Share News

Shocking: ఆన్‌లైన్ ద్వారా బట్టలు ఆర్డర్ చేసింది.. పార్సిల్ లోపల ఊహించని వస్తువు.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:11 PM

అమెరికాలోని టెన్నసీకి చెందిన ఓ మహిళకు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

Shocking: ఆన్‌లైన్ ద్వారా బట్టలు ఆర్డర్ చేసింది.. పార్సిల్ లోపల ఊహించని వస్తువు.. ఏం జరిగిందంటే..

ఈ-కామర్స్ సైట్లు అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) చేసేందుకే మక్కువ చూపుతున్నారు. ఇంట్లోనే కూర్చుని తమకు కావాల్సిన వాటిని రప్పించకుంటున్నారు. చాలా సార్లు వినియోగదారులు ఎంచుకున్న వస్తువులే డెలివరీ అవుతుంటాయి. అయితే అప్పుడప్పుడు మాత్రం మోసాలు జరుగుతుంటారు. అమెరికాలోని (America) టెన్నసీకి చెందిన ఓ మహిళకు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

టెన్నసీకి చెందిన అన్నా ఎలియట్ అనే మహిళ షెన్ అనే యాప్ ద్వారా బట్టలు (Clothes) ఆర్డర్ చేసింది. అయితే ఆమెకు వచ్చిన పార్సిల్‌లో బట్టలు లేవు. టెస్ట్ కోసం సేకరించిన బ్లడ్ వయిల్ ఉంది. అది చూసి ఆమె షాకైంది. దాని మీద టెస్టింగ్ కంపెనీ పేరు తప్ప ఇంకేం వివరాలు లేవు. దీంతో అన్నా ఆ వయిల్‌ను సదరు టెస్టింగ్ కంపెనీకి పంపించింది. దానిపై స్పందించిన టెస్టింగ్ కంపెనీ.. తాము ఎప్పుడూ అలాంటి వయిల్స్‌ను వ్యక్తులకు పంపలేదని, డాక్టర్లకు మాత్రమే పంపిస్తామని తెలిపింది. ఆ ఘటనపై అంతర్గత విచారణ చేపడతామని తెలిపింది.

ఈ ఘటనపై షెన్ కూడా విచారణ జరిపింది. తమ వైపు నుంచి ఎక్కడా తప్పు జరగలేదేని, షిప్పింగ్ సమయంలోనే తప్పు జరిగినట్టు గుర్తించామని వెల్లడించింది. తాము ఆ మహిళ ఆర్డర్ చేసిన బట్టలనే ప్యాకింగ్ చేసి పంపించామని తెలిపింది. కాగా, ఈ ఘటనపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా విచారణ జరుపుతోంది.

Updated Date - Mar 16 , 2024 | 02:11 PM