Share News

Viral: వామ్మో.. చేతులతో ఏకంగా రైలును ముందుకు తోసిన ప్రయాణికులు!

ABN , Publish Date - Jun 08 , 2024 | 09:58 PM

బీహార్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో కొందరు ప్రయాణికులు రైలును ముందుకు తోశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Viral: వామ్మో.. చేతులతో ఏకంగా రైలును ముందుకు తోసిన ప్రయాణికులు!

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డుపై నిలిచిపోయిన బైక్, కారు లేదా బస్సును ముందుకు తోసే దృశ్యాలు మనం నిత్యం చూస్తుంటాం. ఒకరు సరిపోకపోతే పలువురు కలిసి వాహనాలను పక్కకు తోసి ట్రాఫిక్‌కు సాగిపోయేలా చేస్తుంటారు. కానీ, ఓ రైలును ప్రయాణికులు ముందుకు తోయడమనేది చాలా అరుదుగా మాత్రమే జరిగే ఘటన. అందుకే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది.

బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలోగల కియూల్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, జూన్ 6న కియుల్ స్టేషన్‌లో పట్నా, ఝార్ఖండ్ ప్యాసెంజర్ రైలులో మంటలు చెలరేగాయి. మహిళల కోచ్‌లల్లో అగ్గి రాజుకోవడంలో ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే ప్యాసెంజర్లు, అధికారులు రంగంలోకి దిగారు. మంటలు చెలరేగుతున్న బోగీలను మిగతా ట్రెయిన్ నుంచి విడదీశారు. ఆ తరువాత రైలును ప్రయాణికులందరూ ముందుకు తోసారు. కొన్ని వందల మంది కలబడి రైలు తోయడంతో అది సునాయాసంగా ముందుకు కదిలించింది (Viral Video Shows Passengers Pushing Train Coach at Kiul Junction).

Viral: గుడ్లను తింటున్న పాము! ఏం చేయలేక నిస్సహాయంగా బాతులు! ఇంతలో సడెన్‌గా..


నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. భారతీయులు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తారంటూ కామెంట్ చేశారు. ఇలాంటి వాళ్లు రైళ్లనే కాదు విమానాల్ని కూడా తోయగలరని కొందరు అన్నారు.

కాగా, ముంబైలో కూడా ఇటీవల ఇలాంటి ఘటన తాలూకు వీడియో వెలుగు చూసింది. నవీముంబైలోని వాశీ స్టేషన్‌లో ఓ వ్యక్తి రైలు కింద చిక్కుకోవడంతో అతడి కాపాడేందుకు తోటి ప్రయాణికులు రైలును ముందకు కదిపారు. రైలు కాస్త ముందుకు జరిగాక అతడిని జాగ్రత్తగా బయటకు లాగారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ ట్రెండ్ అయ్యింది. అయితే, నిబంధనలు అతిక్రమిస్తూ రైలు పట్టాలు దాటే క్రమంలో ఆ వ్యక్తి రైలు కింద చిక్కుకున్నాడని అప్పట్లో రైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 09:58 PM