాణించారు. సామ్ కర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలో రెండేసి వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లీస్ చెరో వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.