Share News

Funny Video: వార్నీ.. ఎలక్ట్రిక్ కారును ఇలా నెట్టుకోవాలా?.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:37 PM

పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు కొంటున్నారు. అయితే అవి భారత పరిస్థితులకు పూర్తి అనుకూలంగా లేకపోవడంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Funny Video: వార్నీ.. ఎలక్ట్రిక్ కారును ఇలా నెట్టుకోవాలా?.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!

ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ యుగం నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల (EV Vehicles) వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు కొంటున్నారు. అయితే అవి భారత పరిస్థితులకు పూర్తి అనుకూలంగా లేకపోవడంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే నవ్వకుండా ఉండలేం. ఓ ఎలక్ట్రిక్ కారు (EV Car) ఘాట్ రోడ్డు ఎక్కలేకపోతుండడంతో అందులోని వారు వెరైటీగా దానిని నెట్టారు (Funny Video).

ఆశిష్ తివారీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఎలక్ట్రిక్ కారు ఓ కొండ మార్గం గుండా వెళుతోంది. బహుశా ఇంజిన్ తక్కువ సామర్థ్యం కలిగినది కావడం వల్ల ఆ ఎలక్ట్రిక్ కారు ముందుకు వెళ్లలేకపోతోంది. దీంతో కారులోని వారు డోర్లు తీసి తమ కాళ్లను రోడ్డుపై పెట్టి కారును ముందుకు నెడుతున్నారు. కారు సమాంతర రోడ్డులోకి ప్రవేశించిన తర్వాత వారు డోర్లు వేసుకుని కూర్చున్నారు. ఈ ఘటనను వెనుక కారులో వస్తున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 1.25 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై ఫన్నీగా స్పందించారు. ``ఇది స్వావలంబన భారతదేశం``, ``ఈ టెక్నాలజీ భారత్ దాటి బయటకు వెళ్లకూడదు``, ``కారులో కూర్చుని వ్యాయామం చేసే మార్గం ఇదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 18 , 2024 | 04:37 PM