Share News

Viral Video: ఏం ఐడియా గురూ.. రూపాయి ఖర్చు లేకుండా ఈ వేసవిలో చన్నీళ్ల స్నానం ఎలా చేయొచ్చో చూడండి..

ABN , Publish Date - Apr 02 , 2024 | 03:42 PM

ప్రస్తుతం వేసవి ఆరంభంలోనే వేడి దడదడలాడిస్తోంది. ఇప్పుడే ఎండ, వేడి, వడగాలులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వేడిని తట్టుకోవడానికి ప్రజలు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు.

Viral Video: ఏం ఐడియా గురూ.. రూపాయి ఖర్చు లేకుండా ఈ వేసవిలో చన్నీళ్ల స్నానం ఎలా చేయొచ్చో చూడండి..

ప్రస్తుతం వేసవి (Summer) ఆరంభంలోనే వేడి దడదడలాడిస్తోంది. ఇప్పుడే ఎండ, వేడి, వడగాలులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వేడిని తట్టుకోవడానికి ప్రజలు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఎండ కారణంగా ట్యాంక్ లోని నీరు (Water) వేడెక్కిపోతోంది. దీంతో ఓ వ్యక్తి అద్బుతమైన ప్లాన్ వేసి చన్నీళ్ల స్నానానికి (Ice Bath) ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఐడియా చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Video).

high.br అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో షవర్ కింద ఫిల్టర్‌ను ఇనుప తీగలతో కట్టి ఉంచారు. ఆ ఫిల్టర్‌లో ఐస్ క్యూబ్‌లు వేశారు. షవర్‌లోని నీరు ఐస్ క్యూబ్‌లతో కలిసి చల్లబడిన తర్వాత క్రిందికి రావడం వస్తోంది. ఈ అద్భుతమైన ఐడియా ద్వారా రూపాయి ఖర్చు కూడా లేకుండానే ఐస్ బాత్ సాధ్యమవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది జనాలను ఆకట్టుకుంటోంది.

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.5 కోట్ల మందికి పైగా వీక్షించారు. 4.3 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ``ఈ టెక్నిక్ భారత్ దాటి వెళ్లకూడదు``, ``ఈ వేసవికి ఇదే బెస్ట్ ఐడియా``, ``అంబానీ చూస్తే షాక్ అవుతాడు``, ``భారత్‌లో తెలివితేటలకు కొదవ లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్లకు టెస్ట్!.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురు పిల్లలను 8 సెకెన్లలో కనిపెట్టండి..!

Kaviya Maran: సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆమె గురించి ఈ విషయాలు తెలిస్తే..

Updated Date - Apr 02 , 2024 | 03:42 PM