Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరడం అంటే ఇదే.. సునామీతో సెల్ఫీ తీసుకున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:08 PM

సునామీ వస్తుంటే ఓ మహిళ తీరిగ్గా దానితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. రాకాసి అల సమీపిస్తుండగా ఓ మహిళ సెల్ఫీ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరడం అంటే ఇదే.. సునామీతో సెల్ఫీ తీసుకున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..

సునామీ (Tsunami) వస్తున్నప్పుడు ఎవరైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోవాలనుకుంటారు. సముద్రం భయంకర విశ్వరూపాన్ని చూసి బెంబేలుపడతారు. అయితే ఓ మహిళ మాత్రం సునామీ వస్తుంటే తీరిగ్గా దానితో సెల్ఫీ (Selfie) తీసుకునేందుకు ప్రయత్నించింది. రాకాసి అల సమీపిస్తుండగా ఓ మహిళ సెల్ఫీ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు (Selfie with Tsunami).

@cctvidiots అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ సముద్రం ఒడ్డున సెల్ఫీ వీడియో షూట్ చేస్తోంది. ఆ సమయంలో సముద్రం విశ్వరూపం దాల్చి భారీ అల తీర ప్రాంతాన్ని ముంచెత్తడానికి వస్తోంది. అక్కడున్న వారందరూ ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అయితే ఆ మహిళ మాత్రం పారిపోకుండా ఆ అల ముందు నిల్చుని వీడియో షూట్ చేసింది. అల ధాటికి కింద పడిపోయి కొట్టుకుపోతున్నా సరే ఆమె మాత్రం ఆ సెల్ఫీ స్టిక్‌ను వదల్లేదు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``ఆమె చాలా మూర్ఖంగా ప్రవర్తించింది``, ``పరిగెత్తినా ప్రాణాలు దక్కవని భావించి ఆమె ఆ క్షణంలో జీవించేందుకు ప్రయత్నించింది``, ``ఆమె పరిస్థితి ఏమైంది``, ``సునామీతో సెల్ఫీనా? ఇదెక్కడి పిచ్చి``, ``ఆమెకు మరో దారి లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 03 , 2024 | 04:08 PM