Share News

Viral Video: వామ్మో.. అప్పడాలను ఇలా తయారు చేస్తారా? ఇకపై తినడానికి కూడా భయపడతారేమో..

ABN , Publish Date - Feb 06 , 2024 | 05:39 PM

ఎంతో మంది ఇష్టంగా తినే అప్పడాలను ఎలా తయారు చేస్తారో తెలుసా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ కావాల్సిందే.

Viral Video: వామ్మో.. అప్పడాలను ఇలా తయారు చేస్తారా? ఇకపై తినడానికి కూడా భయపడతారేమో..

సాంబార్ అన్నంతో అయినా, పప్పన్నంతో అయినా అప్పడాలు (Papads) కలిపి తింటే ఆ రుచే వేరు. చాలా మంది, ముఖ్యంగా దక్షిణ భారతీయులు అప్పడాలను ఇష్టంగా తింటారు. ఇళ్లలోనూ, హోటళ్లలోనూ అప్పడాలను ఎక్కువగా వాడుతుంటారు. మరి, అలాంటి అప్పడాలను ఎలా తయారు చేస్తారో తెలుసా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Papads Making Video) చూస్తే షాక్ కావాల్సిందే. కనీస పరిశుభ్రత పాటించకుండా అప్పడాలను తయారు చేస్తుండడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

streetfoodrecipe అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ స్టవ్‌పై పెద్ద కుండను ఉంచి, దాని మూతపై అప్పడాల పిండిని వేసింది. ఆ పిండి గట్టి పడిన తర్వాత వేరే పాత్రలో వేసింది. వాటిని ఓ మహిళ కట్టర్‌తో అప్పడాల సైజ్‌లో కట్ చేస్తోంది. అయితే అలా కట్ చేయడానికి ఆమె తన పాదాలను ఉపయోగించడం చాలా మందిని కలవరపెడుతోంది. ఈ వీడియో (Viral Video) నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 7.7 కోట్ల మందికి పైగా వీక్షించారు. 15.8 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ వీడియో చూశాక అప్పడాలు తినడం కష్టం``, ``ఆమె తన కాళ్లను ఉపయోగించే వరకు అంతా బాగానే ఉంది``, ``వైన్‌ను చేసేందుకు కూడా కాళ్లనే ఉపయోగిస్తారు. దానిని కొనేందుకు వేలల్లో ఖర్చు పెడతారు``, ``కుటీర పరిశ్రమల్లో అన్ని సౌకర్యాలూ ఉండవు``, ``ఇందులో పెద్ద తప్పేం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 05:39 PM