Share News

Viral: తండ్రి మరణంతో సెలవు తీసుకున్న మహిళా ఉద్యోగి.. మెసేజ్ లో ఆమె బాస్ ఏమన్నాడంటే..!

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:08 PM

నేను సెలవు తీసుకున్నందుకు నా బాస్ పంపిన మెసేజ్ ఇదంటూ ఆమె స్క్రీన్ షాట్ షేర్ చేసి మరీ తన బాధ బయటకు చెప్పుకుంది.

Viral: తండ్రి మరణంతో సెలవు తీసుకున్న మహిళా ఉద్యోగి.. మెసేజ్ లో ఆమె బాస్ ఏమన్నాడంటే..!

కార్పోరేట్, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగస్థులకు తమ పై అధికారుల నుండి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. పని విషయంలో కింది ఉద్యోగస్థులతో ఎంతో సన్నిహితంగా ఉండే బాస్ లు సెలవులు, శాలరీ పెంపుదల దగ్గరకు వచ్చేసరికి అగ్గిమీద గుగ్గిలం అవుతుంటారు. ఓ మహిళా ఉద్యోగి తన తండ్రి మరణించిన కారణంగా ఆఫీసుకు సెలవు తీసుకుంది. దీని తరువాత ఆమె బాస్ ఆమెకు చేసిన మెసేజ్ చాలా షాకింగ్ గా ఉంది. నేను సెలవు తీసుకున్నందుకు నా బాస్ పంపిన మెసేజ్ ఇదంటూ ఆమె సదరు చాటింగ్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. దీన్ని చూసిన నెటిజన్లు బాస్ మీద గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కొన్ని కంపెనీలు ఉద్యోగస్థులకు సెలవులు ఇవ్వడంలో చాలా దారుణంగా ఉంటాయి. ఈ విషయమై చాలామంది ఉద్యోగస్థులు అసంతృప్తి వెళ్లగక్కుతుంటారు. ఓ మహిళా ఉద్యోగి తన తండ్రికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆఫీసుకు సెలవు తీసుకుంది. ఆమె తండ్రిని హాస్పిటల్ లో చేర్పించి వైద్యం ఇప్పించినా ఆయన ప్రాణాలు నిలవలేదు. హాస్పిటల్ కు తీసుకెళ్లడం, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడంతో పాటూ ఆయన మరణించిన తరువాత కూడా మరో రెండురోజులు.. మొత్తం 10రోజుల సెలవు తీసుకుంది సదరు మహిళా ఉద్యోగి. ఆ తరువాత ఆమె తిరిగి ఆఫీసుకు వెళ్లగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెను ఉద్యోగంలో నుండి తొలగిస్తున్నానంటూ ఆమె బాస్ నుండి ఆమెకు మెసేజ్ వచ్చింది.

ఇది కూడా చదవండి: జుట్టు పెరుగుదలను అమాంతం పెంచే యోగాసనాలు ఇవీ..!


rd.jpg

ఈ మొత్తం విషయాన్ని సదరు మహిళ Reddit అనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇది చూసిన నెటిజన్లు ఉద్యోగిని బాస్ మీద నిప్పులు చెరుగుతున్నారు. అతన్ని విమర్మిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మహిళ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా అలా ప్రవర్తించడం దారుణం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు తమకు ఆఫీసులో ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 03:35 PM