RCB vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
ABN , Publish Date - May 09 , 2024 | 07:15 PM
ఐపీఎల్-2024లో భాగంగా.. గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
ఐపీఎల్-2024లో భాగంగా.. గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ఆర్సీబీ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఈ ఐపీఎల్‌లో ఇరుజట్లు.. 11 మ్యాచ్‌లు ఆడి.. 4 విజయాలు, 7 ఓటములు నమోదు చేశాయి. ఈ రెండు జట్లకు ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న మాట వాస్తవమే గానీ.. గెలిచిన జట్టుకి సాంకేతికంగా ప్లేఆఫ్స్‌కు చేరే ఛాన్స్ ఉంటుంది. అంటే.. నెట్ రన్‌రేట్ మీద ఆధారపడాలి. అందుకే.. ఈ మ్యాచ్‌ని ఇరుజట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాల్సిందేనన్న పట్టుదలతో బరిలోకి దిగాయి. మరి.. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు సత్తా చాటుతుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొత్తం ఐపీఎల్‌లో ఇప్పటివరకూ పంజాబ్, ఆర్సీబీ జట్లు 32 సార్లు తలపడ్డాయి. వాటిల్లో పంజాబ్ 17 విజయాలతో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. ఆర్సీబీ 15 విజయాలు సాధించాయి. ఆ 32 మ్యాచ్‌ల్లో ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ జరగ్గా.. బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలిచింది. మరి.. ఈ సీజన్‌లో రెండోసారి పంజాబ్‌తో తలపడుతున్న ఆర్సీబీ ఆ జట్టుపై అదే జైత్రయాత్రని కొనసాగిస్తుందా? లేకపోతే ఆర్సీబీకి షాక్ ఇచ్చి పంజాబ్ కింగ్స్ తన ప్రతీకారం తీర్చుకుంటుందా? అనేది వేచిచూడాలి.
తుది జట్లు
ఛాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటిదార్, మహిపాల్ లామ్రోర్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తిక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, ఫెర్గూసన్.
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రిలీ రూసో, శశాంక్ సింగ్, సామ్ కరన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టో్న్, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, విధ్వత్ కావేరప్ప.