Share News

KKR vs RR: శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - Apr 16 , 2024 | 09:30 PM

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దుమ్ము దులిపేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (56 బంతుల్లో 109) సెంచరీతో శివాలెత్తడం వల్లే.. కేకేఆర్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది.

KKR vs RR: శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) దుమ్ము దులిపేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (Sunil Narine) (56 బంతుల్లో 109) సెంచరీతో శివాలెత్తడం వల్లే.. కేకేఆర్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. అతనితో పాటు రఘవంశీ (Raghuvamshi) (30) సైతం క్రీజులో ఉన్నంతవరకూ మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లో ఐదు ఫోర్లతో 30 పరుగులు చేసి.. జట్టుకి భారీ స్కోరుని అందించడంలో తనవంతు కృషి చేశాడు.


మొదట్లో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు. ఓపెనర్లుగా వచ్చిన ఫిల్ సాల్ట్, సునీల్‌ను భారీ షాట్లు కొట్టనివ్వకుండా.. బాగానే కంట్రోల్ చేయగలిగారు. అదే టైంలో ఫిల్ సాల్ట్ వికెట్ తీసి.. కేకేఆర్‌ని కాస్త ఒత్తిడిలో పడేశారు. అనంతరం.. కేకేఆర్ బ్యాటర్లు తన బ్యాట్‌కి పని చెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. సునీల్ నరైన్ భారీ షాట్‌లతో విరుచుకుపడ్డాడు. తానూ ఏం తక్కువ తినలేన్నట్టు.. రఘువంశీ కూడా చెలరేగాడు. ఇలా వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్‌కి 85 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడినా.. నరైన్ ఊచకోత మాత్రం ఆగలేదు. ఎడాపెడా షాట్లతో చితక్కొట్టేశాడు. అయితే.. సెంచరీ చేసిన వెంటనే అతడు ఔట్ అయ్యాడు. 18వ ఓవర్‌లో 109 వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యి, పెవిలియన్ బాట పట్టాడు.

ఇక చివర్లో వచ్చిన రింకూ శర్మ.. ఎప్పట్లాగే మెరుపులు మెరిపించాడు. అతినికి పెద్దగా ఆడే అవకాశం దొరకలేదు కానీ, ఉన్నంతలో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. 9 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సుల సహకారంతో 20 పరుగులు చేశాడు. ఇక రాజస్థాన్ బౌలర్ల విషయానికొస్తే.. కుల్దీప్, అవేశ్ తలా రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్, చాహల్ చెరో వికెట్ తీశారు. అయితే.. అశ్విన్ (49), చాహల్ (54), కుల్దీప్ (46) మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరి.. కేకేఆర్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు ఛేధించగలుగుతుందా? లేదా? అన్నది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 09:30 PM