Share News

Viral Video: వామ్మో.. ఇతను మనిషా? రోబోనా? మెరుపు వేగంతో టైపింగ్ ఎలా చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:23 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటి ద్వారా చాలా మంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. కొందరు ప్రదర్శించే అసాధారణ ట్యాలెంట్ చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది.

Viral Video: వామ్మో.. ఇతను మనిషా? రోబోనా? మెరుపు వేగంతో టైపింగ్ ఎలా చేస్తున్నాడో చూడండి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటి ద్వారా చాలా మంది ప్రతిభ (Talent Videos) వెలుగులోకి వస్తోంది. కొందరు ప్రదర్శించే అసాధారణ ట్యాలెంట్ చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video)లోని ఓ వ్యక్తి టైపింగ్ స్పీడ్ (Typing Speed) చూస్తే నివ్వెరపోక తప్పదు. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. sachkadwahai అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మెడికల్ షాప్‌లో పని చేస్తున్న వ్యక్తి అత్యంత వేగంగా టైప్ చేస్తున్నాడు. మెడికల్ షాప్ కౌంటర్‌లో కూర్చుని అతి వేగంగా బిల్లులను ఎంటర్ చేస్తున్నాడు. కీబోర్డ్‌ వైపు చూడకుండా సెకన్ల వ్యవధిలో మెరపు వేగంతో మందుల పేర్లను టైప్ చేసేస్తున్నాడు. ఆ వ్యక్తి ట్యాలెంట్‌ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 85 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది కూడా ఇంత వేగంగా పని చేస్తే బాగుణ్ను``, ``ఈ వ్యక్తి మెడికల్ షాప్‌లో తన ట్యాలెంట్‌ను వేస్ట్ చేస్తున్నాడు``, ``ఇలాంటి వాళ్లు రైల్వే కౌంటర్‌లో ఉంటే పొడవైన లైన్లు ఉండవు``, ``రోబో కంటే స్పీడ్‌గా ఉన్నాడు``, ``ఏం ఎంటర్ చేస్తున్నాడో అతడికైనా అర్థమవుతోందా``, ``అద్భుతమైన ట్యాలెంట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Jan 21 , 2024 | 01:23 PM