Share News

Viral: యజమాని అలా అనడంతో వెంటనే ఉద్యోగం మానేస్తున్నట్టు మెయిల్ చేశాడు.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Feb 26 , 2024 | 06:44 PM

ఉద్యోగం చేయడం చాలా కష్టంగా మారితే, మానేయాల్సిన పరిస్థితులు వస్తే ఎవరైనా కొన్ని వందల సార్లు ఆలోచిస్తారు. అయితే ఓ వ్యక్తి తన బాస్ మాటలు తట్టుకోలేక అప్పటికప్పుడే రాజీనామా చేసేవాడు.

Viral: యజమాని అలా అనడంతో వెంటనే ఉద్యోగం మానేస్తున్నట్టు మెయిల్ చేశాడు.. అసలేం జరిగిందంటే..

ప్రతి ఒక్కరూ తమ అవసరాలను తీర్చుకోవడం కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఉద్యోగం (Job) చేస్తుంటారు. ఉద్యోగం నచ్చినా, నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగుతారు. ఉద్యోగం చేయడం చాలా కష్టంగా మారితే, మానేయాల్సిన పరిస్థితులు వస్తే కొన్ని వందల సార్లు ఆలోచిస్తారు. అయితే ఓ వ్యక్తి (Employee) తన బాస్ (Boss) మాటలు తట్టుకోలేక అప్పటికప్పుడే రాజీనామా (Resign) చేసేవాడు. తన రాజీనామా మెయిల్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.

ఆ వ్యక్తి తనకెదురైన పరిస్థితి గురించి రెడ్డిట్‌లో షేర్ చేశాడు. ``మా బాస్ విషం లాంటి మాటలతో వేధిస్తుంటాడు. గతంలో ఒకసారి అందరి ముందు నా గురించి చులకనగా మాట్లాడాడు. తాజాగా మరోసారి కూడా అలాగే దుర్భాషలాడాడు. ఇక, నేను నియంత్రణ కోల్పోయాను. వెంటనే ఉద్యోగం మానెయ్యాలని నిర్ణయించుకున్నాను. నా రాజీనామాను మెయిల్ చేశాను`` అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 43 వేల మంది ఈ పోస్ట్‌ను చూశారు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ``నేను కూడా త్వరలో ఇలాగే చేయబోతున్నాను``, ``ఇలా మీరు ఉద్యోగం వదిలేయడానికి కారణమైన వ్యక్తులు.. దీనిని అస్సలు పట్టించుకోరు``, ``విషపూరిత వాతావరణంలో పని చేయలేం``, ``ఇక, విశ్రాంతి తీసుకో మిత్రమా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 26 , 2024 | 06:44 PM