Share News

Shocking Video: మీరు తరచుగా పన్నీర్ తింటుంటారా?.. ఇలా తయారయ్యే పన్నీర్ తింటే అనారోగ్యం ఖాయం..

ABN , Publish Date - Feb 26 , 2024 | 07:09 PM

ప్రోటీన్లను పుష్కలంగా కలిగి ఉండే పన్నీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పన్నీర్‌ను తయారు చేసే ప్రక్రియలో కొందరు వ్యక్తులు హానికర రసాయనాలను వాడుతున్నారు.

Shocking Video: మీరు తరచుగా పన్నీర్ తింటుంటారా?.. ఇలా తయారయ్యే పన్నీర్ తింటే అనారోగ్యం ఖాయం..

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పన్నీర్‌ (Paneer)ను ఇటీవలి కాలంలో చాలా మంది ఇష్టంగా తింటున్నారు. పన్నీర్‌తో రకరకాల వంటకాలు చేసుకుంటున్నారు. ప్రోటీన్లను పుష్కలంగా కలిగి ఉండే పన్నీర్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే పన్నీర్‌ను తయారు చేసే ప్రక్రియలో కొందరు వ్యక్తులు హానికర రసాయనాలను వాడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)లోని అల్వార్ జిల్లాలోని పనీర్ ఫ్యాక్టరీలో చిత్రీకరించిన వీడియో చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది (Paneer Making).

ఈ ఫ్యాక్టరీలో పెద్ద మొత్తంలో పన్నీర్ తయారు చేస్తున్నారు. ఈ తయారీ విధానం చూస్తుంటే ఈ పన్నీర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? హాని చేస్తుందా? అని ఆలోచించవలసి ఉంటుంది. ఈ కర్మాగారంలో పెద్దపెద్ద కంటైనర్లలో పన్నీర్‌ను తయారు చేస్తున్నారు. పన్నీర్ తయారు చేయడానికి పాలు సరిపోతాయి. కానీ, ఈ కర్మాగారంలో జున్ను తయారు చేయడానికి సున్నం (Lime White), పామాయిల్ కూడా ఉపయోగిస్తున్నారు. అంతే కాదు ఆ ఫ్యాక్టరీ పూర్తిగా అపరిశుభ్రంగా ఉంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ``ఇక పన్నీర్ తినడం మానేసి.. చికెన్ తినండి``, ``ఈ వీడియో భయానకంగా ఉంది``, ``సున్నంతో పన్నీర్ తయారు చేస్తున్నారా? వీళ్లు నరకానికి వెళతారు``, ``ఈ పన్నీర్ తింటే ఏం జరుగుతుంది?``, ``అనారోగ్యం కావాలంటే ఈ పన్నీర్ తినాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 26 , 2024 | 07:09 PM