Share News

Watch Video: వామ్మో.. ఈ వీడియో చూస్తే అసహ్యం కలగడం ఖాయం.. శాండ్‌విచ్ ఎలా తింటోందో చూడండి..

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:50 PM

జపాన్‌కు చెందిన యువతి ఈగలు విపరీతంగా వాలుతున్న శాండ్‌విచ్‌ను ఏ మాత్రం సంకోచం లేకుండా తినేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch Video: వామ్మో.. ఈ వీడియో చూస్తే అసహ్యం కలగడం ఖాయం.. శాండ్‌విచ్ ఎలా తింటోందో చూడండి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో ఆశ్చర్యకర వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని విజ్ఞానాన్ని అందించేవి అయితే, మరికొన్ని ఆశ్చర్యపరిచేవి అయి ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం అసహ్యం వేయడం ఖాయం. ఆ వీడియోలోని యువతి తేనెటీగలు (Bees) విపరీతంగా వాలుతున్న శాండ్‌విచ్‌ను (Sandwich) ఏ మాత్రం సంకోచం లేకుండా తినేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

qringey అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న వీడియోలో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక మహిళ శాండ్‌విచ్ తింటోంది. దాని మీద తేనెటీగలు విపరీతంగా వాలుతున్నాయి. అయినా ఆ జపనీస్ మహిళ ఏ మాత్రం సంకోచించకుండా చాలా ఉత్సాహంతో ఆ బ్రెడ్ తినేస్తోంది. పదుల సంఖ్యలో తేనెటీగలు వచ్చి దానిపై వాలుతున్నాయి. రెండు, మూడు తేనెటీగలు కూడా ఆ యువతి నోట్లోకి వెళ్లిపోయాయి. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు (Woman ate bees).

వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 90 లక్షల మందికి పైగా వీక్షించారు. 56 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఆమె బ్రెడ్‌తో పాటు రెండు, మూడు తేనెటీగలను కూడా తినేస్తోంది``, ``సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు``, ``తేనెటీగలను కూడా తినడం ఏంటి``, ``ఆమె తేనెటీగలపై ప్రతీకారం తీర్చుకుంటోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 25 , 2024 | 04:50 PM