Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెండేళ్ల పాపను ఈడ్చుకెళ్లిన తోడేలు.. తర్వాతేం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:35 PM

వన్య ప్రాణాలు ఆవాసాల కోసం, ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. జనావాసాల వైపు వచ్చేసి వారికి హాని కలిగిస్తున్నాయి.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెండేళ్ల పాపను ఈడ్చుకెళ్లిన తోడేలు.. తర్వాతేం జరిగిందో చూడండి..

అభివృద్ధి పేరుతో, రహదారుల కోసం అడవులు కొట్టేయడం ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతోంది. దీంతో వన్య ప్రాణాలు ఆవాసాల కోసం, ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. జనావాసాల వైపు వచ్చేసి వారికి హాని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ తోడేలు (Wolf) ఓ చిన్న పాపపై దాడి చేసింది. ఆ చిన్నారిని (Girl) లాక్కెళ్లి తినేసేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి తన కారును ఇంటి బయట పార్క్ చేస్తున్నాడు. కారు డోర్ తెరిచి లోపలికి ఏదో తీసుకెళ్తున్నాడు. ఆ వ్యక్తి రెండేళ్ల కూతురు కూడా కారు దిగి ఇంటి వైపు వెళుతోంది. ఇంతలో ఓ తోడేలు ఆ పాపను నోటితో పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ పాప భయంతో గట్టిగా అరవడం మొదలు పెట్టింది. కుమార్తె గొంతు విన్న వెంటనే ఆ వ్యక్తి తోడేలు వైపు పరిగెత్తాడు. కుమార్తెను రక్షించడానికి తోడేలుపై దాడి చేశాడు.

Viral Video: నీటిలో మొసలి.. ఒడ్డుపై సింహం.. ఆ జింక తన ప్రాణాలు ఎలా కాపాడుకుందో చూడండి..

ఆ తోడేలు అతడిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. అతడు ఓ కర్ర తీసుకుని దాని మీదకు విసిరి దానిని తరిమేశాడు. @crazyclipsonly అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను ఇప్పటివరకు 22 లక్షల మంది వీక్షించగా, 5 వేల మందికి పైగా లైక్ చేశారు. ``ఆ తోడేలు చాలా ఆకలితో ఉంది``, ``ఆ తండ్రి సరైన సమయంలో స్పందించాడు``, ``తోడేళ్లు మనుషులు మీద దాడి చేస్తాయా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 24 , 2024 | 03:36 PM